నారా చంద్రబాబునాయుడు
భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా [1](2014-2019),(2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.[2][3][4][5] అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు.[6][7][8][9] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
నారా చంద్రబాబునాయుడు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి | |
Incumbent | |
Assumed office 2024 జూన్ 12 - ప్రస్తుతం | |
అంతకు ముందు వారు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
In office 2004 మే 14 – 2014 జూన్ 2 | |
అంతకు ముందు వారు | వై.యస్. రాజశేఖరరెడ్డి |
తరువాత వారు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి | |
In office 1995 సెప్టెంబరు 1 – 2004 మే 13 | |
గవర్నర్ | కృష్ణకాంత్ గోపాల రామానుజం సి.రంగరాజన్ సుర్జీత్ సింగ్ బర్నాలా |
అంతకు ముందు వారు | ఎన్.టి.రామారావు |
తరువాత వారు | వై.యస్. రాజశేఖరరెడ్డి |
In office 2014 జూన్ 8 – 2019 మే 23 | |
గవర్నర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
అంతకు ముందు వారు | రాష్ట్రపతి పాలన |
తరువాత వారు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
శాసనసభ సభ్యుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం | |
Incumbent | |
Assumed office 1989 - ప్రస్తుతం | |
అంతకు ముందు వారు | ఎన్.రంగస్వామి నాయుడు |
శాసనసభ సభ్యుడు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం | |
In office 1978–1983 | |
తరువాత వారు | మేడసాని వెంకట్రామనాయుడు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1950-04-20) 1950 ఏప్రిల్ 20 (వయసు 74) నారావారిపల్లె, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం) |
రాజకీయ పార్టీ | 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (1978-1983) |
సంతానం | నారా లోకేశ్ (ఏకైక పుత్రుడు) |
బంధువులు | ఎన్.టి.రామారావు(మామయ్య) నందమూరి బాలకృష్ణ(బావ) నందమూరి హరికృష్ణ(బావ) దగ్గుబాటి పురంధేశ్వరి(వదిన) జూనియర్ ఎన్. టి. ఆర్ (మేనల్లుడు) నందమూరి కళ్యాణ్రాం(మేనల్లుడు) నందమూరి తారకరత్న(మేనల్లుడు) నారా రోహిత్ (తమ్ముని కొడుకు) |
నివాసం | అమరావతి, భారతదేశం హైదరాబాదు, భారతదేశం |
కళాశాల | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |