From Wikipedia, the free encyclopedia
ఎల్.రమణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ శాసనమండలి సభ్యుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ‘స్థానిక సంస్థల’ కోటా టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]
ఎల్.రమణ | |||
ఎమ్మెల్సీ | |||
పదవీ కాలం 5 జనవరి 2022 – 2028 | |||
నియోజకవర్గం | కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
మాజీ మంత్రి & శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2009 – మార్చి 2014 | |||
నియోజకవర్గం | జగిత్యాల | ||
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 - 9 జులై 2021 | |||
నియోజకవర్గం | తెలంగాణ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | జగిత్యాల, కరీంనగర్, తెలంగాణ | 1961 సెప్టెంబరు 4||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | సంధ్య (m. invalid year) | ||
సంతానం | ఎల్.మణికంఠ , ఎల్.కార్తికేయ | ||
నివాసం | జగిత్యాల, హైదరాబాదు |
ఎల్.రమణ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1961 సెప్టెంబరు 4న జన్మించాడు.[2] అతను గంగారాం కుమారుడు.[3] అతను ఎస్.కె.ఎన్.ఆర్ కళాశాలలో బియస్సీ (1978–81) చదివాడు. అతను వృత్తిరీత్యా రాజకీయనాయకుడు, సమాజ సేవకుడు. అతను 1990 ఆగస్టు 8న సంధ్యను వివాహమాడాడు. అతనికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన డా. ఎల్.మణికంఠ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఎల్. కార్తికేయ అమితీ విశ్వవిద్యాలయం నుండి బి.బి.ఎ చదువుతున్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.