From Wikipedia, the free encyclopedia
పెద వేంకట రాయలు 1632-1642 కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతన్ని పెద వేంకట రాయలు అని చారిత్రికులు ఉదహరిస్తారు. ఇతడు తెలుగు కుటుంబానికి చెందినవాడు, [1][2][3] అళియ రామరాయల మనవడు.[4][5][6] అతని బావమరదులు దామర్ల వెంకటప్ప నాయకుడు, దామర్ల అయ్యప్ప నాయకుడు. ఈ ఇద్దరూ దామర్ల చెన్నప్ప నాయకుడి కుమారులు [7][8][9][10][11]
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వెంకటపతి రాయల బాబాయి, మొదటి శ్రీరంగ రాయల సోదరుడూ అయిన తిమ్మరాజు, రాజయ్యే అర్హత తనకే ఎక్కువ ఉందని భావించి, వెల్లూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. పెద వేంకట రాయలు తన స్వంత ఊరు అనెకొండలోనే ఉండేలా చేశాడు. జింగీ, తంజోర్, మదురై నాయకులు పెద వేంకట రాయలుకు మద్దతు ప్రకటించగా, తిమ్మరాజుకు ఎవ్వరి మద్దతూ లేదు. అందరూ అతన్ని కుట్రదారుగా భావించారు.
అయినప్పటికీ తిమ్మరాజు చాలా ఇబ్బంది పెట్టాడు. 1635 లో అతడు మరణించే వరకూ అంతర్గత కల్లోలం కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో అతను గెలిచాడు, రాజు పెద వెంకట రాయల మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు మైదానంలోకి వెళ్లి తిమ్మ రాజును పులికాట్లోని డచ్వారి సహాయంతో ఓడించాడు. పెద వెంకట రాయల వాదనను అంగీకరించక తప్పలేదు. కొన్ని భూభాగాలను తిమ్మరాజు ఉంచుకోవడానికి పెద వేంకట రాయలు అనుమతించాడు. కాని తిమ్మరాజు మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. ఈసారి, 1635 లో, అతడు జింజీ నాయకుడు చంపేసాడు.
చివరకు శాంతి పునరుద్ధరించబడింది. పెద వేంకట రాయలు బాధ్యతలు స్వీకరించడానికి వెల్లూరుకు తిరిగి వచ్చాడు.
1639 ఆగస్టు 22 న ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలో వాణిజ్య కార్యకలాపాల కోసం కర్మాగారాన్ని, గిడ్డంగినీ నిర్మించేందుకు గాను, పెద వేంకట రాయలు కంపెనీకి చెందిన చెందిన ఫ్రాన్సిస్ డేకు కొంత భూమిని దానం చేసాడు. ఈ ప్రాంతం కాళహస్తి, వండవాసికి చెందిన రేచెర్ల వెలమ నాయకుడు, దామెర్ల వెంకటాద్రి నాయకుడి ఆధీనంలో ఉండేది. వెంకటాద్రి నాయకుడు దామెర్ల చెన్నప్ప నాయకుడి కుమారుడు. చెన్నై (మద్రాస్) మహానగరానికి పునాది పడిన ఘటన ఇది. దీన్ని మద్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
1637 లో, తంజావూరు మదురై నాయకులు, కొన్ని సమస్యల కారణంగా, పెద వేంకట రాయలును ఓడించేందుకు ఉద్దేశంతో వెల్లూరుపై దాడి చేశారు కాని ఓడిపోయారు. శాంతి నెలకొంది.
రాజుకు నమ్మకమైన మేనల్లుడు, రెండవ శ్రీరంగ రాయలు కొన్ని కారణాల వల్ల 1638 లో రాజుకు ఎదురు తిరిగాడు. బీజాపూర్ నుండి దండయాత్రకు రూపకల్పన చేశాడు. బీజాపూర్ - రెండవ శ్రీరంగ రాయల సంయుక్త సైన్యం మొదట్లో బెంగళూరుపై దాడి చేసింది, పెద వేంకట రాయలు చాలా వెల చెల్లించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1641 లో మళ్ళీ అదే సంయుక్త సైన్యం మరొక దాడి చేసింది. వెల్లూరు కోట నుండి కేవలం 12 మైళ్ళ దూరంలో ఉండగా, వారి శిబిరంపై దక్షిణాది నాయకుల మద్దతుతో దాడి పెద వేంకట రాయలు దాడి చేసి తరిమేసాడు
ఈ అశాంతిని గమనిస్తూ ఉన్న గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి రాజవంశం, తరువాతి సంవత్సరంలో (1641) తూర్పు తీరం వెంబడి భారీ సైన్యాన్ని పంపింది. గోల్కొండ సైన్యం, మద్రాసు సమీపంలో వెంకటపతి రాయల సైన్యం నుండి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. కాళహస్తికి చెందిన దామెర్ల వెంకటాద్రి నాయకుడు, జింజీ నాయకుడు అతడికి తోడ్పడ్డారు. వీళ్ళ ప్రతిఘటనను ఎదుర్కొంటూనే గోల్కొండ సైన్యం వెల్లూరు కోట దిశగా కదిలింది. అన్ని వైపుల నుండి ముంచుకొచ్చిన ముప్పు చూసి పెద వేంకట రాయలు, చిత్తూరు అడవుల్లోకి పారిపోయి, అక్కడే 1642 అక్టోబరులో మరణించాడు.
పెద వేంకట రాయలుకు కుమారుడు లేడు. అతని తరువాత అతని నమ్మకద్రోహ మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు, బీజాపూర్ శిబిరాన్ని విడిచిపెట్టి వెల్లూరు కోటకు వచ్చి గద్దెనెక్కాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.