దుబాయ్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం From Wikipedia, the free encyclopedia

దుబాయ్map

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు ఎమిరేట్స్ లలో దుబాయ్ (ఆంగ్లము - Dubai, అరబ్బీ భాష - دبيّ ), ఒకటి. మిగిలినవి అబు దాబి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి. దుబాయ్ సిటీగా పిలిచే ఇది ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణం. దుబాయ్ భారతీయులకు అందునా ఆంధ్రులకు చిరపరచితమైన పట్టణం. ఇక్కడ అత్యదికంగా వలస ఆంధ్రులు కలరు. దుబాయ్ గురించిన ఏదో ఒక వార్త తెలుగు పత్రికలలో, చానెళ్లలో ప్రతిరోజూ కనిపిస్తుంటుంది.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 25°16′N 55°20′E, ఎమిరేట్ ...
ఎమిరేట్ ఆఫ్ దుబాయి
إمارة دبيّ
Thumb
రాత్రివేళ దుబాయి దృశ్యం
రాత్రివేళ దుబాయి దృశ్యం
Thumb
Flag
Thumb
Location of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
Thumb
Location of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
అక్షాంశరేఖాంశాలు: 25°16′N 55°20′E
ఎమిరేట్ దుబాయి
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - అమీర్ షేక్ ముహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్
వైశాల్యము [1]
 - మెట్రో 4,114 km² (1,588.4 sq mi)
జనాభా (2006)[2][3]
 - సాంద్రత 345.65/km2 (895.2/sq mi)
 - మెట్రో 14,92,000
కాలాంశం దుబాయి ప్రామాణిక కాలం (UTC+4)
వెబ్‌సైటు:
Dubai Emirate
Dubai Municipality
మూసివేయి

చరిత్ర

డిసెంబరు 2 1971 న అబుధాబి, మిగిలిన ఐదు ఎమిరేట్స్ దుబాయితో కలసి యునైటెడ్ ఎమిరేట్స్ అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి.

భౌగోళికం

మరింత సమాచారం నం., Month ...
నం.Monthఅల్పంఅధికంఅత్యధికంఅత్యల్పంసగటున వర్షం నమోదయ్యే రోజులు
1జనవరి14223283
2ఫిబ్రవరి15233171
3మార్చి172738111
4ఏప్రిల్20314191
5మే243645180
6జూన్273845220
7జులై293947250
8ఆగస్టు303947.3250
9సెప్టెంబరు273844220
10అక్టోబరు233440160
11నవంబరు193041131
12డిసెంబరు16253163
పట్టిక 1[4]: నెలవారిగా నమోదయిన ఉష్ణోగ్రతలు (అన్ని విలువలు °Cలో తెలుపబడ్డాయి).
మూసివేయి

దుబాయ్ పర్సియన్ గల్ఫ్ సముద్రతీరం వెంబడి ఉంది. ఈ పట్టణం సముద్రమునకు దాదాపు సమానమైన ఎత్తుకలిగి ఉంది. దుబాయ్ సరిహద్దులు దక్షణాన అబుదాభి, ఉత్తర తూర్పుగా షార్జా, దక్షణౌత్తరంగా ఒమన్, పశ్చిమాన అజమాన్, తూర్పుగా రస్ అల్ ఖైమా, దుబాయ్ పట్టణాన్ని కొంత చుట్టినట్టుగా హత్తా పర్వతశ్రేణి.

జనగణన

2006 జనాభా లెక్కలననుసరించి దుబాయ్ జనాభా 1,422,000. పురుషులు, 1,070,000. స్త్రీలు 349,000. దుబాయ్ అధిక జనాభా ఆసియా వారు ( దాదాపు 85%. ఇందులో భారతీయులు 51%, పాకిస్తానీయులు 16%, బంగాలీలు 9%, పిలిప్పీనీయులు 3% ). మొత్తం ఎమిరేట్స్ జనాభాలో 71% ఆసియా వారే ఉన్నారు).

దుబాయ్ పట్టణంలో ప్రధాన భాష అరబిక్. అరబిక్ కాకుండా పర్షియన్, మళయాళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ అధికంగా మాట్లాడుతారు.

ఆర్థికం

దుబాయ్ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఉన్న జబెల్ అలి పోర్ట్ జబల్ అలి 1970లో నిర్మింపబడింది. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మింపబడిన అతిపెద్ద పోర్ట్. దుబాయ్ మీడియా, కంప్యూటర్, సమాచార రంగాలలో కూడా అభివృద్ధి కలిగిన నగరం. టెకమ్ అని పిలువబడే ( TECOM Dubai Technology, Electronic Commerce and Media Free Zone Authority) లో భాగంగా ఇక్కడ కల దుబాయ్ ఇంటర్నెట్ సిటీ (Dubaai Internet City), దుబాయ్ మీడియా సిటీ (Dubai Media City), నాలెడ్జ్ విలేజ్ (Knowledge Willage, దుబాయ్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ సెంటర్ (Dubai International Financial Centre (DIFC) మొదలగునవి ఉన్నాయి. ఇంటర్ నెట్ సిటీలో ప్రముఖ సంస్థలైన ఇ యమ్ సి కార్పోరేషన్ (EMC Corporation), ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation), మైక్రోసాప్ట్ కార్పొరేషన్ (Microsoft),, ఐ బి యమ్ (IBM), వంటివి ఉన్నాయి. మీడియా సిటీలో ప్రముఖ సంస్థలైన ఎమ్ బి ఎమ్ (MBC), సి ఎన్ ఎన్ (CNN), రైటర్స్ (Reuters), అసోసియేటెడ్ ప్రెస్

(AP) వంటివి ఉన్నాయి.

రవాణా

దుబాయ్ ప్రధాన రవాణాలు విమానం, బస్సు. ఇక్కడ రైలు సౌకర్యం ఇంతవరకూ అంటే 2007 వరకూ లేదు. నిర్మాణములో ఉన్న ట్రాక్ 2008 సంవత్సరంలో మొదలవుతుంది.

దుబాయ్ నగరానికి ప్రధాన రహదారి షేఖ్ జాయద్ రోడ్. ఇది మొత్తం ఆరు+ఆరు పన్నెండు లైనుల రోడ్. ఈ రహదారిపై వాహనాలకు సిటీలోపల 120, సిటీ బయట 140 కిలోమీటర్ల వేగం వరకూ పరిమితి ఉంది. ఈ రహదారికి కంప్యూటరు అనుసంధానం కలిగిన టాల్ గేట్స్ (వీటిని సాలిక్ (Salik road toll అని పిలుస్తారు) రెండు చోట్ల ఉన్నాయి. డబ్బు చెల్లించే పద్ధతిలో కాక వాహనం ముందు భాగాన ఒక ట్యాగ్ అతికించి ఉంచుతారు, వారికి ఒక అకౌంటు ఉంటుంది, అందులోనుండి వాహనం టోల్ గేట్ నుండి ప్రయాణించినపుడు డబ్బు మినహాయింపబడుతుంటుంది . ఎంత వేగంలో వెళ్ళే వాహనాన్నయినా టోల్ గేట్ దగ్గర కల స్కానర్ కెమెరాలు ట్యాగులను స్కాన్ చేస్తాయి.

దేవాలయాలు

ఇవీ చూడండి

  • దుబాయ్ ఆర్ధికం
  • దుబాయ్ పర్యాటకం
Thumb
సరళీకరించబడిన వంశవృక్షంలో అధికార క్రమము చూడవచ్చు.
ఈ టైమ్-లాప్స్ వీడియో 2000 నుండి 2011 వరకు సంవత్సరానికి ఒక ఫ్రేమ్‌లో దుబాయ్ వృద్ధి రేటును చూపుతుంది. వీడియోను రూపొందించిన తప్పుడు-రంగు ఉపగ్రహ చిత్రాలలో, బేర్ ఎడారి లేత గోధుమరంగు, మొక్కలతో కప్పబడిన భూమి ఎరుపు, నీరు నలుపు, పట్టణం ప్రాంతాలు వెండి.

గ్యాలరీ

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.