From Wikipedia, the free encyclopedia
సిరిసిల్ల రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. రాజన్న జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సిరిసిల్లలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
సిరిసిల్ల డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | సిరిసిల్ల రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | సిరిసిల్ల మండలం | 5 రెవెన్యూ గ్రామాలు |
2 | తంగళ్ళపల్లి మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
3 | గంభీరావుపేట మండలం | 18 రెవెన్యూ గ్రామాల (1 నిర్జన గ్రామం)ు |
4 | యల్లారెడ్డిపేట్ మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
5 | వీర్నపల్లి మండలం | 6 రెవెన్యూ గ్రామాలు |
6 | ముస్తాబాద్ మండలం | 16 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
7 | ఇల్లంతకుంట మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.