From Wikipedia, the free encyclopedia
అసిఫాబాద్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కొమంరం భీం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కొమరంభీం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఆసిఫాబాద్‌లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది. ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[2]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ రెవెన్యూ డివిజన్ లో మొత్తం 2,65,641 జనాభా ఉంది.
ఆసిఫాబాద్ డివిజనులోని మండలాలు:[3]
క్ర.సం | ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | సిర్పూర్ (యు) మండలం | 18 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
2 | లింగాపూర్ మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
3 | జైనూర్ మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
4 | తిర్యాని మండలం | 39 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
5 | ఆసిఫాబాద్ మండలం | 52 రెవెన్యూ గ్రామాలు |
6 | కెరమెరి మండలం | 46 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
7 | వాంకిడి మండలం | 37 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
8 | రెబ్బెన మండలం | 27 రెవెన్యూ గ్రామాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.