అక్షర హాసన్
From Wikipedia, the free encyclopedia
అక్షర హాసన్ (జననం 12 అక్టోబరు 1991), భారతీయ సినీ నటి, సహాయ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు కమల్ హాసన్, అతని మొదటి భార్య సారికల రెండో కుమార్తె ఆమె. హిందీ సినిమా షమితాబ్(2015)తో తెరంగేట్రం చేసింది అక్షర. ఆమె ప్రముఖ నటి శృతి హాసన్ చెల్లెలు.
అక్షర హాసన్ | |
---|---|
![]() ఫిలింఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డులు 2016లో అక్షర హాసన్ | |
జననం | అక్షర హాసన్ 12 అక్టోబరు 1991 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | కమల్ హాసన్ సారిక(నటి) |
తొలినాళ్ళ జీవితం
12 అక్టోబరు 1991న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది అక్షర. ఆమె తల్లిదండ్రులు ప్రముఖ భారతీయ నటుడు కమల్ హాసన్, నటి సారికలు. ఆమె తండ్రి తమిళ అయ్యంగార్ కాగా, తల్లి మహారాష్ట్రీయురాలు.[1][2] ఆమె అక్క శృతి హాసన్ ప్రముఖ నటి. చెన్నైలోని అబాకస్ మాంటిస్సోరి స్కూల్, లేడీ ఆండాల్ లోనూ, ముంబైలోని బేకాన్ హై, బెంగుళూరులోని ఇండస్ అంతర్జాతీయ పాఠశాలలోనూ చదువుకుంది అక్షర.
కెరీర్
ఆమె తల్లి సారిక 2010లో రాహుల్ ఢోలకియా దర్శకత్వంలో నటించిన సొసైటీ సినిమాకు సహాయ దర్శకురాలిగా పని చేసింది అక్షర.[3] ముంబైలో నిర్మించిన ఎన్నో యాడ్ ఫిలింలకు రాంమూర్తీ, ఉజెర్ ఖాన్, ఇ.నివాస్, రుచి నరైన్ వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసిందామె.[3] ఆమె సహాయ దర్శకురాలిగా పని చేసేటప్పుడు ఎన్నో సినిమాల్లో కథానాయికగా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. అలా ఆమె నిరాకరించిన వాటిలో మణిరత్నం తీసిన కడలి సినిమా కూడా ఒకటి.[4]
ధనుష్ సరసన షమితాబ్ సినిమాలో కథానాయికగా ఆమె తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించాడు.[5][6][7][8]
వ్యక్తిగత జీవితం

తన తండ్రీ, తల్లీ ఆమె చిన్నప్పుడే విడిపోవడంతో అక్షర తన తల్లితో కలసి ముంబైలో జీవిస్తోంది.[9]
ఆమె సినిమాల్లో కొన్ని
- నటిగా
- సహాదర్శకురాలిగా
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.