శోభన

సినీ నటి, నర్తకి From Wikipedia, the free encyclopedia

శోభన

నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.

త్వరిత వాస్తవాలు శోభన, జననం ...
శోభన
Thumb
2021లో శోభన
జననం
శోభనా చంద్రకుమార్ పిళ్లై

(1970-03-21) 21 మార్చి 1970 (age 54)
త్రివేండ్రం (ప్రస్తుతం తిరువనంతపురం), కేరళ, భారతదేశం
వృత్తి
  • నటి
  • నర్తకి
  • కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅవివాహిత
పిల్లలు1
బంధువులుట్రావెన్‌కోర్ సిస్టర్స్ - లలిత, పద్మిని, రాగిణి
(మేనత్తలు)
కృష్ణ
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2006)
కళైమామణి (2011)
మూసివేయి

1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.

1994లో ఆమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.

నటి శోభన 2024 లోక్‌సభ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీవ్ చంద్ర శేఖర్ కు ఆమె మద్దతు తెలిపింది.[1][2]  

పురస్కారాలు

1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మలయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

శోభన నటించిన తెలుగు చిత్రాలు

అవార్డులు & గుర్తింపులు

మరింత సమాచారం సంవత్సరం, గౌరవం ...
సంవత్సరం గౌరవం సంస్థ మూ
2000 గ్రేడ్ A టాప్ దూరదర్శన్ [3]
2006 పద్మశ్రీ భారత ప్రభుత్వం [4]
2011 కలైమామణి తమిళనాడు ఏయల్ ఇసై నాటక మన్రం, తమిళనాడు ప్రభుత్వం [5]
2012 ఆర్చ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్ ఇండియా అచీవర్స్ కాన్ఫరెన్స్ [6]
2013 కళారత్న కేరళ సంగీత నాటక అకాడమీ [7]
2018 గౌరవ డాక్టరేట్ ( D.Litt ) వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ [8]
2019 డాక్టర్ MGR ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ [9]
2022 శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం [10]
2025 పద్మ భూషణ్ భారత ప్రభుత్వం [11][12]
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.