Remove ads
దక్షిణ భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia
విజయనగర జిల్లా, దక్షిణ భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా.ఇది కల్యాణ-కర్ణాటక ప్రాంతంలో ఉంది.[1][2] విజయనగర నగరం దీని ప్రధాన కార్యాలయం. విజయనగర అధికారికంగా బళ్లారి నుండి 2021 అక్టోబరు 2న అధికారికంగా రూపొందించబడింది. విజయనగర జిల్లా కేంద్రంగా రాష్ట్రంలో 31వ జిల్లాగా అవతరించింది.[3][4] ఇది ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్యం పూర్వ రాజధాని హంపికి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, అనేక చారిత్రక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి.[5]
Vijayanagara district | |||||||
---|---|---|---|---|---|---|---|
District of Karnataka | |||||||
Country | India | ||||||
State | Karnataka | ||||||
Division | Kalaburagi | ||||||
Formation | 2 అక్టోబరు 2021 | ||||||
Named for | Vijayanagara Empire | ||||||
Headquarters | Vijayanagara | ||||||
Taluks |
| ||||||
Government | |||||||
• Body | Vijayanagara Zilla Panchayat | ||||||
• Deputy Commissioner | Venkatesh T, IAS | ||||||
• Superintendent of Police | Shrihari Babu B L, IPS | ||||||
• Chief Executive Officer | Sadashiva Prabhu B | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 4,252 కి.మీ2 (642 చ. మై) | ||||||
Elevation | 449 మీ (1,473 అ.) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 13,53,628 | ||||||
• జనసాంద్రత | 320/కి.మీ2 (2,100/చ. మై.) | ||||||
Language | |||||||
• Official | Kannada | ||||||
Time zone | UTC+౦5:30 (IST) | ||||||
Telephone code | Hospet 08394 | ||||||
Vehicle registration | KA-35 |
చివరి మధ్యయుగ భారతదేశంలో, ప్రస్తుత విజయనగర జిల్లాతో కూడిన ప్రాంతం విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా ఉంది. బ్రిటిష్ పాలనలో ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాష్ట్రాల ఏర్పాటు సమయంలో,1953లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో,విజయనగర ప్రాంతం కొత్తగా ఏర్పడిన మైసూర్ రాష్ట్రం లోని బళ్లారి జిల్లాలో భాగమైంది. 2020లో బళ్లారి నుంచి ఆరు ఉప పరిపాలనా విభాగాలను విభజించి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.2020లో బి.ఎస్.యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రణాళికను ఆమోదించింది. 2020 నవంబరు 18న విజయనగర జిల్లా ఏర్పాటుకు ప్రకటనను వెలువరించింది. తద్వారా ఇది కర్ణాటకలోని 31వ జిల్లాగా మారింది. ప్రస్తుతం విజయనగర జిల్లా కల్యాణ కర్ణాటక ప్రాంతంలో ఒక భాగంగా ఉంది.
విజయనగర జిల్లాలో ఆరు ఉపపరిపాలనా విభాగాలు ఉన్నాయి. రెండు ఉపవిభాగాలు,18 గ్రామ సమూహాలు ఉన్నాయి.హోసపేట జిల్లా పరిపాలనా కేంద్రంగా ఉంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం,విజయనగర శాసనసభ సభ్యుడు ఆనంద్సింగ్ను విజయనగర జిల్లా వ్యవహారాల బాభ్యతలు పర్వేక్షణ మంత్రిగా నియమించింది.
జాతీయ శాసనసభ లోక్సభలో,దావణగెరె నియోజకవర్గంలో భాగమైన హరపనహళ్లి మినహా విజయనగర జిల్లా బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో ( షెడ్యూల్డ్ తెగలకు కేటాయింపు) భాగం.
రాష్ట్ర శాసనసభ దిగువ సభలో, విజయనగర జిల్లాకు చెందిన హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి (షెడ్యూల్డ్ కులాలు), విజయనగర, కుడ్లిగి (షెడ్యూల్డ్ తెగలు), హడగల్లి (షెడ్యూల్డ్ కులాలు) అనే ఐదు శాసనసభ స్థానాలు ఉన్నాయి:
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు విజయనగర జిల్లా పరిధిలో మొత్తం 13,53,628 మంది జనాభాను కలిగి ఉంది.అందులో 3,59,694 (26.57%) మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. విజయనగర జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 976 మంది స్త్రీల లింగ నిష్పత్తిని కలిగి ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 3,22,603 (23.83%) మంది, 2,35,724 (17.41%) మంది ఉన్నారు.[6][7]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 78.09% కన్నడ, 9.37% ఉర్దూ, 5.82% లంబాడీ, 3.97% తెలుగు, 1.07% శాతం మంది ఉన్నారు. మొదటి భాషగా తమిళం మాట్లాడతారు.[8]
కన్నడ విశ్వవిద్యాలయం,పరిశోధన-ఆధారిత ప్రభుత్వ విశ్వవిద్యాలయం, హంపిలో ఉంది.ఈ విశ్వవిద్యాలయం కన్నడ భాషను అభివృద్ధి చేయడం, దాని సాహిత్యం, సంప్రదాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎస్. బంగారప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వంచే స్థాపించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.