ట్రావెన్‌కోర్ సిస్టర్స్

From Wikipedia, the free encyclopedia

ట్రావెన్‌కోర్ సిస్టర్స్

ట్రావెన్‌కోర్ సిస్టర్స్ (ఆంగ్లం: Travancore Sisters) అంటే మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాలలో నటీమణులు, నృత్యకారులు అయిన లలిత, పద్మిని, రాగిణి ముగ్గురు సోదరీమణులు.[1][2] సినిమా నటి శోభన వీరి మేనకోడలు.

త్వరిత వాస్తవాలు ట్రావెన్‌కోర్ సిస్టర్స్, జననం ...
ట్రావెన్‌కోర్ సిస్టర్స్
జననంలలిత (1930 డిసెంబరు 12)
పద్మిని (1932 జూన్ 12)
రాగిణి (1937 మార్చి 27)
తిరువనంతపురం, ట్రావెన్‌కోర్, కేరళ
మరణంలలిత (1983)
పద్మిని (2006)
రాగిణి (1976)
ఇతర పేర్లుట్రావెన్‌కోర్ సోదరీమణులు
వృత్తినటి, నృత్యకళాకారిణి
తల్లిదండ్రులు
  • గోపాల పిళ్లై (తండ్రి)
  • సరస్వతమ్మ (తల్లి)
బంధువులుశోభన
కృష్ణ
మూసివేయి

ట్రావెన్‌కోర్ సోదరీమణులు తిరువనంతపురంలోని పూజప్పురాలోని మలయ కాటేజ్ అనే ఉమ్మడి కుటుంబంలో పెరిగారు.[3] వారు గురు గోపీనాథ్, గురు టి. కె. మహాలింగం పిళ్లై వద్ద నృత్యం నేర్చుకున్నారు.[4]

మొదటి సోదరీమణి లలిత 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది.[5] ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది.[6]

ఇక పద్మిని భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. ఆమె తన 30 సంవత్సరాల కెరీర్ లో తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును వివాహం చేసుకున్నా ఆమె 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రారంభించింది.

ట్రావన్‌కోర్ సిస్టర్స్ లలో చివరి సోదరీమణి రాగిణి అనేక నాటకాలతో పాటు తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు ఉన్నారు.

రాగిణి క్యాన్సర్‌తో 1976లో, లలిత 1982లో, పద్మిని 2006లో మరణించారు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.