సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.[2] రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.
మంచు మోహన్ బాబు | |
---|---|
జననం | మంచు భక్తవత్సలం నాయుడు మార్చి 19, 1952[1] |
క్రియాశీల సంవత్సరాలు | 1975 - ఇప్పటివరకు |
బిరుదు | కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ నటప్రపూర్ణ విద్యాలయ బ్రహ్మ |
జీవిత భాగస్వామి | నిర్మల దేవి |
భాగస్వామి | శ్రీ విధ్యాదేవి నిర్మలా దేవి |
తల్లిదండ్రులు | మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మ |
వెబ్‌సైటు | MohanBabu.com |
మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్ కు సన్నిహితుడు.
మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 1952 మార్చి 19న[1] జన్మించాడు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ, కృష్ణ -, ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు,, తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నై (గతంలో మద్రాసు)లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు.
సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందాడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించాడు.
ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్ మంచులు కూడా చలన చిత్ర నటులు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న కొన్ని టీవీ కార్యక్రమాల్లో నటిస్తున్నారు.
స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 2015 వరకూ 520 చిత్రాలకు పైగా నటించాడు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్‌కింగ్‌గా కొలువయ్యాడు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్‌ఫుల్ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. 2015 నవంబరు 22 నాటికి మోహన్‌బాబు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నలభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు[3].
మోహన్ బాబు 510 చలన చిత్రాల్లో నటించాడు, అల్లుడుగారు , అసెంబ్లీ రౌడి , రౌడీ గారి పెళ్ళాం , మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టాయి ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు ఆ తరవాత వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రి హిట్ గా నిలిచింది శ్రీ రాములయ్య , అడవిలో అన్న తో మోహన్ బాబు లో మరో నటుడిని చూపించాడు వీటిలో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం, న్యాయం కోసం అన్నింటినీ త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి.
మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు.
మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి.
1982 లో మోహన్ బాబు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ (SLPP), సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఆయన 56 చిత్రాలు నిర్మించాడు.
మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్,, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు "నటప్రపూర్ణ" (పూర్తి నటుడు), "డైలాగ్ కింగ్", "కల్లెక్షన్ కింగ్" నే బిరుదులు పొందాడు.
Seamless Wikipedia browsing. On steroids.