ప్రముఖ సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( November 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.
కమల్ హాసన్ | |
---|---|
జననం | కమల్ హాసన్ 1954 నవంబరు 7 పరమక్కుడి, తమిళనాడు,భారతదేశం |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
వృత్తి | సినిమా నటుడు దర్శకుడు నిర్మాత గాయకుడు నృత్య దర్శకుడు కథారచయిత & మాటల రచయిత |
రాజకీయ పార్టీ | మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ |
మతం | నాస్తికుడు |
భార్య / భర్త | వాణీ గణపతి(1978-1988) సారిక(1988–2004)[1] |
పిల్లలు | శ్రుతి హాసన్ అక్షర హాసన్ |
తండ్రి | శ్రీనివాసన్ |
తల్లి | రాజ్య లక్ష్మి |
శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు కమల్ హాసన్ నాలుగో సంతానం, ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.
కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.
70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కథా నాయకుడిగా "అవర్గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.
1970 లో విభిన్న పాత్రలను పోషించారు.
దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది. 1979 లో కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందాడు. దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. (ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు). చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలతో, పాత్రలతో ముందుకు వచ్చారు.
ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు:
1997లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు.
ఈ కాలంలో ఆయన నటించిన పాత్రలు:
ఐతే ఎనభైలో మాదిరిగా తొంభైలలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996 లో విడుదలైన "ఇండియన్", "అవ్వై షణ్ముఖి" మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ ను అగ్రపథంలో నిలిపాయి.
నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. వాటిలో కొన్ని:
2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లో వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.
కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని [[కలతూర్ కన్నమ్మ]] చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.
కమల్ హాసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, మగళిర్ మట్టమ్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.
కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుద నాయగం దశాబ్దంనర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ (మొహమ్మద్ యూసఫ్ ఖాన్) గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతులమీదుగా మొదలయింది.
2005లో కమల్ హాసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.[2]
కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు.
తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మొదటి నుంచీ కమల్ హసన్ సినిమాలు సంచలనాలకే కాక వివాదాలకు కూడా కేంద్రబిందువులుగా ఉంటున్నాయి. 1992లో విడుదలైన తెవర్ మగన్ (తెలుగు అనువాదంలో క్షత్రియ పుత్రుడు) సినిమా తెవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవృత్తిని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి. సినిమాలోని తొలిపాట తెవర్ కులాన్ని, ఆ కులస్తుల పౌరుషాలను పొడుగుడతూ ఉండడంతో బహిరంగంగా వారు వినిపిస్తూండడం, ఇతరులపై ఆధిక్యసూచనగా ప్రదర్శించడం వంటివి సమాజంలోని వివాదాలను రేపేందుకు పనికివచ్చాయని భావించారు. 2000లో విడుదలైన కమల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హే రామ్ చిత్రం చాలా వివాదాలకు మూలబీజమైంది. స్వాతంత్ర్యానంతరం మహాత్మాగాంధీ హత్య వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన చారిత్రికాంశాలతో కూడిన చిత్రమిది. ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా, స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002నాటి పంచతంత్రం సినిమాలోని ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు. సందియర్ అన్న పేరుతో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు పుతియ తమిళగం సంస్థ నాయకుడు కె.కృష్ణమూర్తి, ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తెవర్-దళిత కులస్తుల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తెవర్ కులస్తుల ఆభిజాత్యానికి, వారి హింసాప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు. తన చిత్రబృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కమల్ హాసన్ కలవగా తర్వాత విస్తృత ప్రజానీకం భద్రత దృష్ట్యా కల్పించలేమని ఆయన తిరస్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు. అలానే సినిమా పేరును విరుమాండిగా మార్చి 2004లో చలనచిత్రాన్ని విడుదల చేశారు. 2004లోనే విడుదలైన వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్. సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉందని ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం 2005 నాటి ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. తమిళ సినిమాకు ఇంగ్లీషులో పేరు పెట్టడాన్ని నిరశిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకె నేత, తమిళ భాషా పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్.రామదాసు నేతృత్వం వహించారు. 2010 నాటి మన్మథన్ అంబు (తెలుగులో మన్మథబాణం) సినిమాలోని ఒక పాటలోని సాహిత్యం హిందూ మక్కల్ కచ్చి వారు హిందూమతాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఆందోళన చేశారు. పాటను తొలగించాకా సినిమా విడుదల అయింది. విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువచేసి చూపిందని ఆరోపణలు రాగా, తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది. కొన్ని దృశ్యాలను తొలగించి, కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాకా దాదాపు విడుదల అయిన 22 రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. 2015లో విడుదల అయిన ఉత్తమ విలన్ చలనచిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తోందని ఆరోపిస్తూ విశ్వహిందూపరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ప్రెంచి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీచేస్తున్నట్టు వుందని గొడవ చెలరేగితే, చిత్రవర్గాలు "ఆ పోస్టర్లో చూపిన తెయ్యం అన్నది వేయి సంవత్సరాలకు పైగా వయసున్న భారతీయ కళ అని, దాన్ని వేరెవరి నుంచో కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని" స్పష్టీకరించాయి.[3]
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | దర్శకత్వం | వివరములు | Ref. |
---|---|---|---|---|---|---|
1960 | మావూరి అమ్మాయి (కలథుర్ కన్నమ్మ) | Selvam | తమిళ | ఎ. భీమ్‌సింగ్ | ఉత్తమ బాల నటుడి"గా జాతీయ బహుమతి వచ్చింది. | [4] |
1962 | పవిత్ర ప్రేమ (పార్దాల్ పాసి థీరుమ్) | Babu & Kumar | తమిళ | ఎ. భీమ్‌సింగ్ | (మొట్ట మొదటి ద్వి-పాత్రాభినయం) (అతిథి పాత్రలో) | [5] |
1962 | పాధ కానిక్కై | Ravi | తమిళ | K. Shankar | Child artist | [6] |
1962 | కన్నుమ్ కరులుమ్ | Babu | మలయాళ | K. S. Sethumadhavan | Child artist | [7] |
1963 | వానంపడి (Vanambadi) | Ravi | తమిళ | G. R. Nathan | Child artist | |
1963 | దొంగ బంగారం (అనంధ జోధి) | Balu | తమిళ | వి.ఎన్.రెడ్డి | Child artist | [8] |
1970 | మాణవన్ | తమిళ | M. A. Thirumugam | Uncredited role | [9] | |
1971 | Annai Velankanni | Jesus | తమిళ | Thankappan | Uncredited role | [10] |
1972 | కురత్తి మగన్ | తమిళ | కె.ఎస్.గోపాలకృష్ణన్ | |||
1973 | అరంగేట్రమ్ | Thiagu | తమిళ | కైలాసం బాలచందర్ | [11] | |
1973 | చొల్లత్తాన్ నినైక్కిరేన్ | Kamal | తమిళ | కైలాసం బాలచందర్ | ||
1974 | పరువ కాలమ్ | Chandran | తమిళ | Jos A.N. Fernando | [12] | |
1974 | గుమస్తావిన్ మగళ్ | Mani | తమిళ | A. P. Nagarajan | [13] | |
1974 | శృంగార లీల (నాన్ అవనిల్లై | తమిళ | కైలాసం బాలచందర్ | |||
1974 | కన్యాకుమారి | Sankaran | మలయాళ | K. S. Sethumadhavan | ||
1974 | అన్బు తంగై | Buddha | తమిళ | S. P. Muthuraman | Guest appearance | [14] |
1974 | విష్ణు విజయమ్ | మలయాళ | N. Sankaran Nair | |||
1974 | అవళ్ ఒరు తొడర్ కదై | Prasad | తమిళ | కైలాసం బాలచందర్ | [15] | |
1974 | పణత్తుక్కాగ | Kumar | తమిళ | M. S. Senthil | [12] | |
1975 | సినిమా పైత్యమ్ | Natarajan | తమిళ | ముక్తా శ్రీనివాసన్ | [12] | |
1975 | ప్రేమ లీలలు (పట్టామ్ బూచ్చి) | Siva | తమిళ | A. S. Pragasam | [12] | |
1975 | ఆయిరత్తిల్ ఒరుత్తి | Kamal | తమిళ | Avinashi Mani | [12] | |
1975 | భలే బ్రహ్మచారి (తేన్ సిందుదే వానమ్) | తమిళ | R. A. Sankaran | [12] | ||
1975 | మేల్నాట్టు మరుమగళ్ | Raja | తమిళ | A. P. Nagarajan | ఈ చిత్ర నిర్మాణ సమయంలో వాణి గణపతిని కలుసుకొని ప్రేమలో పడి తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు | [12] |
1975 | యవ్వనం మురిపించింది (తంగత్తిలే వైరమ్) | Kumar | తమిళ | K. Sornam | ||
1975 | భలేరాజా (పట్టికాట్టు రాజా) | Mahesh | తమిళ | K. Shanmugam | ||
1975 | నాన్ నిన్నె ప్రేమిక్కున్ను | Suresh | మలయాళ | K. S. Gopalakrishnan | ||
1975 | మాలై సూడవా | తమిళ | C. V. Rajendran | |||
1975 | అపూర్వ రాగంగళ్ | Prasanna | తమిళ | కైలాసం బాలచందర్ | [16] | |
1975 | తిరువోణమ్ | Prem Kumar | మలయాళ | Sreekumaran Thampi | [12] | |
1975 | మట్టొరు సీతా | మలయాళ | P. Bhaskaran | [12] | ||
1975 | రాసలీల | మలయాళ | N. Sankaran Nair | [12] | ||
1975 | అందాలరాజా (అంతరంగమ్) | Kaanthan | తమిళ | ముక్తా శ్రీనివాసన్ | ||
1976 | అప్పూపన్ | Babumon | మలయాళ | P. Bhaskaran | ||
1976 | అగ్ని పుష్పమ్ | Somu | మలయాళ | Jeassy | ||
1976 | మన్మధ లీల (మన్మద లీలై) | Madhu | తమిళ | కైలాసం బాలచందర్ | [17] | |
1976 | అంతులేని కథ | Arun | తెలుగు | కైలాసం బాలచందర్ | Cameo appearance | [18] |
1976 | సమస్సియ | మలయాళ | K. Thankappan | |||
1976 | స్విమ్మింగ్ పూల్ | మలయాళ | J. Sasikumar | |||
1976 | అరుతు | మలయాళ | Ravi | |||
1976 | సత్యమ్ | Kumaran | తమిళ | S. A. Kannan | ||
1976 | మరో ప్రేమకథ (ఒరు ఊదాప్పూ కణ్ సిమిట్టు గిరదు) | Ravi | తమిళ | ఎస్. పి. ముత్తురామన్ | [19] | |
1976 | ఉణర్చిగళ్ | Selvam | తమిళ | R. C. Sakthi | [20] | |
1976 | కుట్టువమ్ సిత్షయుమ్ | మలయాళ | M. Masthan | |||
1976 | కుమార విజయమ్ | Kumar | తమిళ | A. Jagannathan | [21] | |
1976 | కళ్యాణ జ్యోతి (ఇదయ మలర్) | Mohan | తమిళ | జెమినీ గణేశన్ | ||
1976 | కొండరాజు కోయపిల్ల (పొన్ని) | Maran | మలయాళ | Thoppil Bhasi | [22] | |
1976 | Nee Ente Lahari | మలయాళ | P. G. Viswambharan | [12] | ||
1976 | మూన్రు ముడిచ్చు | Balaji | తమిళ | కైలాసం బాలచందర్ | [23] | |
1976 | మోగమ్ ముప్పదు వ్రుషమ్ | Ramesh | తమిళ | S. P. Muthuraman | ||
1976 | లలిత | Balu | తమిళ | Valampuri Somanathan | [12] | |
1977 | ఆయినా | Prem Kapoor | హిందీ | కైలాసం బాలచందర్ | Cameo appearance in the song "Ho Jaaye Jab Dil Se Dil Takraaye" | [11] |
1977 | ఉయర్న్దవర్గళ్ | Aarumugam | తమిళ | T. N. Balu | [24] | |
1977 | శివతాండవమ్ | మలయాళ | N. Sankaran Nair | [25] | ||
1977 | ఆశీర్వాదమ్ | మలయాళ | I. V. Sasi | |||
1977 | అవర్గళ్ | Janardhan (Johnny) | తమిళ | కైలాసం బాలచందర్ | [26] [27] | |
1977 | మదుర సొప్పనమ్ | మలయాళ | M. Krishnan Nair | |||
1977 | శ్రీ దేవి | Venugopal | మలయాళ | N. Sankaran Nair | ||
1977 | ఉన్నై సుట్రుమ్ ఉలగమ్ | Raja | తమిళ | G. Subramanya Reddiar | [12] | |
1977 | కబిత | Gopal | బెంగాలి | Bharat Shamsher | [28] | |
1977 | ఆష్త మాంగల్యమ్ | మలయాళ | P. Gopikumar | |||
1977 | నిరకుడమ్ | Devan | మలయాళ | A. Bhimsingh | ||
1977 | పార్వతి మళ్ళీ పుట్టింది (ఓర్ మగళ్ మరిక్కుమో) | Chandrasekharan | మలయాళ | కె. ఎస్. సేతుమాధవన్ | ||
1977 | 16 Vayathinile | Gopalakrishnan (Chappani) | తమిళ | P. Bharathiraja | [29] | |
1977 | ఆడు పులి ఆట్టమ్ | Madan | తమిళ | S. P. Muthuraman | [30] [12] | |
1977 | ఆనందం పరమానందం | Babu | మలయాళ | I. V. Sasi | ||
1977 | నామ్ పిరంద మణ్ | Ranjith | తమిళ | A. Vincent | [31] | |
1977 | కోకిల | Vijaykumar | కన్నడ | Balu Mahendra | కన్నడంలో మొదటి చిత్రం | [32] |
1977 | సత్యవంతుడు (సత్యవాన్ సావిత్రి) | Sathyavan | మలయాళ | P. G. Viswambharan | ||
1977 | ఆద్యపాదమ్ | మలయాళ | Adoor Bhasi | |||
1978 | Avalude Ravukal | మలయాళ | I. V. Sasi | Cameo appearance | [33] | |
1978 | నిళల్ నిజమాగిరదు | Sanjeevi | తమిళ | కైలాసం బాలచందర్ | ||
1978 | Sakka Podu Podu Raja | తమిళ | S. P. Muthuraman | Cameo appearance | [34] | |
1978 | మదనోత్సవమ్ | Raju | మలయాళ | N. Sankaran Nair | dubbed into Hindi as Dil Ka Sathi Dil | [12] |
1978 | అమర ప్రేమ | Raju | తెలుగు | తాతినేని రామారావు | Remake of మదనోత్సవమ్. Most of scene reshot and used some scenes dubbed in original version. | |
1978 | Kaathirunna Nimisham | Raju | మలయాళ | Baby | [12] | |
1978 | Aval Viswasthayayirunnu | Anto | మలయాళ | Jeassy | Guest appearance | |
1978 | Anumodhanam | మలయాళ | I. V. Sasi | [12] | ||
1978 | మరో చరిత్ర | Balu | తెలుగు | కైలాసం బాలచందర్ | [35] | |
1978 | ఇళమై ఊంజలాడు గిరదు | Prabhu | తమిళ | C. V. Sridhar | [36] | |
1978 | చట్టమ్ ఎన్ కైయ్యిల్ | Babu & Rathinam | తమిళ | T. N. Balu | ||
1978 | వయసు పిలిచింది | Raja | తెలుగు | C. V. Sridhar | [37] | |
1978 | తప్పిట తల | Amrit Lal | కన్నడ | కైలాసం బాలచందర్ | Cameo appearance | [38] |
1978 | Padakuthira | మలయాళ | P. G Vasudevan | [12] | ||
1978 | వయానధన్ తంబన్ | Vayanadan Thamban | మలయాళ | A. Vincent | ||
1978 | అవళ్ అప్పడిదాన్ | Arun | తమిళ | C. Rudhraiya | [39] | |
1978 | ఎర్ర గులాబీలు | Dileep | తమిళ | P. Bharathiraja | [40] | |
1978 | పట్నం పిల్ల (మనిదరిల్ ఇత్తని నిరంగళా) | Velu | తమిళ | R. C. Sakthi | [12] | |
1978 | తప్పు తాళంగళ్ | Amrit Lal | తమిళ | కైలాసం బాలచందర్ | Cameo appearance | [12] [38] |
1978 | ఏట్టా | Ramu | మలయాళ | I. V. Sasi | [12] | |
1979 | సొమ్మొకడిది సోకొకడిది | Rangadu & Shekar | తెలుగు | సింగీతం శ్రీనివాసరావు | (తెలుగులో మొదటి ద్వి-పాత్రాభినయం) తమిళంలో "ఇరు నిలవుగల్ "గా విడుదల చేశారు. dubbed into Tamil as Iru Nilavugal | [12] |
1979 | సిగపుక్కల్ మూక్కుథి | తమిళ | Valampuri Somanathan | |||
1979 | నాగ మోహిని (నీయా!) | Kamal | తమిళ | Durai | ||
1979 | అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్ | Alauddin | మలయాళ / తమిళ | I. V. Sasi | Multiple-language version- Simultaneously made in Tamil as అలా ఉధ్ధీనుమ్ అర్పుద విలక్కుమ్ | [41] |
1979 | పాటగాడు (థాయిల్లమల్ నాన్ ఇల్ల్ య్) | Raja | తమిళ | R. Thyagarajan | [41] | |
1979 | నినైత్తాలే ఇనిక్కుమ్ | Chandru | తమిళ | కైలాసం బాలచందర్ | Multiple-language version - Bilingual film ప్యార్ తరనా (ఇది 80 లో నిర్మించబడిన తమిళ చిత్రం నినైత్తాలే ఇనిక్కుమ్ యొక్క డబ్బింగ్ హిందీ చిత్రం) | [42] |
1979 | అందమైన అనుభవం | Chandru | తెలుగు | కైలాసం బాలచందర్ | [42] | |
1979 | ఇది కథ కాదు | Janardhan | తెలుగు | కైలాసం బాలచందర్ | [18] | |
1979 | Nool Veli | Kamal Haasan | తమిళ | కైలాసం బాలచందర్ | Guest appearance as himself Multiple-language version - Simultaneously filmed in Telugu as గుప్పెడు మనసు |
[43] |
1979 | కళ్యాణ రాముడు (కళ్యాణరమన్) | Raman & Kalyanam | తమిళ | G. N. Rangarajan | [44] | |
1979 | Pasi | Kamal Haasan | తమిళ | Durai | Guest appearance as himself | [45] |
1979 | గుప్పెడు మనసు | Kamal Haasan | తెలుగు | కైలాసం బాలచందర్ | Guest appearance as himself Simultaneously filmed in Tamil as Nool Veli |
[46] |
1979 | మంగల వాథియమ్ | తమిళ | K. Shankar | [12] | ||
1979 | నీల మలర్గల్ | Chandran | తమిళ | Krishnan Panju | ||
1979 | అళియాద కోలన్గల్ | Gowrishankar | తమిళ | Balu Mahendra | Guest appearance | [12] |
1980 | ప్రేమ పిచ్చి (ఉల్లాస పరవైగళ్) | Ravi | తమిళ | C. V. Rajendran | (దో దిల్ దివానే - hindi) | |
1980 | గురు | Guru | తమిళ | I. V. Sasi | ||
1980 | వరుమైయిన్ నిరమ్ సివప్పు | Rangan | తమిళ | కైలాసం బాలచందర్ | Simultaneously filmed in Telugu as ఆకలి రాజ్యం | [47] |
1980 | మరియ మై డార్లింగ్ | Raghu | కన్నడ | Durai | Multiple-language version (Bilingual film) | [12] [48] |
1980 | తమిళ | |||||
1980 | Saranam Ayyappa | తమిళ | Dasarathan | Guest appearance | [49] | |
1980 | నట్చత్త్రిరమ్ | Kamal Haasan | తమిళ | Dasari Narayana Rao | Guest appearance | |
1981 | తిల్లు ముల్లు | Charu Haasan | తమిళ | కైలాసం బాలచందర్ | Guest appearance | [50] |
1981 | ఆకలి రాజ్యం | J. Ranga Rao | తెలుగు | కైలాసం బాలచందర్ | Simultaneously filmed in Tamil as వరుమైయిన్ నిరమ్ సివప్పు | [51] |
1981 | మీండుమ్ కోకిలా | Manian | తమిళ | G. N. Rangarajan | ||
1981 | Ram Lakshman | Ram | తమిళ | R. Thyagarajan | [12] | |
1981 | అమావాస్య చంద్రుడు (రాజ పార్వై) (ఎ)(a) | Raghu | తమిళ | Singeetam Srinivasa Rao | (100th film) Simultaneously filmed in Telugu as అమావాస్య చంద్రుడు |
[44] [51] |
1981 | ఏక్ దుజే కేలియే | Vasu | హిందీ | కైలాసం బాలచందర్ | [52] | |
1981 | రంగూన్ రాజా (కడల్ మీన్గళ్) | Selvanayagam & Rajan | తమిళ | G. N. Rangarajan | [12] | |
1981 | సవాల్ | P. P. Raja | తమిళ | R. Krishnamoorthy | [53] | |
1981 | అందగాడు (1982 సినిమా) (శంకరలాల్) | Dharmalingam & Mohan | తమిళ | T. N. Balu | Simultaneously filmed in Telugu as అందగాడు | [12] |
1981 | టిక్ టిక్ టిక్ | Dilip | తమిళ | P. Bharathiraja | [53] | |
1981 | చిలిపి చిన్నోడు (ఎల్లామ్ ఇన్బమయమ్) | Velu | తమిళ | G. N. Rangarajan | [44] | |
1982 | వాళ్వే మాయమ్ | Raja | తమిళ | R. Krishnamoorthy | [54] | |
1982 | అంది వెయిలిలే Ponnu | మలయాళ | Radhakrishnan | Dubbed Tamil as Ponmaalai Pozhudhu | [55] | |
1982 | వసంత కోకిల (మూన్రామ్ పిరై) | Srinivasan (Seenu) | తమిళ | Balu Mahendra | ఇది హిందీలో సద్మా గా పునర్నిర్మించబడింది. | [44] [56] |
1982 | Neethi Devan Mayakkam | Military officer | తమిళ | Bapu | Simultaneously shot in Telugu as Edi Dharmam Edi Nyayam | [57] |
1982 | Maattuvin Chattangale | మలయాళ | K. G. Rajasekharan | Special appearance in the song "Maattuvin Chattangale" | [12] [58] | |
1982 | సిమ్లా స్పెషల్ | Gopu | తమిళ | Muktha Srinivasan | ||
1982 | సనమ్ తేరీ కసమ్ | Sunil Sharma | హిందీ | Narendra Bedi | పాడగన్ (ఇది 90 లలో నిర్మించబడిన హిందీ చిత్రం తనమ్ మేరీ కసమ్ యొక్క తమిళ డబ్బింగ్ చిత్రం) | [59] |
1982 | సకల కళా వల్లవన్ | Velu | తమిళ | S. P. Muthuraman | ||
1982 | ఎళమ్ రాత్తిరి | మలయాళ | Krishnakumar | |||
1982 | రాణీ తేనీ | Miller | తమిళ | G. N. Rangarajan | Cameo appearance | [60] |
1982 | ఎహ్ తో కమాల్ హోగయా | Ratan Chander & Ajay Saxena | హిందీ | తాతినేని రామారావు | (హిందీలో మొదటి ద్విపాత్రాభినయం) (హిందీ)ఇది పునర్నిర్మించబడిన "చట్టమ్ ఎన్ కైయ్యిల్ "యొక్క హిందీ చిత్రం. | [61] |
1982 | పగడ్సై పన్నిరెండు | Anand | తమిళ | Dhamodharan. N | ||
1982 | అగ్ని సాక్షి | Kamal Haasan | తమిళ | కైలాసం బాలచందర్ | Guest appearance | [62] |
1983 | జరాసీ జిందగీ (Zara Si Zindagi) | Rakesh Kumar Shastri | హిందీ | కైలాసం బాలచందర్ | [60] | |
1983 | ఉరువంగళ్ మారలామ్ | Kamal Haasan | తమిళ | S. V. Ramanan | Guest appearance | |
1983 | చట్టం | Raja | తమిళ | K. Vijayan | స్నేహ బంధం (మలయాళం) | |
1983 | సాగర సంగమం | Balakrishna | తెలుగు | కె.విశ్వనాథ్ | సలంగై ఒలి - Tamil | [63] [16] |
1983 | సద్మ | Somu | హిందీ | బాలు మహేంద్ర | [64] | |
1983 | పొయ్క్కాల్ కుదిరై | Kamal Haasan | తమిళ | కైలాసం బాలచందర్ | Cameo appearance | [60] |
1983 | బెనకియల్లి అరళింద హువు | కన్నడ | కైలాసం బాలచందర్ | Special appearance in the song "Munde Banni" | [65] [66] | |
1983 | జల్సారాయుడు (తూంగాదె తంబి తూంగాదే) | డబుల్ రోల్ | తమిళ | ఎస్ పి ముత్తురామన్ | [67] | |
1984 | ఎహ్ దేష్ | Mathur | హిందీ | తాతినేని రామారావు | Guest role | [60] |
1984 | ఏక్ నయీ పహేలీ | Sandeep | హిందీ | కైలాసం బాలచందర్ | [68] | |
1984 | యాద్ గార్ | Rajnath | హిందీ | Dasari Narayana Rao | [60] | |
1984 | రాజ్ తిలక్ | Suraj | హిందీ | Rajkumar Kohli | [69] | |
1984 | ఎనక్కుళ్ ఒరువన్ | Madhan & Upendhra | తమిళ | S. P. Muthuraman | 125th Film | [16] |
1984 | కరిష్మా | Sunny | హిందీ | I. V. Sasi | [60] | |
1985 | ఖైదీ వేటా | David & Shankar | తమిళ | P. Bharathiraja | ఒరు కైదియిన్ డైరీ - తమిళ | [44] |
1985 | కాక్కి చట్టై | Murali | తమిళ | Rajasekhar | [60] | |
1985 | అంద ఒరు నిమిడమ్ | Kumar | తమిళ | Major Sundarrajan | [60] | |
1985 | ఉయర్న్ద ఉళ్ళమ్ | Anandh | తమిళ | S. P. Muthuraman | [60] | |
1985 | సాగర్ | Raja | హిందీ | Ramesh Sippy | [70] [71] | |
1985 | గిరఫ్తార్ | Kishan Kumar Khanna | హిందీ | Prayag Raaj | [60] [72] | |
1985 | మంగమ్మా శపధం | Ashok & Raja | తమిళ | K. Vijayan | [60] | |
1985 | జపానిల్ కల్యాణ రామన్ | Kalyanam & Raman | తమిళ | S. P. Muthuraman | [73] | |
1985 | దేఖా ప్యార్ తుమ్హారా | Vishal | హిందీ | Virendra Sharma | [60] | |
1986 | విక్రమ్ (a) | Vikram | తమిళ | Rajasekhar | [74] | |
1986 | స్వాతిముత్యం | Sivaiah | తెలుగు | K. Viswanath | (సిప్పికుళ్ ముత్తు-తమిళ) ఇది అనిల్ కపూర్ నాయకుడుగా హిందీలోఈశ్వర్గా పునర్నిర్మించ బడింది. | [75] |
1986 | అందరికంటే ఘనుడు (నానుమ్ ఒరు తొళిలాళి) | Bharath | తమిళ | C. V. Sridhar | [60] | |
1986 | మనకణక్కు | తమిళ | R. C. Sakthi | Guest appearance as film director | [53] | |
1986 | ఒక రాధ – ఇద్దరు కృష్ణులు | Krishna | తెలుగు | A. Kodandarami Reddy | [60] | |
1986 | డాన్స్మాష్టర్ (పున్నగై మన్నన్ -తమిళ) | Sethu, Chaplin Chellappa | తమిళ | కైలాసం బాలచందర్ | [44] | |
1987 | కాదల్ పరిసు | Mohan | తమిళ | A. Jagannathan | [76] [60] | |
1987 | వ్రతం | Balu | మలయాళ | I. V. Sasi | [60] | |
1987 | కడమై కణ్ణియమ్ కట్టుబాటు (ఎ) | Kamal Haasan | తమిళ | Santhana Bharathi | Guest appearance | [60] |
1987 | పేర్ చొల్లుమ్ పిళ్ళై | Ramu | తమిళ | ఎస్.పి.ముత్తురామన్ | [76] [60] | |
1987 | పుష్పక విమానం | "Unemployed graduate" | (Silent film) | Singeetam Srinivasa Rao | Also known as Pushpak and Pesum Padam | [77] [23] |
1987 | నాయకుడు | Sakthivelu (Velu Naicker) | తమిళ | Mani Ratnam | [78][79] | |
1988 | డైసీ | James | మలయాళ | Pratap K. Pothen | Extended Cameo | [80] |
1988 | పోలీస్ డైరీ(సూర సంహారం) | Pandiyan | తమిళ | Chitra Lakshmanan | [76] [81] | |
1988 | ఉన్నాల్ ముడియుం తంబి | Udhayamoorthy | తమిళ | కైలాసం బాలచందర్ | [60] [82] | |
1988 | సత్య (ఎ) | Sathyamurthy | తమిళ | Suresh Krissna | [44] | |
1989 | అపూర్వ సహోదరులు(ఎ) | Sethupathi, Appadurai & Raja | తమిళ | సింగీతం శ్రీనివాసరావు | [44] | |
1989 | చాణిక్యన్ | Johnson | మలయాళ | T. K. Rajeev Kumar | [83] | |
1989 | వెట్రి విళా | Vetrivel | తమిళ | Prathap Pothan | [76] [60] | |
1989 | ఇంద్రుడు చంద్రుడు | G. K. Rayudu & Chandru | తెలుగు | Suresh Krissna | ఇది తమిళంలో ఇంద్రన్ చంద్రన్ గా పునర్నిర్మించబడి హిందీలో మేయర్ సాబ్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు | [84][85] |
1990 | మైఖేల్ మదన కామరాజు (1990) | Michael, Madhanagopal, Kameshwaran, Subramaniam Raju |
తమిళ | సింగీతం శ్రీనివాసరావు | [86] [87] | |
1991 | గుణ | Gunasekharan | తమిళ | Santhana Bharathi | [88] | |
1992 | సింగారవేలన్ | Singaravelan | తమిళ | R. V. Udayakumar | [89] | |
1992 | క్షత్రియ పుత్రుడు (ఎ) | Shakthivel | తమిళ | Bharathan | [90] | |
1993 | మహరాసన్ | Vadivelu | తమిళ | G. N. Rangarajan | [60] | |
1993 | కళైంజన్ | Indrajith | తమిళ | G. B. Vijay | [76] [60] | |
1994 | మహా నది (బి) | Krishnaswamy | తమిళ | Santhana Bharathi | [91] | |
1994 | ఆడవాళ్లకు మాత్రం (మగలీర్ మట్టుమ్) (ఎ) | తమిళ | సింగీతం శ్రీనివాసరావు | Guest appearance | [92] | |
1994 | ప్రొఫెసర్ విశ్వం | Selvam | తమిళ | K. S. Sethumadhavan | [93] [94] | |
1995 | సతీ లీలావతి (ఎ) | Shakthivel | తమిళ | Balu Mahendra | [95] | |
1995 | శుభసంకల్పం | Dasu | తెలుగు | K. Viswanath | [96] | |
1995 | ద్రోహి (కురుదిపునల్) (ఎ) | Adhi Narayanan | తమిళ | P. C. Sreeram | Simultaneously shot in Telugu as Drohi | [44] |
1996 | భారతీయుడు | Senapathy & Chandrabose | తమిళ | S. Shankar | [97] | |
1996 | భామనే సత్యభామనే | Pandian (Avvai Shanmugi) | తమిళ | K. S. Ravikumar | ఇది హిందీలో చాచీ 420గా తిరిగి చిత్రించ బడింది | [97] |
1997 | చాచి 420 (ఎ) (బి) (సి) | Jaiprakash Paswan (Lakshmi Godbhole) | హిందీ | Kamal Haasan | [98] | |
1998 | కాధలా కాధలా | Ramalingam | తమిళ | సింగీతం శ్రీనివాసరావు | [99] | |
2000 | హే రామ్ | Saket Ram | తమిళ, హిందీ | Kamal Haasan | [100] | |
2000 | తెనాలి | Thenali Soman | తమిళ | K. S. Ravikumar | [101] | |
2001 | అభయ్‌గా (అలవంధన్) | Vijay Kumar & Nandha Kumar | తమిళ, హిందీ | Suresh Krissna | [102] | |
2002 | పమ్మళ్ కె. సంబంధం | Pammal Kalyana Sambandham | తమిళ | T. S. B. K. Moulee | [103] | |
2002 | పంచతంత్రం (2002) | Ramachandramurthy | తమిళ | K. S. Ravikumar | [76] [104] | |
2003 | అన్బే శివం | Nallasivam | తమిళ | Sundar. C | [105] | |
2003 | Nala Damayanthi | Kamal Haasan | తమిళ | T. S. B. K. Moulee | Guest appearance as himself | [106] |
2004 | పోతురాజుగా (విరుమాండి) | Virumaandi | తమిళ | Kamal Haasan | [107] | |
2004 | వసూల్ రాజా MBBS | Rajaraman | తమిళ | Saran | [108] | |
2005 | ముంబాయి ఎక్స్ ప్రెస్ | అవినాష్ | తమిళ, హిందీ | సింగీతం శ్రీనివాసరావు | ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది | |
2005 | రమ షమ బమ | Dr. Shyam Sajjan | కన్నడ | రమేష్ అరవింద్ | Extended Cameo. | [109] |
2006 | రాఘవన్గా (వెట్టీయాడు విలైయాడు) | DCP Raghavan | తమిళ | Gautham Menon | [110] | |
2008 | దశావతారం | Govindarajan Ramaswamy, Rangarajan Nambi, Christian Fletcher, Balram Naidu, Krishnaveni, Vincent Poovaragan, Khalifulla Khan, Avatar Singh, Shinghen Narahashi, George W. Bush | తమిళ | K. S. Ravikumar | ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ,ఇంగ్లీష్ బాషలలో రూపొందించబడి 2008 జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. | [97] |
2009 | Unnaipol Oruvan | "Common man" | తమిళ | Chakri Toleti | [111] [112] | |
2009 | ఈనాడు | "Common man" | తెలుగు | Chakri Toleti | ఏక కాలంలో తమిళ, తెలుగు బాషలలో రూపొందించబడి 2009 సెప్టెంబరు 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. | [113] |
2010 | Four Friends | Kamal Haasan | మలయాళ | Saji Surendran | Guest appearance as himself | [114] |
2010 | మన్మధన్ అంబు | Raja Mannar | తమిళ | K. S. Ravikumar | [115] | |
2013 | విశ్వరూపం | Wisam Ahmed Kashmiri | తమిళ | Kamal Haasan | Bilingual film (ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) | [116] |
2013 | Vishwaroop | Wisam Ahmed Kashmiri | హిందీ | Kamal Haasan | [117] | |
2015 | ఉత్తమ విలన్ | Manoranjan | తమిళ | రమేష్ అరవింద్ | [118] | |
2015 | పాపనాశం | Suyambulingam | తమిళ | Jeethu Joseph | [119] | |
2015 | Thoongaa Vanam | C. K. Diwakar | తమిళ | Rajesh Selva | Bilingual film (ఏక కాలంలో తమిళ తెలుగు బాషలలో రూపొందించబడి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) | [120] |
2015 | చీకటి రాజ్యం | C. K. Diwakar | Telugu | Rajesh Selva | [121] | |
2016 | Meen Kuzhambum Mann Paanaiyum | Swami | తమిళ | Amudeshver | Guest appearance | [122] |
2018 | విశ్వరూపం II | Wisam Ahmed Kashmiri | తమిళం | Kamal Haasan | Bilingual film (ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలలో తయారు చేసి 10 ఆగస్టు 2018 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) | |
2018 | Vishwaroop II | Wisam Ahmed Kashmiri | హిందీ | Kamal Haasan | ||
2021 | Indian 2† | Senapathy, Chandrabose | తమిళ | S. Shankar | Filming | [123] |
2021 | విక్రమ్† | తమిళం | లోకేష్ కనగరాజ్ | Filming | [124] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.