లక్ష్యం (సినిమా)

2007 సినిమా From Wikipedia, the free encyclopedia

లక్ష్యం (సినిమా)

లక్ష్యం గోపీచంద్, జగపతి బాబులు ప్రధాన పాత్రలో నటించగా, శ్రీవాస్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన ఓ తెలుగు సినిమా. నల్లమలపు శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత. జగపతి బాబుకు ఈ సినిమాలో నటనకు ఉత్తమ సహాయనటుడిగా, నంది పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు దక్కాయి.[2]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
లక్ష్యం
(2007 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం శ్రీవాస్
నిర్మాణం నల్లమలపు శ్రీనివాస్
కథ శ్రీవాస్
చిత్రానువాదం గోపీమోహన్
తారాగణం గోపీచంద్, అనుష్క, జగపతి బాబు, యశపాల్ శర్మ, ఆలీ, రఘుబాబు, బ్రహ్మానందం, కళ్యాణి, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 6 జూలై 2007 [1]
భాష తెలుగు
పెట్టుబడి 80 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి
Thumb
లక్ష్యం సినిమా పోస్టరు

కథ

ఏసీపీ బోస్ (జగపతి బాబు) ఓ నిబద్ధతగల పోలీసు అధికారి. అతనికి పెళ్ళై భార్యా పిల్లలు, ఇతర కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అతని తమ్ముడు చందు (గోపీచంద్) కళాశాల విద్యార్థి. తన సహవిద్యార్థిని అయిన ఇందు (అనుష్క) తో ప్రేమలో పడతాడు. సెక్షన్ శంకర్ (యశ్ పాల్ శర్మ) సెటిల్మెంట్లు చేసుకుంటూ బతికే ఓ దాదా. తన దారికి అడ్డువచ్చిన వాళ్ళని ఆధారాలు దొరక్కుండా మాయం చేస్తుంటాడు. అతను డీజీపీని, ఓ రాజకీయ నాయకుడిని మంచి చేసుకుని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి వంద కోట్లు ఋణం తీసుకుని ఉంటాడు. ఆ ఋణం చెల్లించాల్సి వస్తుందని బ్యాంకు చైర్మన్ ను హత్య చేస్తాడు. విచారణ చేయడానికి వచ్చిన బోస్ ను అదే కేసులో ఇరికిస్తాడు. బోస్ తిరుగుబాటు చేయడంతో అతన్ని చంపేస్తారు. చందు దానికి ప్రతీకారంగా ఏంచేశాడన్నది మిగతా కథ.

తారాగణం : పాటలు

  • చందు గా గోపీచంద్
  • అనుష్క
  • జగపతి బాబు
  • కల్యాణి
  • యశ్ పాల్ శర్మ
  • కోట శ్రీనివాసరావు
  • బ్రహ్మానందం
  • వేణుమాధవ్
  • రఘుబాబు
  • గుళ్ళో దేవుడు , రచన: చంద్రబోస్, గానం.మధుబాలకృష్ణన్,
  • చక్కెర కేళి , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.కార్తీక్, శ్రేయా ఘోషల్
  • సుక్కు సుక్కు, రచన: చంద్రబోస్, గానం. టిప్పు, సుజాత మోహన్
  • ఎవడు ఎవడు, రచన: చంద్రబోస్, గానం. రంజిత్
  • నిలువవే, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.హేమచంద్ర
  • సుక్కు సుక్కు ,(రీమిక్స్) రచన: చంద్రబోస్, గానం.టిప్పు, సుజాత మోహన్.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.