1996 సినిమా From Wikipedia, the free encyclopedia
ధర్మచక్రం 1996 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ కు నంది అవార్డ్ వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.[1] అప్పటి దాకా కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా.
ధర్మచక్రం | |
---|---|
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు), సురేష్ కృష్ణ (కథ/చిత్రానువాదం) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | వెంకటేష్, రమ్యకృష్ణ , ప్రేమ, గిరీష్ కర్నాడ్, శ్రీవిద్య, శ్రీలత, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | కె. రవీంద్రబాబు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 13, 1996 |
భాష | తెలుగు |
రాకేష్ ఒక న్యాయవాది. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు. తల్లి శారద. రాకేష్ సురేఖ అనే మధ్య తరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది అతని తండ్రికి నచ్చదు. ఆమెను వేశ్యగా చిత్రీకరించి ఆమె మరణానికి కారణమవుతాడు. దాంతో రాకేష్ తండ్రిని అసహ్యించుకుని వైరం ఏర్పరుచుకుంటాడు. తల్లి శారద భర్త, కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. రాకేష్ కు తల్లి మాటంటే వేదవాక్కు. ఆమె తనయుడి ఆవేశాన్ని నియంత్రిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది.
1995 జూన్ 22 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభించింది. రెండున్నర పాటలు కెనడాలో చిత్రీకరించారు. కెనడాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇది. మొత్తం 62 రోజులపాటు చిత్రీకరణ జరగగా వెంకటేష్ 52 రోజులు నటించాడు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.