కొండవీటి దొంగ

From Wikipedia, the free encyclopedia

కొండవీటి దొంగ
Remove ads

కొండవీటి దొంగ 1990 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించాడు. పరుచూరి సోదరులు కథ నందించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం సమకూర్చాడు.

త్వరిత వాస్తవాలు కొండవీటి దొంగ, దర్శకత్వం ...
Remove ads

కథ

కొండవీడు అనే గిరిజన గ్రామంలో రాజా అనే పిల్లవాడి తల్లిదండ్రులను కొంతమంది రౌడీలు తరుముతూ వస్తుంటారు. వాళ్ళు రాజా తండ్రిని చంపేసి ఆ నేరాన్ని తల్లి మీద మోపి జైలుకు పంపుతారు. రాజాని మాత్రం గూడెం నాయకుడు కాపాడతాడు. రాజా పట్నం వెళ్ళి బాగా చదువుకుని వస్తాడు. ఇంతకాలం తర్వాత కూడా అక్కడి ప్రజలు మోసానికి గురవుతూ ఉండటం గమనిస్తాడు. ఆ మోసాలకు కారణమవుతున్న శరభోజి, కాద్రా, అతని బృందంపై ఎదురు తిరగాలనుకుంటాడు. కానీ తనను కాపాడిన గూడెం నాయకుడు మాత్రం కొండవీటి దొంగగా అవతారం ఎత్తమని సలహా ఇస్తాడు. అలా రాజా కొండవీటి దొంగ వేషంలో ధనవంతుల దగ్గర సొమ్ము దొంగిలించి పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉంటాడు.

Remove ads

తారాగణం

పాటలు

  • జీవితమే ఒక ఆట, సాహసమే పూ బాట , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
  • శుభలేఖా రాసుకొన్నా ఎదలో ఎపుడో , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
  • శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • కోలో కోలోయమ్మ , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • టిప్ టాప్, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • దేవీ శాంభవి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

ఇవి కూడా చూడండి

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads