జక్కన
From Wikipedia, the free encyclopedia
జక్కన ఒక ప్రాచీన తెలుగు కవి.
తల్లిదండ్రులు:అక్కమాంబా అన్నాయామాత్యుల కుమారుడు.
విక్రమార్క చరిత్రను జక్కన రచించాడు. విక్రమార్క చరిత్ర 8 ఆశ్వాసాల ప్రభంధము. ఇందులో 1519 గద్య పద్యాలున్నాయి. ఈ కావ్యము వెన్నెలకంటి సిద్దయ మంత్రికి అంకితం ఇవ్వబడింది. జక్కన శ్రీనాథునికి సమకాలికుడు.
విక్రమార్క చరిత్ర చారిత్రక కావ్యం కాదు. విక్రమార్కుని సాహస కృత్యాలతో, ఔదార్యాలతో కూడిన కథలతో ఈ కావ్యం ఉంటుంది. సంస్కృతంలోని విక్రమార్క చరిత్రకు అనువాదం కాదు. స్వతంత్ర రచన. ఈ కావ్యంలో జక్కన కల్పనా శక్తి, కథానైపుణ్యము, పునరుక్తి లేని వర్ణనా విన్యాసము, రమణీయమైన శయ్యా సౌభాగ్యము కనిపిస్తాయి.
- చక్కన నీ వైదుష్యము,చక్కన నీ కావ్య రచనా చాతుర్యంబుల్
- చక్కన నీ వాగ్వైఖరి చక్కన నీ వంశ మహిమ జక్కన సుకవీ
- స్వాభావిక నవ కవితా, ప్రాభవముల నుభయ భాష ఫ్రౌఢిమ చెప్పన్
- భూభువనంబున సరిలేరా భారతి నీవు దక్క నన్యులు జక్కా
అని కృతి స్వీకర్త తనను పొగిడినట్లు జక్కన చెప్పుకొన్నాడు. ఇది కథాకావ్యమైన ప్రభంధ ధోరణిలో ఉంది. కావ్య ప్రారంభంలోని మధురానగర వర్ణన 44 పద్యాలలో ఉంది. మల్లన రాజశేఖర చరిత్ర కథకు మూలం, జక్కన విక్రమార్క చరిత్రలోని రాజశేఖర కథ అని పల్లా దుర్గయ్య అభిప్రాయము.
ఇవి కూడా చూడండి
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.