తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. From Wikipedia, the free encyclopedia
మెదక్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మెదక్ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మెదక్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మెదక్ లోక్‌సభ నియోజకవర్గం, మెదక్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]
మెదక్ డివిజనులోని మండలాలు:[5]
క్ర.సం | మెదక్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | మెదక్ మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
2 | హవేలిఘన్‌పూర్ మండలం | 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
3 | పాపన్నపేట మండలం | 26 రెవెన్యూ గ్రామాలు |
4 | శంకరంపేట (ఎ) మండలం | 25 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
5 | టేక్మల్ మండలం | 20 రెవెన్యూ గ్రామాలు |
6 | ఆళ్ళదుర్గ్ మండలం | 9 రెవెన్యూ గ్రామాలు |
7 | రేగోడు మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
గమనిక:గతంలో ఈ రెవెన్యూ డివిజనులో 10 మండలాలు ఉండేవి. వాటిలోని రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట గ్రామీణ మండలాలను, ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన రామాయంపేట రెవెన్యూ డివిజనులో విలీనమయ్యాయి.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.