Remove ads
కర్ణాటక రాష్ట్రం, విజయనగర జిల్లాలోని నగరం From Wikipedia, the free encyclopedia
హోస్పేట్ లేదా విజయనగర భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా లోని నగరం.ఇది విజయనగర జిల్లాకు ప్రధాన కార్యాలయం.ఈ నగరం తుంగభద్ర నది ఒడ్డున ఉంది.హంపి నుండి 13 కి.మీ. దూరంలో ఉంది.ప్రస్తుత హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని.ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. హోసపేట ఉత్తర, దక్షిణ కర్ణాటకల మధ్య అనుసంధాన మార్గం ఉంది.ఇది రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 333 కిమీ దూరంలో ఉందింది.
Hosapete | |
---|---|
City | |
Vijayanagara | |
Nickname(s): Steel City, Back Door of Vijayanagara | |
Coordinates: 15.2689°N 76.3909°E | |
Country | India |
State | Karnataka |
District | Vijayanagara |
Established | 1520 |
Founded by | Krishnadevaraya |
Named for | Nagalapura |
Government | |
• Type | City Municipal Council |
• Body | CMC |
విస్తీర్ణం | |
• City | 70.12 కి.మీ2 (27.07 చ. మై) |
Elevation | 479 మీ (1,572 అ.) |
జనాభా (2011)[1] | |
• City | 2,06,167 |
• Rank | 224th India, 14th Karnataka |
• జనసాంద్రత | 2,900/కి.మీ2 (7,600/చ. మై.) |
• Metro | 2,44,048 |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 583 201, 02, 03, 11, 23, 25 |
Telephone code | 08394 |
Vehicle registration | KA-35 |
హోసపేట నగరాన్ని సా.శ. 1520 లో విజయనగర సామ్రాజ్య ప్రముఖ పాలకులలో ఒకరైన శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించాడు.అతను తన తల్లి నాగలాంబిక గౌరవార్థం ఈ నగరాన్ని నిర్మించాడు.ఈ నగరానికి మొదట నాగలాపుర అని పేరు పెట్టారు.అయినప్పటికీ, ప్రజలు నగరాన్ని హోసా పేట్ అని పిలుస్తారు.దీని అర్థం "కొత్త నగరం" అని సూచిస్తుంది.హంపి, హోసపేట మధ్య ప్రాంతాన్ని ఇప్పటికీ నాగలాపుర అని పిలుస్తారు.పశ్చిమతీరం నుండి వచ్చే ప్రయాణికులకు విజయనగర నగరానికి ఇది ప్రధాన ద్వారం.
ఈ ప్రాంతానికి ప్రస్తుత శాసనసభ సభ్యుడు ఆనంద్ సింగ్.[2] అక్టోబరు 2014లో నగరం పేరు మార్చాలనే అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది. 2014 నవంబరు 1న హోస్పేట్ పేరు "హోసపేట"గా మార్చింది [3]
ప్రస్తుతం దేశంలోనే ఎత్తైన జెండా స్తంభం ఈ నగరంలో ఉంది.2022 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హోసపేటలో 405 అడుగుల ఎత్తైన స్తంబంతో జాతీయ జెండాను ఎగురవేశారు. [4]
హోసపేట భారతదేశంలోని అనేక ముఖ్యమైన నగరాలతో రహదారి మార్గాలు ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. దీనికి బళ్లారి సుమారు 60 కిమీ దూరంలో ఉంది.హోసపేట జంక్షన్ రైల్వే స్టేషన్ హుబ్లీ - గుంతకల్ రైలు మార్గంలో ఉంది. [5] హోసపేట నగరానికి సమీప విమానాశ్రయం జిందాల్ విద్యానగర్ విమానాశ్రయం (బళ్లారి విమానాశ్రయం). హోసపేట నుండి సుమారు 3౦ కిమీ దూరంలో ఉంది.ఇది ప్రతిరోజూ బెంగళూరు, హైదరాబాద్ నుండి విమానాలను అందిస్తుంది.అదనంగా నగరంలో బాగా అభివృద్ధి చెందిన వ్యాపార కూడలి ప్రాంతం ఉంది. హంపి, తుంగభద్ర ఆనకట్టలుకు సమీపంలో ఉండటం వల్ల హోసపేట ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది.
పురపాలక మైదానం సాయంత్రం నడవడానికి,ఆటలకు అప్పుడప్పుడు వ్యాపార ప్రదర్శనలకు అనుకూలంగా ఉంటుంది.దాని చుట్టూ తినుభండారాల కేంద్రాలు కూడా ఉన్నాయి.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,హోస్పేట్ మొత్తం జనాభా 2,06,167, ఇందులో పురుషులు 1,02,668 మందికాగా,స్త్రీలు 1,03,499 మంది ఉన్నారు. పట్టణంలో సగటు అక్షరాస్యత రేటు 79.30% శాతం ఉంది. పురుషుల అక్షరాస్యత 85.95% శాతం ఉండగా,స్త్రీల అక్షరాస్యత 72.74%. శాతం ఉంది. హోస్పేట్ జనాభాలో 13.46% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.