అల్లుడుగారు

1990 సినిమా From Wikipedia, the free encyclopedia

అల్లుడుగారు

అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్‌కు రీమేక్.దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, శోభన, జగ్గయ్య,చంద్రమోహన్ , మున్నగు వారు నటించిన ఈ సూపర్ హిట్ చిత్రానికీ సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
అల్లుడుగారు
(1990 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం మోహన్ బాబు
తారాగణం మోహన్‌బాబు,
శోభన,
రమ్యకృష్ణ,
చంద్రమోహన్,
జగ్గయ్య
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు
మూసివేయి

కథ

కల్యాణి రామచంద్ర ప్రసాద్ ఒక్కగానొక్క కూతురు. ఆయన అమెరికాలో ఉంటూ తన కూతురును భారతదేశంలో ఉండి చదివిస్తుంటాడు. కల్యాణి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రామచంద్రప్రసాద్ ఈ వివాహాన్ని అంగీకరించాడు. ఈ లోపు కల్యాణి ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి పారిపోతాడు. రామచంద్రప్రసాద్ మనసు మార్చుకుని ఆమె వివాహానికి అంగీకరిస్తాడు. భారతదేశానికి వచ్చి ఒక రెండు వారాలపాటు కూతురు, అల్లుడుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఆయన సంతోషం కోసం కల్యాణి, ఆమె లాయరు ఆనంద్ కలిసి విష్ణు అనే అతన్ని రామచంద్ర ప్రసాద్ భారత్ లో ఉన్నన్నాళ్ళు నకిలీ భర్తగా ఏర్పాటు చేస్తారు.

నటీనటులు

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
  • కథ: ప్రియదర్శన్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: జాలాది, జొన్నవిత్తుల, గురుచరణ్, రసరాజు
  • సంగీతం: కె.వి.మహదేవన్

పాటలు

  • ముద్దబంతి నవ్వులో మూగకళ్ళ ఊసులు - జేసుదాస్, చిత్ర , రచన: గురుచరణ్.
  • కొండమీద - బాలు, చిత్ర , రచన: జాలాది రాజారావు
  • నగుమోము గనలేని (త్యాగరాజు కీర్తన) - జేసుదాస్, పూర్ణచందర్
  • కొండలలో నెలకొన్న (అన్నమయ్య కీర్తన)- జేసుదాస్, చిత్ర , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • అమ్మో అమ్మో - బాలు, చిత్ర, రచన: రసరాజు.

అవార్డులు

మూలాలు

బయటిలింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.