రోషిణి (నటి)
తెలుగు, తమిళ చలనచిత్ర నటి From Wikipedia, the free encyclopedia
రోషిణి తెలుగు, తమిళ చలనచిత్ర నటి.[1][2] చిరంజీవితో మాస్టర్, బాలకృష్ణతో పవిత్ర ప్రేమ సినిమాల్లో నటించింది.
జీవిత విషయాలు
షామా కాజీ, చందర్ సదనా దంపతులకు ముంబైలో రోషిణి జన్మించింది. నగ్మా, జ్యోతికలు రోషిణి సోదరీమణులు.[3]
సినిమారంగం
సెల్వా దర్శకత్వంలో వచ్చిన తమిళ కామెడీ చిత్రం శిష్యా సినిమాలో నగ్మా ప్రోత్సాహంతో రోషిణి తొలిసారిగా నటించింది.[4] ఆ తరువాత 1997లో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, పవిత్ర ప్రేమ, శుభలేఖలు వంటి తెలుగు చిత్రాలలో నటించింది. తక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాలు రావడంతో 1997లో తనకు వచ్చిన సినిమా ఆఫర్లను తిరస్కరించింది. కె. బాలచందర్ నిర్మించిన తుళ్ళి తిరింత కాలం (1998) సినిమాలో నటించింది. ఈ చిత్రంలోని నటనకు ప్రశంసలు అందుకుంది.[5] నెపోలియన్ సరసన పులి పిరందా మన్ చిత్రం ముందకుసాగక పోవడంతో తరువాత రోషిణి చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంది.[6]
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమాపేరు | పాత్రపేరు | భాష | |
---|---|---|---|---|
1997 | శిష్యా | పూజా/అను | తమిళం | |
1997 | మాస్టర్ | ప్రీతి | తెలుగు | |
1998 | పవిత్ర ప్రేమ | రాణి | తెలుగు | |
1998 | శుభ లేఖలు | తెలుగు | ||
1998 | తుళ్ళి తిరింత కాలం | దేవి | తమిళం |
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.