మొదటి దేవరాయలు

విజయనగర చక్రవర్తి From Wikipedia, the free encyclopedia

మొదటి దేవరాయలు

మొదటి దేవ రాయలు ఇతను రెండవ హరిహర రాయలు కుమారుడు.[1] తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు.

త్వరిత వాస్తవాలు మొదటి దేవరాయలు, పరిపాలన ...
మొదటి దేవరాయలు
మొదటి దేవరాయలు
మొదటి దేవరాయలు హంపీలో నిర్మించిన హజార రామాలయం
పరిపాలన1406–1422 CE
మూసివేయి
మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646
మూసివేయి

యుద్దములు

ఫిరోద్ షా తో తొలి యుద్దం

సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకొని ఫిరోద్ షా విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని సయ్యదలీ వ్రాతల వలన తెలియుచున్నది.

రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు

కందుకూరును పరిపాలిస్తున్న రెడ్డి రాజులు\, ఉదయగిరి రాజ్యమందున్న పులుగునాడు, పొత్తపినాడులను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. ఉదయగిరి దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము. ఈ సమయములో దేవరాయలు\, రాజమహేంద్రవరంను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి కొండవీటికి చెందిన పెద కోమటి వేమునితో, అతని స్నేహితుడగు అన్న దేవ చోడునితో, బహుమనీ ఫిరోద్ షా తోనూ యుద్ధము చేసారు.

దేవ రాయని మిత్రుడైన కాటయ వేముడు, పెద కోమటి వేముడుతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు రాజమహేంద్రవరం అధిపతిగా కాటయవేముని కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన రెండవ కుమార గిరిని కూర్చొనబెట్టి, అల్లాడ రెడ్డి, అతని కుమారులు వేమ\, వీర భద్రా రెడ్డి లుతో కలసి శతృవులైన ఫిరోద్ షా, పెద కోమటి వేమా రెడ్డి సైన్యాన్ని ఓడించి రాజమహేంద్రవరం పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.

ఇటువంటి ఓటమి తరువాత ఫిరోద్ షా పానుగల్లు దుర్గమును ఆక్రమించాడు. కొండవీడు, బహుమనీ ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన పద్మ నాయకులు విజయనగరాధిపతతితో స్నేహం చేసుకొని పానుగల్లు దుర్గమును ఫిరోద్ షా నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్ధము చేసాడు.

ఇటువంటి సమయంలో దేవరాయలు వ్యూహాత్మకంగా బహుమనీ సుల్తానులకు కొండవీడు నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి పొత్తపినాడు, పులుగులనాడు లను ఆక్రమించి మోటుపల్లి రేవు పట్టాణాన్ని ముట్టడించింది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్ధములందూ విజయాలు సాధించి బహుమనీ సుల్తానులనూ, కొండవీడు రాజులనూ ఓడించి నల్గొండ, పానుగల్లు, తీరాంధ్ర మొత్తం విజయనగర సామ్రాజ్యములో విలీనం చేశారు.

ఇతర విశేషములు

మొదటి దేవరాయలు ఈ స్ఫూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ఠ పరిచాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.

కవులు

జక్కన అను కవి విక్రమార్క చరిత్రను ఈ కాలముననే రచించాడు.

మరింత సమాచారం విజయనగర రాజులు ...
మూసివేయి


ఇంతకు ముందు ఉన్నవారు:
రెండవ బుక్క రాయలు
విజయనగర సామ్రాజ్యము
1406 1422
తరువాత వచ్చినవారు:
రామచంద్ర రాయలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.