స్నేహ

భారతీయ సినీ నటి From Wikipedia, the free encyclopedia

స్నేహ

స్నేహగా పేరొందిన సుహాసిని తెలుగు సినిమా నటి. ఈమె నటించిన సినిమాలలో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు కొన్ని సినిమాలు. అయితే, ఆమె నటించిన మొదటి సినిమా మలయాళంలో వచ్చిన ఎంగనే ఒరు నీల పక్షి.

త్వరిత వాస్తవాలు
స్నేహ

సినీనటి స్నేహ చిత్రపటం.
జన్మ నామంసుహాసిని రాజారాం
జననం (1981-10-12) అక్టోబరు 12, 1981 (age 43)
ముంబై, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2001 - ప్రస్తుతం
భార్య/భర్తప్రసన్న
పిల్లలు2
వెబ్‌సైటుhttp://www.paadal.com/actor/sneha స్నేహ
ప్రముఖ పాత్రలుపార్తిబన్ కనవులో సత్య/జనని
ఆటోగ్రాఫ్ లో దివ్య
మూసివేయి

జీవిత విశేషాలు

స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి, గోవింద్. ఈమె జననం ముంబైలో జరిగింది. తరువాత ఆమె కుటుంబం దుబాయికి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి(2000) అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.

అచ్చాముందు! అచ్చాముందు! లో స్నేహ ప్రసన్నతో మొదటిసారి జత కట్టారు. అప్పటి నుండి, వారి సంబంధంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న కనిపించే వాడు, ఇద్దరూ కలిసి సినిమా ప్రివ్యూల్లో కూడా కనిపించారు. కొద్దీ కాలం పాటు ఈ పుకార్లను కొట్టివేసిన ప్రసన్న, స్నేహ 2011 నవంబరు 9న వారి భందాన్ని ప్రకటించారు. చివరకు వారు 2012 మే 11న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.[1][2][3][4]

సినీ విశేషాలు

తరువాత ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా ప్రశాంత్ కథానాయకుడిగా విరుంబిగిరెన్ (2001) అనే సినిమాలో నటించింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాలలో అందరు అగ్ర కథానాయకులతో అనేక పాత్రలలో నటించింది.

స్నేహ నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.