![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/NT_Rama_Rao.jpg/640px-NT_Rama_Rao.jpg&w=640&q=50)
నందమూరి తారక రామారావు
తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ,గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.
నందమూరి తారక రామారావు | |
---|---|
![]() నందమూరి తారక రామారావు | |
10 వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి | |
In office 1983 జనవరి 9 – 1984 ఆగస్టు 16 | |
గవర్నర్ | కె.సి.అబ్రహాం ఠాకూర్ రాం లాల్ |
అంతకు ముందు వారు | కోట్ల విజయభాస్కరరెడ్డి |
తరువాత వారు | నాదెండ్ల భాస్కరరావు |
In office 1984 సెప్టెంబరు 16 – 1989 డిసెంబరు 2 | |
గవర్నర్ | శంకర దయాళ్ శర్మ |
అంతకు ముందు వారు | నాదెండ్ల భాస్కరరావు |
తరువాత వారు | మర్రి చెన్నారెడ్డి |
In office 1994 డిసెంబరు 12 – 1995 సెప్టెంబరు 1 | |
గవర్నర్ | కృష్ణకాంత్ |
అంతకు ముందు వారు | కోట్ల విజయభాస్కరరెడ్డి |
తరువాత వారు | నారా చంద్రబాబునాయుడు |
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు | |
In office 1982 మార్చి 29 – 1995 సెప్టెంబరు 1 | |
అంతకు ముందు వారు | స్థానం ప్రారంభం |
తరువాత వారు | నారా చంద్రబాబునాయుడు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1923-05-28)1923 మే 28 [1] నిమ్మకూరు, మద్రాసు రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం ) |
మరణం | 1996 జనవరి 18(1996-01-18) (వయసు 72) హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం తెలంగాణ) |
మరణ కారణం | గుండెపోటు |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (1982–1996) |
ఇతర రాజకీయ పదవులు | నేషనల్ ఫ్రంట్ (1989–1996) |
జీవిత భాగస్వామి |
|
సంతానం | జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ నందమూరి మోహన కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ గారపాటి లోకేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంటమనేని ఉమామహేశ్వరి[1] |
కళాశాల | SRR & CVR కళాశాల, ఆంధ్ర క్రైస్తవ కళాశాల |
వృత్తి |
|
పురస్కారాలు | పద్మశ్రీ (1968) జాతీయ ఫిల్ం పురస్కారాలు |
సంతకం | ![]() |
రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.[1]