కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత From Wikipedia, the free encyclopedia
గిరీశ్ కర్నాడ్ (కన్నడభాష : ಗಿರೀಶ್ ರಘುನಾಥ ಕಾರ್ನಾಡ್ ) (మే 19, 1938 - జూన్ 10, 2019)[2] ఒక కన్నడ రచయిత, నటుడు. కర్నాటకకు ఏడవ జ్ఞానపీఠ పురస్కారం అందించి కన్నడ సాహిత్యానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నమొట్టమొదటి నాటకసాహిత్యవేత్త గౌరవం ఇతనికే దక్కింది. అంతేకాక జ్ఞానపీఠ పురస్కారం పొందిన ఇద్దరు కన్నడ కవుల కావ్యాలను చలనచిత్రాలుగా వెండితెరకెక్కించిన కీర్తి కూడా ఈయన స్వంతం. తనకు జ్ఞానపీఠ అవార్డు లభించినప్పుడు, అందరు అభినందించగా వారితో సౌమ్యంగా, వినయంగా -"ఈ పురస్కారం నాకన్నా మరాఠి సాహిత్యంలో నాకన్న ముందు నాటకసాహిత్యంలో విశేష కృషి సల్పిన విజయ తండూల్కర్ గారికిచ్చిన మిక్కిలి సంతోషించివుండేవాడిని" అని చెప్పడంద్వారా తనకన్న పెద్దవారైన అనుభవంవున్న సమకాలీన సాహితీవేత్తలమీద అతనికున్న గౌరవం, అణకువ, అభిమానం కొట్టవచ్చినట్లు కానవచ్చుచున్నది. కర్నాడ్ నాటక సాహిత్యసేవ కేవలం కన్నడభాషకే పరిమితం కాలేదు. ఇతరభాషల సాహిత్యాన్ని కూడా గమనంలో పెట్టుకున్న సాంస్కృతిక వక్తగా, నటునిగా, దర్శకుడిగా ఎదిగాడు.కర్నాడ్ మొదట నాటక నటుడిగా తన కళాజీవితాన్ని ప్రారంభించినప్పటికి తన అసమానప్రతిభతో ఒక్కొక్కమెట్టును అధికమిస్తూ ఒక ఉత్తమ భారతీయ నాటకసాహిత్యవేత్తగా అగ్రపీఠం అధిష్టించాడు. కర్నాడ్ తెలుగుజనాలకు పరిచితుడే. ఇతను పలు తెలుగు చలనచిత్రాలలో విభిన్నపాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు. నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత గిరీశ్ కర్నాడ్ 2019 జూన్ 10 (81 సంవత్సరాల వయస్సులో) మరణించాడు.[3]
గిరీష్ కర్నాడ్ | |
---|---|
2009 లో కోర్నెల్ విశ్వవిద్యాలయంలో కర్నాడ్ | |
Born | గిరీశ్ రఘునాథ్ కర్నాడ్ 1938 మే 19 మాథెరాన్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మహారాష్ట్ర) |
Died | 2019 జూన్ 10 81)[1] బెంగళూరు | (వయసు
Occupation | రచయిత, సినిమా దర్శకుడు , నటుడు, కవి |
Nationality | భారతీయ |
Alma mater | యూనివర్సిటీ అఫ్ ఆక్స్ఫర్డ్ |
Genre | ఫిక్షన్ |
Literary movement | నవ్య |
Notable works | తుఝ 1964 తలిదండ |
గిరీశ్ కర్నాడ్ సా.శ. 1938వ సంవత్సరం, మే నెల 19 వతేదిన మహారాష్ట్రలోని మథేరాలో జన్మించాడు. తండ్రిపేరు రఘునాధ్ కార్నాడ్, తల్లి కృష్ణాబాయి. గిరీశ్ కార్నాడ్ తండ్రి ప్రగతిశీల, అభ్యుదయభావాలు మెండుగాన ఉన్న వ్యక్తి. కార్నాడ్ తండ్రికి వివాహమైన కొంతకాలానికి ఆయన భార్య మరణించింది.రఘునాధ్ కార్నాడ్ అభ్యుదయభావంతో, అప్పటి సమాజవ్యతిరిక్తను ధైర్యంగా ఎదిరించి, బాల్యంలోనే పెళ్ళయి, వితంతువుగా మారిన కృష్ణాబాయిని తన సహధర్మచారిణిగా స్వీకరించాడు.సమాజం ఏమనుకున్న తాను నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో అమలుపరచిన ధైర్యశాలి రఘునాధ్ కార్నాడ్ . అభ్యుదయ భావాలున్న కుటుంబంలో పుట్టడం గీరీష్ కార్నాడ్ తరువాతి జీవితంలో ఒక ప్రగతిశీల వ్యక్తిగా ఎదగడనికి తోడ్పడింది అని చెప్పాలి.
గీరీష్ కార్నాడ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఉత్తరకన్నడ జిల్లాలోని శిరసిలో జరిగింది.ఉన్నతవిద్యాసం ధారవాడలోని మిషను హైస్కూలులోని, డిగ్రీ (పట్టా, degree) కర్నాటక కళాశాలలో పూర్తిచేసాడు.అ సమయంలో రోడ్స్ ఉపకారవేతనం (Rodes scholarship) కు అర్హత పొందటంతో ఆక్సుపర్డ్‌కు (ఇంగ్లాండు) మరింత ఉత్తమశ్రేణి అభ్యాసం కై వెళ్లెను.అక్కడ తన ప్రతిభాపాటవంతో ఆక్సుపర్డ్ డిబేట్ క్లబుకు అధ్యక్షుడుగా ఎన్నికైన ఆసియా ఖండానికి చెందిన మొట్టమొదటివ్యక్తి గిరీశ్ కార్నాడ్.విద్యాభ్యాసానంతరం అక్కడి విద్వాసంసులు,, కళాకారులతో స్నేహంగావుంటూ వారిచే ప్రతిభావంతుడనే ప్రశంసలందుకు న్నాడు.షికాగో విశ్వవిద్యాలయంలో సందర్శన అధ్యాపకుడు (consultant lecturer) అక్కడి బహుభాషాపండితులచే మెప్పుపొందిన బుద్ధిశాలి గిరీశ్ కార్నాడ్. విదేశాలలో వుండగానే నాటకరచన చేసి, ఇక్కడికి వచ్చిన పిదప కొత్తనాటకాలను అధ్యయనం చేసి, నాటక ప్రదర్శన కావించాడు.కార్నాడ్ వ్రాసిన అనేక నాటకాలు హింది, పంజాబి, మరాఠి, పలు భారతీయభాషలలో అనువదింపబడి, ప్రదర్శింపబడినవి.కన్నడభాషనుండి అనువాదమొంది, పలు నాటకాలు ప్రదర్శింపబడిన మొదటి కన్నడ నాటకరచయిత కార్నాడ్. ఆక్సుఫర్డ్ నుండి స్వదేశానికి వచ్చి మొదట మద్రాసులో కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికి, అటుపిమ్మట ధారవాడకు వెళ్ళి అక్కడ నాటకరంగానికి అంకితమై విశేషకృషి సల్పిన నాటక సాహిత్య కృషీవలుడు.
కార్నాడ్ ఉన్నతవిద్యాభ్యాసంకై ఇంగ్లాండు వెళ్ళుటకు ముందే, ఈ కళాకారుని కలంనుండి యాయాతి అనేనాటకం రూపుదిద్దుకుంది.ఈ నాటకం ధారవాడ నుండి వెలువడు మనోహర గ్రంథమాలెలో ప్రచురణ అయ్యింది.ఇంగ్లాండునుండి వచ్చిన పిదప తుఘలక్, హయవదన నాటకాలు రచించాడు. ఈ మధ్యకాలంలో పూణెలోని పూణె ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో నిర్దేశకుడుగా చేరి, కొంతకాలానికి ఆపదవిని విడిచిపెట్టి ముంబై వెళ్లిన కార్నాడ్ అక్కడ కొన్ని చలనచిత్రాలలో నటించాడు. కొంతకాలంతరువాత చిత్రరంగాన్ని కూడా వదలి బెంగళూరుకు వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత నాటక రచనను చురుకుగా కొనసాగించారు.బెంగుళూరు వచ్చినతరువాత ఆయన కలంనుండి జాలువారిననాటకాలు, అంజుమల్లిగె, నాగమండల తలెదండ,, అగ్ని మత్తు మళె కార్నాడ్ బ్రిటి ష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేసన్ వారి అభ్యర్ధన మేరకు టిప్పువిన కనసుగళు అనే నాటకమును వ్రాసాడు. నాగమండల నాటకం నాగమండల అనే పేరుతో సినిమాగా తీయబడింది.[4]
కర్నాడ్ నటించిన సంస్కార కన్నడ చలనచిత్రం, కన్నడలో అంతవరకు నిర్మించిన చిత్రాలలో వ్యాపారాత్మకంగా కాకుండగా కళాత్మకంగా తీసిన మొదటి సినిమా. ఇందులో కార్నాడ్ ప్రాణేశాచార్య అనే ప్రధానభూమికను పోషించారు. ఇందులో మరో నటుడు పి. లంకేశ్ విరుద్ధపాత్రలో నటించారు. ఈ చిత్రదర్శకుడు పట్టాభిరామిరెడ్డి. స్వర్ణకమలం పొందిన మొదటి కన్నడచిత్రం. తరువాత బి.వి. కారంత్ అనే దర్శకునితో కలసి సహదర్శకత్వంలో ఎస్.ఎల్. భైరప్ప వ్రాసిన వంశవృక్ష కావ్యం ఆధారంగా వంశవృక్ష పేరుతో ఒక చిత్రాన్ని తీసారు.ఈ చిత్రానికి పలురాష్ట్రీయ, అంతరరాష్ట్రీయ పురస్కారాలు, ప్రశంసలు లభించాయి. తరువాతి కాలంలో తబ్బిలు నీనాదె మగనె, కాడు, ఒందానొందుకాలదల్లి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కాడు చిత్రానికి కూడా చాలా పురస్కారాలు, ప్రశంసలు అందాయి. పిమ్మట ఉత్సవ్, గోధూళి అనే హింది చిత్రాలకు దర్శకబాధ్యతలు నిర్వహించాడు. ఇంకను కనక పురందర, ద.రా.బెంద్ర, సూఫి పంథ అనే యథార్థ/సాక్ష్య (documentary) చిత్రాలకు దర్శకుడుగా పనిచేసాడు. పరిసరవినాశనం గురించి తెలియచేసే 'జెలువి అనేచిత్రానికి కూడా దర్శకుడిగా పనిచేసాడు. అగ్నిశ్రీధర్ అనే రచయిత/కవితోకలసి ఆ దినగళు అనేచిత్రానికి చిత్రకథను అందించారు. ప్రేమికుడు సినిమాలో విలన్ గా ఈ తరం వారు గుర్తు చేసుకుంటూ వుంటారు. నిశాంత్ (1975), స్వామి (1977), గోధూళి (1977), రత్నదీప్ (1979), ఉంబర్తా (1982) సినిమాలలో నటించాడు.[5] భూమిక సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు.
కరడి టేల్స్ అనే పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ చర్ఖా ఆడియోబుక్స్ పేరుతో భారత పూర్వ రాష్త్రపతి ఏ. పీ. జే. అబ్దుల్ కలాం ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆడియో పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఇందులో కర్నాడ్ అబ్దుల్ కలాంకు గొంతునిచ్చారు. కరడి టేల్స్ చిన్న పిల్లల కోసం 'కరడి ది బేర్' చెప్పిన భారత జానపద, పౌరాణిక కథలను ఆడియో రూపంలో అందిస్తుంది. వీటిలో కరడి ది బేర్ గొంతు కూడా కర్నాడ్‌దే.
కార్నాడ్ కన్నడసాహిత్యానికి కన్నడ చలనచిత్రరంగానికి చేసిన సేవలను గుర్తించి కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.కార్నాడ్ కు కర్నాటక రాజ్యోత్సవ ప్రశస్తి , గుబ్బి వీరన్న ప్రశస్తి , కేంద్ర సంగీత నాటక అకాడెమి ప్రశస్తి , అత్యంత ప్రతిష్ఠాకరమైన పద్మశ్రీ', పద్మభూషణ , జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్నాడు.కేంద్ర సంగీత-నాటక అకాడెమి అధ్యక్షుడిగా పనిచేసాడు.ఇంగ్లాండులోని నెహరు సెంటరుకు నిర్దేశకుడి (director) గా కూడా విధులు నిర్వహించాడు.2008-09 సంవత్సరానికిగాను జీవమాన ప్రశస్తి అయినా పుట్టణ్ణ కణగాల్ ప్రశస్తి ని కార్నాడ్ కు లభించింది.అయితే దాన్నిఆయన తిరస్కరించాడు.కారణం మొదట ఈ పురస్కారాన్ని కె.ఎస్.ఆర్.దాసుకు ఇచ్చారు.దాసుగారు (ఇయన చాలా తెలుగు చలనచిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు) కన్నడ చిత్రరంగానికి ఎక్కువ సేవ చెయ్యలేదని పాత్రికేయులు తీవ్రవ్యతిరేకతను వ్యక్తంచేయడంతో, వెనక్కి తీసుకొని కార్నాడ్‌కు బహుకరించడంజరిగింది.అందుచే ఆయనదానిని తిరస్కరించారు.
Seamless Wikipedia browsing. On steroids.