శాసనసభ సభ్యుడు

శాసనసభలో ఒక సభ్యుడు From Wikipedia, the free encyclopedia

శాసనసభ సభ్యుడు
Remove ads
Remove ads

శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) భారత ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.[1] భారతదేశంలో ద్విసభలు ఉండే శాసనసభ సభ్యులు, భారత పార్లమెంటు (దిగువ సభ) లోక్‌సభలో ప్రతి పార్లమెంటు సభ్యుడికి (ఎంపి) ప్రతి రాష్ట్రానికి ఏడు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు.భారత కేంద్రపాలిత ప్రాంతాలైన, ఢిల్లీ శాసనసభ, జమ్మూ కాశ్మీర్ శాసనసభ, పుదుచ్చేరి శాసనసభ ఈ మూడు రాష్ట్రాలలో ఏకసభ్య శాసనసభ సభ్యులు కూడా ఉన్నారు.

Thumb
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
Remove ads

శాసనసభ సభ్యుడు అర్హత

శాసనసభలో సభ్యత్వం పొందే అర్హతలు ఎక్కువగా పార్లమెంటు సభ్యునిగా ఉండటానికి ఉండే అర్హతలను పోలి ఉంటాయి.

  • శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి, ఒక వ్యక్తి మంచి మనస్సు కలిగి ఉండాలి
  • ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఒక వ్యక్తి, ఆ రాష్ట్రంలోని ఏదైనా శాసనసభ నియోజకవర్గానికి ఓటరుగా నమోదై ఉండాలి.
  • శాసనసభ సభ్యుడిగా ఉండటానికి 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు.[2]
  • శాసనమండలి సభ్యుడిగా ఉండటానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం 30 ఏళ్ల వయస్సుకంటే తక్కువ ఉండకూడదు.
  • శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత ప్రభుత్వం లేదా భారత రాష్ట్రానికి చెందిన మంత్రి పదవి మినహా మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వంలోనూ లాభదాయక పదవిలో ఉండకూడదు.
  • శాసనసభ సభ్యుడుగా ఉన్న వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడకూడదు, 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించఉండరాదు
  • శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, కోర్టు చేత దోషిగా నిర్ధారించబడితే, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో దోషిగా తేలితే ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండలేరు.
Remove ads

శాసనసభ సభ్యుడు అధికారాలు, విధులు

శాసనసభ సభ్యుల అధికారాలు, విధులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[3]

శాసన అధికారాలు

శాసనసభ అతి ముఖ్యమైన పని చట్ట తయారీ. భారత రాజ్యాంగం - ఏడవ షెడ్యూల్ (ఆర్టికల్ 246) ద్వారా నిర్వచించినట్లుగా, జాబితా II (రాష్ట్ర జాబితా), జాబితా III (ఏకకాలిక జాబితా) లోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించడానికి ఎమ్మెల్యేలకు అధికారం ఉంది. వాటిలో కొన్ని పోలీసు, జైళ్లు, నీటిపారుదల, వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాలు, ప్రజారోగ్యం, తీర్థయాత్రలు, శ్మశానవాటికలు మొదలైనవి. పార్లమెంటు, రాష్ట్రాలు చట్టాలు చేయగల కొన్ని అంశాలు విద్య, వివాహం, విడాకులు, అడవులు, అడవి జంతువుల, పక్షులు రక్షణ మొదలగునవి.[3]

ఆర్థిక అధికారాలు

అసెంబ్లీ, ఎమ్మెల్యేల తదుపరి ముఖ్యమైన పాత్ర ఆర్థిక బాధ్యత. శాసనసభ రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై నియంత్రణను కలిగి ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌ను ఆమోదించాలి.పరిపాలన వ్యాపారం కోసం తగినంతగా లేదా తగిన విధంగా డబ్బు కేటాయించబడిందని నిర్ధారించుకోవాలి.[3]

కార్యనిర్వాహక అధికారాలు

కార్యనిర్వాహక పర్యవేక్షణ కూడా ఉంది.ఎగ్జిక్యూటివ్ అమలు చేసే అన్ని కార్యక్రమాలు, పథకాలను శాససభ్యులు పర్యవేక్షిస్తారు లేదా పరిశీలిస్తారు.దీని అర్థం వారు కేవలం లబ్ధిదారుల జాబితాలు, గృహాలను ఆమోదించే కమిటీలలో కూర్చుని స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారో నిర్ణయిస్తారు. ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ తన పనిని బాధ్యతాయుతంగా, ప్రతిస్పందనగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, రాజకీయ కార్యనిర్వాహక నిర్ణయాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని వారు భావించవచ్చు.[3]

ఎన్నికల అధికారం

భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో రాష్ట్ర శాసనసభ తరపన శాసన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు.శాసనసభలో ఎన్నికైన సభ్యులు, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులతో ఈ ప్రక్రియ జరుగుతుంది.[3]

రాజ్యాంగ అధికారాలు

భారత రాజ్యాంగంలోని కొన్ని భాగాలను పార్లమెంటు, సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరించవచ్చు.ఆ విధంగా రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్ర శాసనసభలు తరుపున శాసనసభ్యులు కీలక పాత్ర ఉంది.[3]

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading content...

వెలుపలి లంకెలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads