మంచు మోహన్ బాబు (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.[2] రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు మంచు మోహన్ బాబు, జననం ...
మంచు మోహన్ బాబు |
---|
|
జననం | మంచు భక్తవత్సలం నాయుడు (1952-03-19) 1952 మార్చి 19 (వయసు 72)[1]
|
---|
క్రియాశీల సంవత్సరాలు | 1975 - ఇప్పటివరకు |
---|
బిరుదు | కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ నటప్రపూర్ణ విద్యాలయ బ్రహ్మ |
---|
జీవిత భాగస్వామి | నిర్మల దేవి |
---|
భాగస్వామి | శ్రీ విధ్యాదేవి నిర్మలా దేవి |
---|
తల్లిదండ్రులు | మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మ |
---|
వెబ్సైటు | MohanBabu.com |
---|
మూసివేయి
మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజినీకాంత్ కు సన్నిహితుడు.
మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 1952 మార్చి 19న[1] జన్మించాడు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ, కృష్ణ -, ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు,, తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నై (గతంలో మద్రాసు)లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు.
సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందాడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించాడు.
ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్ మంచులు కూడా చలన చిత్ర నటులు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న కొన్ని టీవీ కార్యక్రమాల్లో నటిస్తున్నారు.
స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 2015 వరకూ 520 చిత్రాలకు పైగా నటించాడు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్‌కింగ్‌గా కొలువయ్యాడు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్ఫుల్ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. 2015 నవంబరు 22 నాటికి మోహన్‌బాబు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నలభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు[3].
మోహన్ బాబు 510 చలన చిత్రాల్లో నటించాడు, అల్లుడుగారు , అసెంబ్లీ రౌడి , రౌడీ గారి పెళ్ళాం , మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టాయి ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు ఆ తరవాత వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రి హిట్ గా నిలిచింది శ్రీ రాములయ్య , అడవిలో అన్న తో మోహన్ బాబు లో మరో నటుడిని చూపించాడు వీటిలో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం, న్యాయం కోసం అన్నింటినీ త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి.
మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు.
మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి.
- శాకుంతలం (2023)[4]
- సన్ ఆఫ్ ఇండియా[5]
- గాయత్రి[6]
- యమలీల 2 (2014)
- వస్తాడు నా రాజు (2011)
- పరమ వీర చక్ర (2011) తారాగణం
- ఝమ్మంది నాదం (2010) నటుడు
- పంచాక్షరి (2010) నెరేషన్
- సలీమ్ (2009) నిర్మాత, నటుడు
- రాజు మహారాజు (2009) నటుడు
- మేస్త్రీ (2009) నటుడు
- హీరో (2008)
- పాండురంగడు (2008) తారాగణం
- బుజ్జిగాడు (2008) తారాగణం
- కృష్ణార్జున (2008) నిర్మాత, సహాయ తారాగణానికి
- యమదొంగ (2007) నటుడు
- రాజుబాయ్ (2007) నిర్మాత
- గేమ్ (2006) నిర్మాత, నటుడు
- శ్రీ (2005) నిర్మాత, నటుడు
- పొలిటికల్ రౌడీ (2005) నిర్మాత, నటుడు
- సూర్యం (2004) నిర్మాత, సహాయ తారాగణానికి
- శివ్ శంకర్ (2004) నిర్మాత, నటుడు
- విష్ణు (2003) నిర్మాత, నటుడు
- తప్పుచేసి పప్పుకూడు (2002) నిర్మాత, నటుడు, గాయకుడు
- కొండవీటి సింహసనం (2002) నటుడు
- అధిపతి (2001) నిర్మాత, నటుడు
- రాయలసీమ రామన్న చౌదరి (2000) నిర్మాత,నటుడు 500 వ సినిమా
- పోస్ట్‌మాన్ (2000) నిర్మాత, నటుడు
- యమజాతకుడు (1999) నిర్మాత, నటుడు
- శ్రీ రాములయ్య (1998) నటుడు
- రాయుడు (1998) నిర్మాత, నటుడు
- ఖైదీగారు (1998) నిర్మాత, నటుడు
- అడవిలో అన్న (1997) నిర్మాత, నటుడు
- అన్నమయ్య (1997) తారాగణం
- కలెక్టర్‌గారు (1997) నిర్మాత, నటుడు
- వీడెవడండీబాబు (1997) నటుడు
- సోగ్గాడి పెళ్ళాం (1996) నటుడు
- అదిరింది అల్లుడు (1996) నటుడు
- పుణ్యభూమి నాదేశం (1995) నిర్మాత, నటుడు
- పెదరాయుడు (1995) నిర్మాత, నటుడు
- ఎమ్ ధర్మ రాజు "ఎమ్.ఏ" (1994) నటుడు
- వింత మొగుడు (1994) నటుడు
- అల్లరి పోలిస్ (1994) నిర్మాత, నటుడు
- మేజర్ చంద్రకాంత్ (1993) నిర్మాత, నటుడు
- రౌడి మొగుడు (1993) నటుడు
- కుంతీ పుత్రుడు (1993) నిర్మాత, నటుడు
- చిట్టెమ్మ మొగుడు (1992) నటుడు
- సామ్రాట్ అశోక్ (1992) నటుడు
- దొంగ పోలిస్ (1992) నటుడు
- అల్లరి మొగుడు (1992) నటుడు
- బ్రహ్మ (1992) నిర్మాత, నటుడు
- డిటెక్టివ్ నారద (1992) నటుడు
- అగ్ని నక్షత్రం (1991) తారాగణం
- అల్లుడు దిద్దిన కాపురం (1991) నటుడు
- కూలీ సంఖ్య 1 (1991) నటుడు
- రౌడీగారి పెళ్ళాం (1991) నిర్మాత, నటుడు
- కడప రెడ్డమ్మ (1991) నటుడు
- అసెంబ్లీ రౌడీ (1991) నిర్మాత, నటుడు
- పెద్దింటి అల్లుడు (1991) తారాగణం
- ప్రేమ పంజరం (1991) నటుడు
- కొండవీటి దొంగ (1990) నటుడు
- అల్లుడుగారు (1990) నిర్మాత, నటుడు
- ప్రాణానికి ప్రాణం (1990) తారాగణం
- మా ఇంటి కథ (1990) నిర్మాత, నటుడు
- మా ఇంటి మహరాజు (1990) నటుడు
- ప్రేమ యుద్ధం (1990) నటుడు
- కొదమ సింహం (1990) నటుడు
- కొండవీటి రౌడీ (1990) నటుడు
- లంకేశ్వరుడు (1989) నటుడు
- కొడుకు దిద్దిన కాపురం (1989) నటుడు
- భలే దొంగ (1989) నటుడు
- విజయ్ (1989) నటుడు
- రెండు టౌన్ రౌడి (1989) నటుడు
- బాల గోపాలుడు (1989) నటుడు
- ధ్రువ నక్షత్రం (1989) నటుడు
- ఒంటరి పోరాటం (1989) నటుడు
- బ్లాక్ టైగర్ (1989) నటుడు
- అగ్ని (1989) నటుడు
- నా మొగుడు నాకే సొంతం (1989) నిర్మాత, నటుడు
- ప్రజా ప్రతినిధి (1988) నటుడు
- యుద్ధం భూమి (1988) నటుడు
- వారసుడొచ్చాడు (1988) నటుడు
- ఖైదీ సంఖ్య 786 (1988) నటుడు
- మురళీ కృష్ణుడు (1988) నటుడు
- చిన్నబాబు (1988) నటుడు
- మంచి దొంగ (1988) నటుడు
- దొంగ రాముడు (1988) నటుడు
- బ్రహ్మపుత్రుడు (1988) నటుడు
- జానకి రాముడు (1988) నటుడు
- ఇంటింటి భాగవతం (1988) నటుడు
- ఆత్మకథ (1988) తారాగణం
- విశ్వనాథ నాయకుడు (1987) నటుడు
- చక్రవర్తి (1987) నటుడు
- సర్దార్ ధర్మాన్న (1987) నటుడు
- వీర ప్రతాప్ (1987) నిర్మాత, నటుడు
- మా ఇంటి మహాలక్ష్మి (1987) నటుడు
- నేనే రాజు నేనే మంత్రి (1987) నటుడు
- శ్రీనివాస కళ్యాణం (1987) నటుడు
- కొండవీటి రాజా (1986) నటుడు
- నాంపల్లి నాగు (1986) నటుడు
- పాపికొండలు (1986) నటుడు
- మానవుడు దానవుడు (1986) నిర్మాత, నటుడు
- ఉగ్రనరసింహం (1986) నటుడు
- తాండ్ర పాపారాయుడు (1986) నటుడు
- మరో మొనగాడు (1985) నటుడు
- నేరస్థుడు (1985) నటుడు
- రుణానుబంధం (1985) నటుడు
- రగిలే గుండెలు (1985) నిర్మాత, నటుడు
- తిరుగుబాటు (1985) నటుడు
- కొత్తపెళ్ళికూతురు (1985) నటుడు
- సంచలనం (1985) నటుడు
- అడవి దొంగ (1985) నటుడు
- ఇల్లాలికో పరీక్ష (1985) నటుడు
- కళ్యాణ తిలకం (1985) నటుడు
- ఏడడుగుల బంధం (1985) నిర్మాత, నటుడు
- ఈ తీర్పు ఇల్లాలిది (1984) నటుడు
- సర్దార్ (1984) నటుడు
- పద్మవ్యూహం (1984) నిర్మాత, నటుడు
- కురుక్షేత్రం తక్కువ సీత (1984) నటుడు
- సీతమ్మ పెళ్ళి (1984) నటుడు
- శ్రీమతి కావాలి (1984) నటుడు
- ఆడ పులి (1984) నటుడు
- భలే రాముడు (1984) నిర్మాత, నటుడు
- గృహ లక్ష్మి (1984) నటుడు
- రౌడీ (1984) నటుడు
- ప్రళయ గర్జన (1983) నటుడు
- ధర్మ పోరాటం (1983) నిర్మాత, నటుడు
- మరో మాయ బజార్ (1983) నటుడు
- పల్లెటూరి పిడుగు (1983) నటుడు
- రంగుల రాట్నం పులి (1983) నటుడు
- మాయగాడు (1983) నటుడు
- దుర్గాదేవి (1983) నటుడు
- అగ్నిజ్వాల (1983) నటుడు
- పోలీస్ వెంకట స్వామి (1983) నటుడు
- భార్యభర్తల సవాల్ (1983) నటుడు
- కాలయముడు (1983) నటుడు
- మూగవాని పగ (1983) నటుడు
- బిల్లారంగా (1982) నటుడు
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982) నటుడు
- దేవత (1982) నటుడు
- ప్రతీకారం (1982) నటుడు
- గృహ ప్రవేశం (1982) నటుడు, తారాగణం
- చందమామ (1982)
- ప్రతిజ్ఞ (1982) నిర్మాత, నటుడు
- కొత్త నీరు (1982) నటుడు
- సవాల్ (1982) నటుడు
- అంతరంగాలు (1982) నటుడు
- ప్రళయ రుద్రుడు (1982) నటుడు
- కిరాయి రౌడీలు (1981) నటుడు
- చట్టానికి కళ్ళు లేవు (1981) తారాగణం
- కొండవీటి సింహం (1981) నటుడు
- అగ్గిరవ (1981) తారాగణం
- ప్రేమ కానుక (1981) నటుడు
- సత్యం శివం (1981) నటుడు
- దీపారాధన (1981) నటుడు
- ప్రేమాభిషేకం (1981) నటుడు
- పటాలం పాండు (1981) నటుడు
- టాక్సీ డ్రైవర్ (1981) తారాగణం
- పాలు నీళ్లు (1981) నటుడు
- అద్దాల మేడ (1981) నటుడు
- డబ్బు డబ్బు డబ్బు (1981) నటుడు
- మానవుడు మహనీయుడు (1980) నటుడు
- సరదా రాముడు (1980) నటుడు
- సర్దార్ పాపారాయుడు (1980) నటుడు
- పిల్ల జమీందారు (1980) నటుడు
- ధర్మ చక్రం (1980) నటుడు
- చేసిన బాసలు (1980) నటుడు
- ఘరానా దొంగ (1980) నటుడు
- కక్ష (1980) తారాగణం
- బుచ్చిబాబు (1980) నటుడు
- కోతపేట రౌడీ (1980) నటుడు
- సర్కస్ రాముడు (1980) నటుడు
- మహాలక్ష్మి (1980) తారాగణం
- భలే కృష్ణుడు (1980) తారాగణం
- సుజాత (1980) నటుడు
- గురు (1980) నటుడు
- సీత రాముడు (1980) నటుడు
- త్రిలోక సుందరి (1980) నటుడు
- కేటుగాడు (1980) నటుడు
- గోపాల రావు గారి అమ్మాయి (1980) నటుడు
- గందరగోళం (1980) నటుడు
- పట్నం పిల్ల (1980) నటుడు
- రంగూన్ రౌడీ (1979) తారాగణం
- కొత్త అల్లుడు (1979) నటుడు
- రామబాణం (1979) నటుడు
- డ్రైవర్ రాముడు (1979) నటుడు
- అందడు ఆగడు (1979) తారాగణం
- ఏడడుగుల బంధం (1979) నటుడు
- శ్రీ రామ బంటు (1979) నటుడు
- కళ్యాణి (1979) తారాగణం
- మా ఊరి దేవత (1979) తారాగణం
- నిండు నూరేళ్ళు (1979) తారాగణం
- షోకిల్ల రాయుడు (1979) నటుడు
- రాముడే రావనుడైతే (1979) తారాగణం
- కుమార్ రాజా (1978) తారాగణం
- సింహగర్జన (1978) తారాగణం
- సింహాబలుడు (1978) నటుడు
- చల్ మోహన్ రంగ (1978) తారాగణం
- రామకృష్ణులు (1978) తారాగణం
- ముగ్గురు ముగ్గురే (1978) తారాగణం
- దొంగల దోపిడీ (1978) నటుడు
- కాలాంతకులు (1978) నటుడు
- విచిత్ర జీవితం (1978) తారాగణం
- నాయుడు బావ (1978) నటుడు
- గోరంత దీపం (1978) నటుడు
- బొమ్మరిల్లు (1978) తారాగణం
- పొట్టేలు పున్నమ్మ (1978) నటుడు
- గమ్మత్తు గూడాచారులు (1978) నటుడు
- పదహారేళ్ళ వయసు (1978) నటుడు
- శివరంజని (1978) నటుడు
- మనుషులు చేసిన దొంగలు (1977) తారాగణం
- దొంగలకు దొంగ (1977) నటుడు
- ఖైదీ కాళిదాస్ (1977) నటుడు
- బంగారు బొమ్మలు (1977) నటుడు
- కురుక్షేత్రం (1977) నటుడు
- ఇదెక్కడి న్యాయం (1977) నటుడు
- అత్తవారి ఇల్లు (1977) నటుడు
- ఓ మనిషి తిరిగొచ్చాడు (1977) నటుడు
- భలే అల్లుడు (1977) తారాగణం
- భలే దొంగలు (1976) నటుడు
- స్వర్గం నరకం (1975) నటుడు
- అల్లూరి సీతారామరాజు (1974) నటుడు
- కన్నా వారి కళలు (1974) నటుడు
- పద్మ వ్యూహం (1973) నటుడు
- రాముడే దేవుడు (1973) నటుడు
1982 లో మోహన్ బాబు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ (SLPP), సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఆయన 56 చిత్రాలు నిర్మించాడు.
- ప్రతిజ్ఞ (1982)150 రోజులు
- ఎడడుగుల బంధం (1985) 175 రోజులు
- నా మొగుడు నాకే సొంతం (1989) 150 రోజులు
- అల్లుడుగారు (1990) 120 రోజులు
- అసెంబ్లీ రౌడి (1991) 150 రోజులు
- రౌడిగారి పెళ్ళాం (1991) 170 రోజులు
- అల్లరి మొగుడు (1992) 200 వారాలు
- ఎన్ కౌంటర్ రాంబాబు (1992) 100 రోజులు
- బ్రహ్మ (1992) 150 రోజులు
- రాంబాబు సగం మెంటల్ (1993) 100 రోజులు
- మజర్ చంద్రకాంత్ (1993) 270 రోజులు
- పెదరాయుడు (1995) 475 రోజులు
- ప్రేమలోకం (1996) 170 రోజులు
- కలెక్టర్ గారు (1996) 275 రోజులు
- పరమాత్ముడు (1997) 120 days
- అడవిలో అన్న (1997) 150 రోజులు
- అత్త కొడుకా మజాకా (1998) 70 రోజులు
- యమజాతకుడు (1999) 100 రోజులు
- పోస్ట్ మ్యాన్ (2000) 50 రోజులు
- రాయలసీమ రామన్న చౌదరి (2000) 175 రోజులు
- అధిపతి (2001) 120 రోజులు
- తప్పుచేసి పప్పుకూడు (2002) 50 రోజులు
- శివ్ శంకర్ (2004) 100 రోజులు
- పొలిటికల్ రౌడీ (2005) 50 రోజులు
- జిన్నా (2022)
మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్,, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు "నటప్రపూర్ణ" (పూర్తి నటుడు), "డైలాగ్ కింగ్", "కల్లెక్షన్ కింగ్" నే బిరుదులు పొందాడు.
- చిత్ర పరిశ్రమకు ఆయన సేవలకు గుర్తింపుకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు బహుకరించింది.
- కళా ప్రపూర్ణ
- కర్ణాటక రాష్ట ప్రభుత్వం నుంచి శ్రీ కృష్ణ దేవరాయలు పురస్కారం
- శ్రీ విద్యాలయ బ్రహ్మ
- యాక్టర్ ఆఫ్ ది మిలీనియం
- తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ : లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్
- నటవాచస్పతి
- డా. బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు
- ప్రనం అవర్డు in uk
- స్వర్ణకనకం 2015
- లండన్ తెలుగు సంఘం (తాల్) వారు తాల్ హయ్యస్ట్ ప్రెస్టిజియస్ అవార్డు
- నవరస నటరత్నం TSR 17 09 2016
- 4డికేడ్స్ స్టార్ TSR 08 04 2017