తెలంగాణలో 2021 అక్టోబరు నాటికి 73 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.[1] వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు.
2019 నవంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం 42 రెవెన్యూ డివిజన్లుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా 28 రెవెన్యూ డివిజన్లుతో కలిపి మొత్తం సంఖ్య 70 కి చేరుకుంది. 2021 అక్టోబరు నాటికి రాష్ట్రం లోని రెవెన్యూ డివిజన్లు సంఖ్య 73 కు చేరుకుంది.[1]
ఆ తరువాత 2023లో చండూరు, రామాయంపేట, చెన్నూరు రెవెన్యూ డివిజనులు కత్తగా ఏర్పడ్డాయి. వాటితో కలిపి రాష్ట్రం లోని రెవెన్యూ డివిజన్లు సంఖ్య 76 కు చేరుకుంది.
దిగువ పట్టిక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విభాగాలను వివరిస్తుంది.