గుణ

గుణ 1991 లో విడుదల అయిన తెలుగు సినిమా. From Wikipedia, the free encyclopedia

గుణ

గుణ 1991 లో విడుదల అయిన తెలుగు సినిమా. స్వాతి చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై పల్లవి- చరణ్ లు నిర్మించిన ఈ చిత్రానికి సంతాన భారతి దర్శకత్వం వహించాడు. ఇందులో కమల్ హాసన్, రేఖ నటించారు. ఇది తమిళ సినిమా "గుణ" కి అనువాదం.

త్వరిత వాస్తవాలు గుణ, దర్శకత్వం ...
గుణ
Thumb
దర్శకత్వంసంతాన భారతి
రచనసాబ్ జాన్
బాలకుమారన్
నిర్మాతపల్లవి- చరణ్
తారాగణంకమల్ హాసన్
రేఖ
ఛాయాగ్రహణంవేణు
కూర్పుబి.లెనిన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
స్వాతి చిత్ర ఇంటర్నేషనల్
విడుదల తేదీ
5 నవంబరు 1991 (1991-11-05)
సినిమా నిడివి
167 నిముషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటవర్గం

కథ

గుణ మానసికంగా దెబ్బతిన్న వ్యక్తి. హైదరాబాద్‌లోని మానసిక ఆశ్రమంలో చికిత్స పొందుతాడు. అతనికి తన తండ్రి ఇష్టం లేదు. అతని తల్లి అతని ఇంట్లోనే వేశ్య గృహాన్ని నడుపుతుంది. ఆశ్రమంలో ఉన్నప్పుడు అతని సెల్లో ఉన్న ఇంకొక వ్యక్తి అతనికి ఒక కథ చెపుతాడు. దానిలో అభిరామి అనే పాత్రను అతను తన నిజజీవితంలో ఉహించుకుంటాడు. ఆమె పౌర్ణమి రోజున తనను వివాహం చేసుకోబోతున్న దేవదూత అని అతని మనస్సులో నమ్ముతాడు. అతను ఆశ్రమం నుండి బయటికి వచ్చాక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న రోజీ అనే అమ్మాయి గుణని ఇష్టపడుతుంది కానీ గుణ అభిరామిని వెతుకుంటూ బయటికి వస్తాడు. ఒకరోజు గుళ్లో అభిరామి పాత్ర లాగే ఉండే ఒక అమ్మాయి వస్తుంది. ఆమె అభిరామి అనుకోని అతను వెళ్తాడు ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ.

పాటలు

మరింత సమాచారం సంఖ్య, శీర్షిక ...
సంఖ్య శీర్షిక సాహిత్యం గాయకుడు(లు) నిడివి
1. పిచ్చి బ్రహ్మ వెన్నెలకంటి మాధవపెద్ది రమేష్ 4:39
2. కమ్మని ఈ ప్రేమ లేఖనే వెన్నెలకంటి ఎస్.పి బాలసుబ్రమణ్యం, ఎస్.పి శైలజ 5:27
3. కోయిలలో నారాయణ వర్మ స్వర్ణలత 2:33
4. శాంభవి వెన్నెలకంటి ఎస్.పి బాలసుబ్రమణ్యం 3.45
5. ఉన్నా నీకొరకే వెన్నెలకంటి ఎస్.పి బాలసుబ్రమణ్యం, ఎస్.పి శైలజ 5:27
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.