From Wikipedia, the free encyclopedia
మంథని రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. పెద్దపల్లి జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మంథనిలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం, మంథని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
మంథని డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | మంథని రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | కమాన్‌పూర్ మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
2 | రామగిరి మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
3 | మంథని మండలం | 35 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
4 | ముత్తారం మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.