ప్రముఖ సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
అక్కినేని నాగార్జున | |
---|---|
జననం | అక్కినేని నాగార్జున రావు 1959 ఆగస్టు 29 |
ఇతర పేర్లు | నాగ్, యువసామ్రాట్ King |
విద్యాసంస్థ | అన్నా విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు, సినీ నిర్మాత, |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | శివ (1989), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006) |
జీవిత భాగస్వామి | లక్ష్మీ రామానాయుడు దగ్గుపాటి (1984–1990 divorced) అమల అక్కినేని (1992–present) |
పిల్లలు | అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ |
తల్లిదండ్రులు | అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ |
1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి, హథీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు.[1][2][3]
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [4] నాడు లక్ష్మితో [5] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి.[6] వీరిరువురు విడాకులు తీసుకున్నారు.[7] తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986)[4] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[4] రెండవ భార్య కొడుకు.
నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. 2021లో వైల్డ్ డాగ్ సినిమాలో నటించాడు.[8]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
సం. | సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | తోటి నటీనటులు | దర్శకులు | ఇతర వివరాలు | |
---|---|---|---|---|---|---|---|
2021 | బంగార్రాజు | బంగార్రాజు | అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి |
కళ్యాణ్ కృష్ణ కురసాల | |||
1 | 2019 | మన్మథుడు 2 | సాంబశివరావు | రకుల్ ప్రీత్ సింగ్,కీర్తి సురేష్,లక్ష్మి,రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ,దేవదర్శిని | రాహుల్ రవీంద్రన్ | ||
2 | 2018 | ఆఫీసర్ | శివాజీ రావు | మైరా సరీన్ | రామ్ గోపాల్ వర్మ | ||
3 | 2018 | దేవదాస్[15] | దేవ | నాని,రష్మిక మందన,ఆకాంక్ష | శ్రీరామ్ ఆదిత్య | ||
4 | 2017 | రాజు గారి గది2 | రుద్ర | సమంత, అశ్విన్ బాబు,సీరత్ కపూర్ | ఓంకార్ | ||
5 | 2017 | ఓం నమో వేంకటేశాయ | హాథిరామ్ బాబా | అనుష్క, ప్రజ్ఞ జైస్వాల్,సాయి కుమార్,రావు రమేష్ | కె. రాఘవేంద్రరావు | ||
6 | 2016 | ఊపిరి (సినిమా) | విక్రమాదిత్య | కార్తి, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధ | వంశీ పైడిపల్లి | ||
7 | 2016 | సోగ్గాడే చిన్ని నాయనా | బంగార్రాజు,రాము | లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ | కళ్యాణ్ కృష్ణ | ||
8 | 2014 | మనం | నాగేశ్వరరావు | అక్కినేని, నాగ చైతన్య, సమంత, శ్రియా సరన్ | విక్రమ్ కే కుమార్ | ||
9 | 2013 | భాయ్ | రిచా గంగోపాధ్యాయ | వీరభద్రం చౌదరి | |||
10 | 2013 | గ్రీకువీరుడు | చందు | నయనతార | దశరథ్ | ||
11 | 2012 | ఢమరుకం | మల్లికార్జున | అనుష్క | శ్రీనివాసరెడ్డి | ||
12 | 2011 | రాజన్న | రాజన్న | స్నేహ | విజయేంద్రప్రసాద్ | ||
13 | 2011 | గగనం | రవి | పూనమ్‌కౌర్ | రాధామోహన్ | ||
14 | 2010 | రగడ | సత్య | అనుష్క | వీరూపోట్ల | ||
15 | 2010 | కేడి | రమేష్ అలియస్ రమ్మి | మమతా మోహన్ దాస్ | కిరణ్ | ||
16 | 2008 | కింగ్ | కింగ్, బొట్టు శీను, శరత్ | త్రిష | శ్రీను వైట్ల | 3 పాత్రలలో వైవిధ్య నటనకు విమర్శకుల ప్రశంసలు. | |
17 | 2008 | కృష్ణార్జున | కృష్ణ | మమతా మోహన్ దాస్ మంచు విష్ణు | పి. వాసు | ||
18 | 2007 | డాన్ | సూరి | అనుష్క | రాఘవా లారెన్స్ | ||
19 | 2006 | బాస్ | గోపాల కృష్ణ | నయనతార, శ్రియా సరన్ | వి.ఎన్. ఆదిత్య | ||
20 | 2006 | శ్రీరామదాసు | గోపన్న /శ్రీ రామదాసు | స్నేహ | కె. రాఘవేంద్రరావు | విమర్శకుల ప్రశంసలు నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. | |
21 | 2006 | స్టైల్ | మాస్ | రాఘవ లారెన్స్ | అతిథి పాత్రలో | ||
22 | 2005 | సూపర్ | అఖిల్ | అనుష్క, అయేషా టాకియా | పూరి జగన్నాథ్ | ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటుడు బహుమతికి ఎంపిక | |
23 | 2004 | మాస్ | గణేష్/మాస్ | జ్యోతిక | రాఘవ లారెన్స్ | ||
24 | 2004 | నేనున్నాను | వేణు | శ్రియా, ఆర్తి అగర్వాల్ | విఎన్ ఆదిత్య | ||
25 | 2003 | యల్ ఓ సి కార్గిల్ | మేజర్ పద్మపాణి ఆచార్య | జె.పి దత్తా | |||
26 | 2003 | శివమణి 9848022338 | శివమణి | ఆసిన్, రక్షిత | పూరి జగన్నాథ్ | ||
27 | 2002 | మన్మథుడు | అభిరామ్ | సొనాలిబింద్రే, అన్షు | కె. విజయభాస్కర్ | నంది పురస్కారాలు - ఉత్తమ నిర్మాత. | |
28 | 2002 | సంతోషం) | కార్తీక్ | గ్రేసీ సింగ్, శ్రియా | దశరథ్ | నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. | |
29 | 2001 | స్నేహమంటే ఇదేరా | అరవింద్ | భూమిక | బాలశేఖరన్ | ||
30 | 2001 | ఆకాశ వీధిలో | చందు | రవీనాటాండన్ | సింగీతం శ్రీనివాసరావు | ||
31 | 2001 | బావ నచ్చాడు | అజయ్ | సిమ్రాన్, రీమాసేన్ | కె.ఎస్. రవికుమార్ | ||
32 | 2001 | ఎదురులేని మనిషి | సూర్యమూర్తి/సత్యమూర్తి | సౌందర్య, సేనాజ్ | జొన్నలగడ్డ శ్రీనివాసరావు | ద్విపాత్రాభినయం. | |
33 | 2000 | ఆజాద్ | ఆజాద్ | సౌందర్య, శిల్పాశెట్టి | తిరుపతి స్వామి | ||
34 | 2000 | నిన్నే ప్రేమిస్తా | శ్రీనివాస్ | సౌందర్య | ఆర్.ఆర్. షిండే | ||
35 | 2000 | నువ్వు వస్తావని | చిన్ని | సిమ్రాన్ | వి.ఆర్.ప్రతాప్ | ||
36 | 1999 | రావోయి చందమామ | శశి | అంజలా జవేరీ | జయంత్ సి.పరాన్జీ | ||
37 | 1999 | సీతారామరాజు | రామరాజు | సంఘవి, సాక్షిశివానంద్ | వై.వి.ఎస్.చౌదరి | ||
38 | 1998 | చంద్రలేఖ | సీతా రామారావు | రమ్యకృష్ణ, | కృష్ణవంశీ | ||
39 | 1998 | ఆటో డ్రైవర్ | జగన్ | సిమ్రాన్, దీప్తి భట్నాగర్ | సురేష్ కృష్ణ | ||
40 | 1998 | ఆవిడా మా ఆవిడే | విక్రాంత్ | టాబు, హీరా | ఇ.వి.వి. సత్యనారాయణ | ||
41 | 1998 | అంగారే (హిందీ)[rowdy telugulo dubb ayyindhi] | రాజా | సొనాలిబింద్రే | మహేష్ భట్ | ||
42 | 1997 | రచ్చగన్ తమిళం[rakshakudu telugulo dubb ayyindhi] | అజయ్ | సుస్మితాసేన్ | ప్రవీణ్ గాంధీ | ||
43 | 1997 | అన్నమయ్య | అన్నమయ్య | రమ్యకృష్ణ, కస్తూరి (నటి) | కె. రాఘవేంద్రరావు | నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. | |
44 | 1996 | నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా) | శీను | టాబు | కృష్ణవంశీ | ||
45 | 1996 | రాముడొచ్చాడు | రామ్ | సౌందర్య, రవళి (నటి) | ఎ. కోదండరామిరెడ్డి | ||
46 | 1996 | వజ్రం (సినిమా) | చక్రి | రోజా సెల్వమణి, ఇంద్రజ | ఎస్. వి. కృష్ణారెడ్డి | ||
47 | 1995 | సిసింద్రీ (సినిమా) | రాజా | టాబు | శివనాగేశ్వరరావు | ||
48 | 1995 | క్రిమినల్ (సినిమా) | అజయ్ | మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ | మహేష్ భట్ | ||
49 | 1995 | ఘరానా బుల్లోడు | కళ్యాణ్ | రమ్యకృష్ణ | కె. రాఘవేంద్రరావు | ||
50 | 1994 | హలో బ్రదర్ | దేవ/రవివర్మ | సౌందర్య, రమ్యకృష్ణ | ఇ.వి.వి. సత్యనారాయణ | ద్విపాత్రాభినయం | |
51 | 1994 | గోవిందా గోవిందా | శ్రీను | శ్రీదేవి | రాంగోపాల్ వర్మ | ||
52 | 1993 | అల్లరి అల్లుడు | కళ్యాణ్ | నగ్మా, మీనా | ఏ.కోదండరామిరెడ్డి | ||
53 | 1993 | వారసుడు | వినయ్ | నగ్మా | ఇ.వి.వి. సత్యనారాయణ | ||
54 | 1993 | రక్షణ | బోస్ | శోభన, రోజా | ఉప్పలపాటి నారాయణరావు | ||
55 | 1992 | ప్రెసిడెంటు గారి పెళ్ళాం | రాజా | మీనా | ఎ. కోదండరామిరెడ్డి | ||
56 | 1992 | ద్రోహి | రాఘవ్/శేఖర్ | ఊర్మిళ (నటి) | రాంగోపాల్ వర్మ | ||
57 | 1992 | అంతం (సినిమా) | రాఘవ్ | ఊర్మిళ (నటి) | రాంగోపాల్ వర్మ | ||
58 | 1991 | ఖుదా గవా (హిందీ) | రాజా మిర్జా | శిల్పా శిరోద్కర్ | ముకుల్ ఎస్.ఆనంద్ | ||
59 | 1991 | కిల్లర్ | ఈశ్వర్/కిల్లర్ | నగ్మా | ఫాజిల్ | ||
60 | 1991 | జైత్రయాత్ర | తేజ | విజయశాంతి | ఉప్పలపాటి నారాయణరావు | ||
61 | 1991 | శాంతి క్రాంతి | క్రాంతి | జూహిచావ్లా | వి. రవిచంద్రన్ | కన్నడ మూలం | |
62 | 1991 | చైతన్య | చైతన్య | గౌతమి (నటి) | ప్రతాప్ వి. పోతన్ | ||
63 | 1991 | నిర్ణయం (సినిమా) | వంశీకృష్ణ | అమల | ప్రియదర్శన్ | ||
64 | 1990 | శివ (హిందీ) | శివ | అమల | రాంగోపాల్ వర్మ | ||
65 | 1990 | ఇద్దరు ఇద్దరే | రమ్యకృష్ణ | ఎ. కోదండరామిరెడ్డి | |||
66 | 1990 | నేటి సిద్దార్థ | సిద్దార్థ | శోభన | క్రాంతికుమార్ | ||
67 | 1990 | ప్రేమ యుద్దం | కళ్యాణ్ | అమల | రాజేంద్రసింగ్ | ||
68 | 1989 | శివ (1989 సినిమా) | శివ | అమల | రాంగోపాల్ వర్మ | ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు. | |
69 | 1989 | అగ్ని (హిందీ) | పవన్ | శాంతిప్రియ | ఇఫ్తేఖర్ చౌదరి | ||
70 | 1989 | గీతాంజలి | ప్రకాష్ | (( మణిరత్నం )) | |||
71 | 1989 | విక్కీ దాదా | విక్రం (విక్కీ) | ||||
72 | 1989 | విజయ్ | విజయ్ | ||||
73 | 1988 | జానకి రాముడు | రాము | ||||
74 | 1988 | మురళీ కృష్ణుడు | మురళీ కృష్ణ | ||||
75 | 1988 | చినబాబు | చినబాబు | ||||
76 | 1988 | ఆఖరి పోరాటం | విహారి | ||||
77 | 1987 | కిరాయిదాదా | విజయ్ | ||||
78 | 1987 | అగ్నిపుత్రుడు | కాళిదాసు | ||||
79 | 1987 | కలెక్టర్ గారి అబ్బాయి | రాజేష్ | ||||
80 | 1987 | సంకీర్తన | కాళి | ||||
81 | 1987 | మజ్ను | రాజేష్ | రజిని | దాసరి నారాయణరావు | ||
82 | 1987 | అరణ్యకాండ | |||||
83 | 1986 | కెప్టెన్ నాగార్జున | నాగార్జున | ||||
84 | 1986 | విక్రమ్ | విక్రమ్ | శోభన | వి. మధుసూదన్ రావు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.