తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. From Wikipedia, the free encyclopedia
నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను అనేది తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నాగర్‌కర్నూల్ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]
నాగర్‌కర్నూల్ డివిజన్లోని మండలాలు:[5]
క్ర.సం | నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | బిజినేపల్లి మండలం | 24 రెవెన్యూ గ్రామాలు |
2 | నాగర్‌కర్నూల్ మండలం | 20 రెవెన్యూ గ్రామాలు |
3 | తెల్కపల్లి మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
4 | తిమ్మాజిపేట మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
5 | తాడూరు మండలం | 22 రెవెన్యూ గ్రామాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.