![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/d/db/Mahamantri_Timmarusu_Movie_Poster.jpg/640px-Mahamantri_Timmarusu_Movie_Poster.jpg&w=640&q=50)
మహామంత్రి తిమ్మరుసు
1962 తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
మహామంత్రి తిమ్మరుసు 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో తిమ్మరుసుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు పోటీపడి అద్భుతంగా నటించారు.[1] ఈ కథను మూడుగంటల పాటు ఆసక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కథ పరంగా తిమ్మరుసు(గుమ్మడి)కి, కథనం పరంగా రాయలు (ఎన్టీఆర్)కి సమ ప్రాథాన్యం ఇస్తూ సాగే జోడు గుఱ్ఱాల సవారీ మరొక ఎత్తు ఈ చిత్రం.[2] తిమ్మరుసు కన్నులు కాల్చివేసిన తరువాత రాయల పాత్రలో ఎన్.టి.రామారావు హుందాగా నటించారు, రాయలు శిక్ష విధించాలని తెలిసాక తిమ్మరుసు పాత్రలో ఉన్న గుమ్మడి తన అసమాన ప్రదర్శన ప్రదర్శించారు.[3]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, కథ ...
మహామంత్రి తిమ్మరుసు (1962 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
కథ | పింగళి నాగేంద్రరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి , ముదిగొండ లింగమూర్తి, రేలంగి వెంకట్రామయ్య , ముక్కామల, దేవిక, ఎల్. విజయలక్ష్మి, రాజశ్రీ, రాధాకుమారి, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, ధూళిపాళ, శోభన్ బాబు, ఎ.వి. సుబ్బారావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. లీల, పి. సుశీల, ఎస్. వరలక్ష్మి |
నృత్యాలు | వెంపటి సత్యం, బి. కందస్వామి |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
సంభాషణలు | పింగళి నాగేంద్రరావు |
కళ | మాధవపెద్ది గోఖలే |
నిర్మాణ సంస్థ | గౌతమీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి
1963: మహామంత్రి తిమ్మరుసు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోప్రదర్శితమైనది.