Remove ads
From Wikipedia, the free encyclopedia
రెండవ హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు మరణానంతరము 1377లో సింహాసమునకు వచ్చాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మొదటి బుక్క రాయలు కుమారుడైన కంప రాయలే ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయము. ఇతను రాగానే చేసిన మొదటి పని, తన తండ్రి గారి కాలములో సామంతులుగా నియమితులైన అనేక రాజ బంధువులను స్వతంత్రులు కావాలెననెడి అభిలాషనుండి మరల్చి, వారిని తొలగించి, తన పుత్రులను నియమించాడు. ఉదయగిరికి దేవ రాయలును, మధుర ప్రాంతములకు విరూపాక్ష రాయలును అధికారులుగా నియమించాడు.
ఇంతకు పూర్వం విజయనగర పాలకులైన మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు సామంతరాజులకు తగిన గౌరవాలైన మహామండలేశ్వర, ఓఢియ, శత్రురాజ దండకుడు వంటి బిరుదులు ధరించారు. రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి చక్రవర్తికి తగిన బిరుదులు ధరించిన తొలి విజయనగర పాలకుడు రెండవ హరిహర రాయలు.[1]
మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్ధాలు తప్పలేదు. 1378లో బహుమనీ సుల్తాను ముజాహిద్ షా దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. 1378 నందే రెండవ మహమ్మద్ షా సింహాసనము అధిస్టించాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. కొండవీడు రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి, కుమార గిరి రెడ్డి, కాటయ వేమారెడ్డి ల మధ్య తరచూ యుద్ధములు జరుగుతుండేవి. ఇదే సమయములో రేచర్ల పద్మనాయకులు బహమనీ సుల్తానులతో స్నేహం చేసుకొని విజయనగర, కొండవీడు రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించారు. ఇటువంటి పరిస్థితులలో రెండవ హరిహర రాయలు కొండవీడు రాజ్యమందున్న శ్రీశైలం ప్రాంతమును ఆక్రమించారు. కానీ కాటయ వేమారెడ్డి విజయనగర సేనలను ఎదుర్కొని ఓడించాడు. హరిహర రాయలు కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు కాటయకూ తన కూతురు లక్ష్మికి వివాహం జరిపించాడు.
హరి హర రాయలు కుమారుడైన దేవ రాయలు ఉదయగిరి అధిపతి . ఆతడు సైన్యముతో మోటుపల్లి రేవును ఆక్రమించాడు. తరువాత కొండవీడు రాజ్యముపైకి హరిహర రాయలు చౌండసేనానిని పంపించాడు. ఇదే సమయంలో కొండవీడును కుమారగిరి రెడ్డి నుండి స్వాధీనము చేసుకున్న పెదకోటి వేమా రెడ్డి విజయనగర సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేశాడు.
హరిహర రాయలు పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, యువరాజు అయిన రెండవ బుక్కరాయలును పంపించాడు, ఈ యుద్ధములో సాళువ రామదేవుడు అను యోధుడు చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో పద్మనాయక ప్రభువులకు బహుమనీ సుల్తానులు సహాయం చేసారు. కొత్తకొండ ప్రాంతమున జరిగిన పోరాటంలో సాళువ రామదేవుడు ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలు అర్పించాడు. రెండవ బుక్క రాయలు ఓటమిభారంతో విజయనగరం తిరిగి వచ్చాడు.
1397లో మరలా రెండవ హరిహర రాయలు, గండదండాధీశుడు వంటి అనేక వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి యువరాజు రెండవ బుక్క రాయలును మరల పద్మనాయకులు పైకి దండయాత్రకు పంపించాడు. ఇదే సమయలో దేవరాయలు మరికొంత సైన్యముతో అలంపురం పైకి దండెత్తినాడు. ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహాయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ విజయనగర రాజ సైనికులు కృష్ణా నది ఉత్తరభాగమున ఉన్న పానుగల్లు కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే చౌల్ దాలోల్ ప్రాంతమును విజయనగర సైనికులు సాధించారు.
విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్ధిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. విజయనగర సామ్రాజ్య నావికాదళ శక్తి ఈ సింహళ దేశ విజయయాత్ర ప్రదర్శించింది.
పైన చెప్పుకున్నటుల కొండవీడు విషయములలోనూ, వారి అంతఃకలహాలలోనూ విజయనగరరాజులు జోక్యము చేసుకున్నారు. కొన్ని ప్రాంతములు ఆక్రమించ ప్రయత్నించారు. చివరకు కాటయ వేమా రెడ్డి వీరికి సహాయము చేసాడు.
ఈ రాజు పరిపాలనా కలమున దేశమునందు గొప్ప కరువు ఏర్పడినట్లు తెలుస్తున్నది
వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు. అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా!
నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన రెండవ బుక్క రాయలు ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, సింహళమును జయించినవాడు అయిన విరూపాక్ష రాయలు సింహాసనము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించాడు, కానీ రెండవ బుక్క రాయలు తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించాడు. తరువాత దేవరాయలు ఉదయగిరి దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసనం అధిష్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ విజయవంతమైన పరిపాలన చేసాడు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.