From Wikipedia, the free encyclopedia
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. బద్దం ఎల్లారెడ్డి, ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సి.హెచ్.విద్యాసాగర్ రావు. కె.చంద్రశేఖర్ రావు లాంటి నాయకులు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.[1]
లోక్‌సభ | సంవత్సరం | పదవీకాలం | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|---|---|
మొదటి[2] | 1952 | 1952-57 | బద్దం ఎల్లారెడ్డి | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
1952 | 1952-57 | ఎం.ఆర్. కృష్ణ | ఎస్.సి.ఎఫ్ | |
రెండవ[2] | 1957[3] | 1957-62 | ఎం.ఆర్. కృష్ణ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957[3] | 1957-62 | ఎం. శ్రీరంగారావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
మూడవ | 1962[4] | 1962-67 | జువ్వాడి రమాపతిరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
నాల్గవ | 1967[5] | 1967-71 | జువ్వాడి రమాపతిరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
ఐదవ | 1971[6] | 1971-77 | ఎం. సత్యనారాయణరావు | తెలంగాణా ప్రజా సమితి |
ఆరవ | 1977[7] | 1977-80 | ఎం. సత్యనారాయణరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
ఏడవ | 1980[8] | 1980-84 | ఎం. సత్యనారాయణరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎనిమిదవ | 1984[9] | 1984-89 | జువ్వాడి చొక్కారావు | భారత జాతీయ కాంగ్రెస్ |
తొమ్మిదవ | 1989[10] | 1989-91 | జువ్వాడి చొక్కారావు | భారత జాతీయ కాంగ్రెస్ |
పదవ | 1991[11] | 1991-96 | జువ్వాడి చొక్కారావు | భారత జాతీయ కాంగ్రెస్ |
పదకొండవ | 1996[12] | 1996-98 | ఎల్.రమణ | తెలుగుదేశం పార్టీ |
పన్నెండవ | 1998[13] | 1998-99 | సి.హెచ్.విద్యాసాగర్ రావు | భారతీయ జనతా పార్టీ |
పదమూడవ | 1999[14] | 1999-04 | సి.విద్యాసాగర్ రావు | భారతీయ జనతా పార్టీ |
పదునాల్గవ | 2004[15] | 2004-06 | కె.చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
(ఉపఎన్నిక) | 2006 | 2006-08 | కె.చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
(ఉపఎన్నిక) | 2008 | 2008-2009 | కె.చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
15వ | 2009[16] | 2009-2014 | పొన్నం ప్రభాకర్ | భారత జాతీయ కాంగ్రెసు |
16 వ | 2014[17] | 2014-2019 | బి. వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
17వ | 2019 [18] | 2019 - 2024 | బండి సంజయ్ | భారతీయ జనతా పార్టీ |
18వ | 2024[19] | 2024 - ప్రస్తుతం | బండి సంజయ్ | భారతీయ జనతా పార్టీ |
1971 లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీచేసిన ఎం.సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.జగపతిరావు పై విజయం సాధించాడు. సత్యనారాయణరావుకు 47.2% ఓట్లు రాగా, జగపతిరావుకు 43.2% ఓట్లు లభించాయి.
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణా రాష్ట్ర సమితి | కె.చంద్రశేఖరరావు | 451,199 | 51.59 | +51.59 | |
భారతీయ జనతా పార్టీ | చెన్నమనేని విద్యాసాగర రావు | 320,031 | 36.60 | -13.13 | |
Independent | మామిడిపల్లి గంగరాజం | 59,686 | 6.83 | ||
బహుజన సమాజ్ పార్టీ | కొత్తపల్లి సాంద్రి మేనయ్య | 43,582 | 4.98 | ||
మెజారిటీ | 131,168 | 14.99 | +64.72 | ||
మొత్తం పోలైన ఓట్లు | 874,498 | 65.12 | -1.64 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి hold | Swing | +51.59 |
లోక్‌సభ సభ్యుడిగా ఉన్న కె.చంద్రశేఖర్‌రావు రాజీనామా చేయడంతో 2006లో ఉపఎన్నిక అనివార్యమైంది. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన కెసిఆర్ ఈ సారి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిననూ తెలంగాణా భావన అధికంగా ఉండుటచే సునాయాసంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించాడు. సమీప ప్రత్యర్థి కాంగ్రేస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండులక్షలకుపైగా మెజారిటీపొంది లక్ష్యం నెరవేర్చుకున్నాడు.
తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యుల మూకుమ్మడి రాజీనామాల వలన జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 4 లోక్‌సభ, 18 శాసనసభ స్థానాలలో (రెండు శాసన సభ స్థానాలలో సభ్యుల మరణాల వల్ల జరిగాయి) 2008లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో పర్యాయం తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్నికల రంగంలోకి దిగాడు. తెరాసతో పాటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఈ స్థానంకై ఇంతకు క్రితం పోటీచేసిన అభ్యర్థులను నిలబెట్టాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈపోటీలకు దూరంగా ఉండటమే కాకుండా ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. తెరాస క్రితం సారి సాధించిన భారీ మెజారిటీతో, తెలంగాణా అంశంతో ఉత్సాహంగా బరిలోకి దిగగా, కాంగ్రెస్, తెలుగుదేశాలు కూడా ఈ స్థానం చేజిక్కించుకొనుటకు చాలా ప్రయత్నించాయి. ఏడాది లోపలే సాధారణ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికలను ప్రాధాన్యత ఏర్పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు విజయం సాధించిననూ ఆధిక్యం మాత్రం బాగా తగ్గిపోయింది. కేవలం 15,765 ఓట్ల తేడాతో చంద్రశేఖరరావు సమీప సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టి.జీవన్ రెడ్డిపై గెలిచాడు.
అభ్యర్థి/పార్టీ | పొందిన ఓట్లు |
---|---|
కె.చంద్రశేఖరరావు (తె.రా.స) | 2,69,452 |
టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) | 2,53,687 |
ఎల్.రమణ (తె.దే.పా) | 1,73,400 |
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్, [20] ప్రజారాజ్యం పార్టీ తరఫున వెలిచాల రాజేందర్ రావు[21] మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్[22] పోటీచేశారు. తొలుత కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావును ఇక్కడి నుండి పోటీ చేయించాలనుకున్ననూ చివరి దశలో సిరిసిల్ల అసెంబ్లీ టికెట్టు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్ పై 50243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[23]
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణా రాష్ట్ర సమితి | బి.వినోద్ కుమార్ | 505358 | 44.85 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | పొన్నం ప్రభాకర్ | 300706 | 26.68 | ||
భారతీయ జనతా పార్టీ | సి.హెచ్.విద్యాసాగరరావు | 215828 | 19.15 | ||
వెల్ఫేర్ పార్టీ | షేక్ మహమ్మద్ | 39380 | 3.5 | ||
మెజారిటీ | 204652 | 18.16 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1126724 | ||||
తెలంగాణా రాష్ట్ర సమితి hold | Swing |
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు 4,98,276 ఓట్లు వచ్చి 90వేల మెజార్టీతో ఎంపీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 1,79,258 ఓట్లు పోలయ్యాయి.
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
బీజేపీ | బండి సంజయ్ కుమార్ | 498,276 | 43.42 | +24.34 | |
టీఆర్ఎస్ | బి. వినోద్ కుమార్ | 4,08,768 | 35.62 | -9.31 | |
కాంగ్రెస్ | పొన్నం ప్రభాకర్ | 1,79,258 | 15.62 | -11.09 | |
నోటా | పైవేవీ లేవు | 7,979 | 0.7 | +0.19 | |
మెజారిటీ | 89,508 | 7.80 | |||
మొత్తం పోలైన ఓట్లు | 10,94,551 | 69.52 | |||
బీజేపీ గెలుపు | +16.83 |
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 28 మంది పోటీలో ఉన్నారు.[24]
Seamless Wikipedia browsing. On steroids.