From Wikipedia, the free encyclopedia
ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కామారెడ్డి జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఎల్లారెడ్డి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం ఈ రెవెన్యూ డివిజన్ జనాభా - మొత్తం: 1,87,511 - పురుషులు: 91,988 - స్త్రీలు: 95,523 గా ఉంది.
ఎల్లారెడ్డి డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | ఎల్లారెడ్డి మండలం | 31 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
2 | నాగిరెడ్డిపేట మండలం | 22 రెవెన్యూ గ్రామాలు |
3 | లింగంపేట్ మండలం | 23 రెవెన్యూ గ్రామాలు |
4 | గాంధారి మండలం | 33 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.