సెల్సియస్
From Wikipedia, the free encyclopedia
సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి, ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు. స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం.

చరిత్ర

సెల్సియస్ ఉష్ణ మాపకం
దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అంటారు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 00 C గా తీసుకున్నాడు. (మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత 00 C). ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని హిప్సోమీటర్లో ఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 1000 C గా తీసుకున్నాదు. (నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 1000 C). ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 100 సమ భాగాలుగా చేశాడు.సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 1000 C, అధో స్థిర స్థానంగా 00 C గా తీసుకున్నాడు.
- సెల్సియస్ ఉష్ణోగ్రతను ఫారెన్‍హీట్ డిగ్రీలుగా మార్చుటకు:[9/5xTemp 0C]+32.సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను మొదట 9/5 గుణించి, వచ్చిన విలువకు32 ను కలిపిన ఫారెన్‍హీట్ డిగ్రీలు వచ్చును.9/5 విలువ 1.8 కావున సెంటిగ్రేడును 1.8 చే గుణించి,వచ్చినవిలువకు 32ను కలిపినను సరిపోతుంది.
సాధారణ ఉష్ణోగ్రతలు
ఇతర ఉష్ణోగ్రత ప్రమాణాలతో సెల్సియస్ స్కేల్ కి సంబంధించిన కొన్ని కీలక ఉష్ణోగ్రతలు క్రింద పట్టికలో చూపబడ్డాయి.
కెల్విన్ | సెల్సియస్ | ఫారెన్ హీట్ | |
---|---|---|---|
పరమశూన్య ఉష్ణోగ్రత | 0 K | −273.15 °C | −459.67 °F |
ద్రవరూప నత్రజని ద్రవీభవన స్థానం | 77.4 K | −195.8 °C[1] | −320.4 °F |
పొడి మంచు యొక్క ఉత్పతన స్థానము . | 195.1 K | −78 °C | −108.4 °F |
ఫారన్ హీట్, సెల్సియన్ ఉష్ణోగ్రతల సమాన ఉష్ణోగ్రత విలువ | 233.15 K | −40 °C | −40 °F |
H2O (పరిశుద్ధ మంచు) యొక్క ద్రవీభవన స్థానం[2] | 273.1499 K | −0.0001 °C | 31.9998 °F |
నీటి త్రిధాకరణ బిందువు | 273.16 K | 0.01 °C | 32.018 °F |
సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత (సుమారు)[3] | 310.1 K | 37.0 °C | 98.6 °F |
1 ఎట్మాస్పియర్ (101.325 కిలో పాస్కల్) వద్ద నీటి బాష్పీభవన స్థానము (సుమారు: మరుగుస్థానం చూడండి)[4] |
373.1339 K | 99.9839 °C | 211.971 °F |
మూలాలు
ఇతర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.