Remove ads
From Wikipedia, the free encyclopedia
ఖలీఫా ఖిలాఫత్ (ఖలీఫాల సామ్రాజ్యం) రాజ్యాధినేత, ఈ బిరుదు ఇస్లామీయ సామ్రాజ్యం షరియా చేనడుపబడు ఉమ్మహ్ యొక్క నాయకునికి ఇవ్వబడింది. ఇది అరబ్బీ పదం. خليفة Khalīfah (help·info) అర్థం "వారసుడు" లేదా "ప్రతినిధి". మహమ్మదు ప్రవక్త (570-632) తరువాత రాజకీయవారసులుగా ఖలీఫాలు "ఖలీఫత్ రసూల్ అల్లాహ్"గా పరిగణింపబడ్డారు.
|
ఖలీఫాలకు అమీర్ అల్ మూమినీన్ (أمير المؤمنين) "విశ్వాసుల నాయకుడు", ఇమామ్ అల్-ఉమ్మహ్, ఇమామ్ అల్-మూమినీన్ (إمام المؤمنين), లేదా అతి సాధారణంగా ముస్లింల నాయకుడు అని పిలుస్తారు. మొదటి నలుగురు ఖలీఫాలైన అబూబక్ర్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ల తరువాత, ఈ బిరుదును ఉమయ్యద్ లు, అబ్బాసీయులు, ఉస్మానీయులు స్పెయిన్ ఉత్తర ఆఫ్రికా, ఈజిప్టును పరిపాలించే కాలంలో ఉపయోగించారు. ముఖ్యమైన చారిత్రక ముస్లిం గవర్నర్లైన సుల్తానులు లేదా అమీరులు ఖలీఫాలకు విధేయులుగా వుండేవారు. రాను రాను ఈ ఖలీఫాల ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఈ బిరుదు ఆఖరుగా ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన టర్కీకు వుండినది. కానీ 1924 సం.లో ఆంగ్లేయుల కుతంత్రానికి బలై తుడిచివేయబడింది. చాలామంది ముస్లింలు ఈ ఖలీఫా విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆందోళనలు చేశారు.[1] భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం జరగిన ఖిలాఫత్ ఉద్యమం ఈకోవకుచెందినదే.
ముహమ్మద్ ప్రవక్త జీవితకాలంలో ముస్లిం ప్రపంచాన్నంతటికీ వీరే నాయకుడిగా ఉన్నారు. వీరి తరువాత నలుగురు రాషిదూన్ ఖలీఫాలు ఖలీఫాలయ్యారు. వారు వరుసగా అబూబక్ర్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, అలీ ఇబ్న్ అబీ తాలిబ్. ఈ ఖలీఫాలందరూ ప్రజలచేత ఎన్నుకోబడ్డవారే. సున్నీ ముస్లిం ల ప్రకారం అబూబక్ర్ ముస్లిం సముదాయాలచే ఎన్నుకోబడ్డాడు. ఇదే సరైన ప్రజాతంత్ర తరహా. ఖలీఫా ఎన్నికలచేగానీ సమాజపు ఏకగ్రీవతచే గానీ ఎన్నుకోబడవలెను.
ఖలీఫాల వారసుడిగా ఎన్నుకోబడే వ్యక్తికి ఈ లక్షణాలుండవలెను.
అల్-ఘజాలి "నసీహత్ అల్-ములూక్" లేదా "రాజులకు హితబోధలు" సెల్జూఘ్ ఖలీఫా కొరకు వ్రాశాడు. ఇతని ప్రకారం దశ హితబోధలు రాజుకు తనరాజ్యపరిపాలన కొరకు కనీసం వుండవలసిన సూత్రాలని సూచించాడు.
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్కామ్ | |
| |
పండిత బిరుదులు | |
|
హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు :
"మీలో ఒకరి నాయకత్వాన గల ఐకమత్యాన్ని, ఛిద్రం చేయాలని, మీలో అనైక్యత కల్గించాలని ఎవరైనా భావించి కుట్రపన్నినచో వారిని అంతమొందించండి." [2]
"ఇస్రాయీలుల సంతతి ప్రవక్తలచే పాలించబడింది; ఎపుడైనా ఒక ప్రవక్త మరణించినపుడు ఇంకో ప్రవక్త అవతరింపబడేవారు; కానీ నా తరువాత ఎవ్వరూ ప్రవక్తలు రారు. నా తరువాత ఖలీఫా లు వుంటారు, ఒకేసారి (ప్రపంచంలోని పలు ప్రాంతాలలో) కొందరు ఖలీఫాలు వుంటారు; వారు ప్రశ్నించారు: మేమేమి చేయవలెనని ఆదేశిస్తారు? మహమ్మదు ప్రవక్త జవాబిచ్చారు: వారిని (ఖలీఫాలను) సహకరించండి, వారిలో మొదటివారిని, వారిలో మొదటివారిని, వారికివ్వవలసిన బాకీలను ఇవ్వండి; వారికి (ఖలీఫాలకు) అల్లాహ్, మీకప్పగించబడిన పనులను ఎంతవరకు నెరవేర్చారని ప్రశ్నిస్తాడు."[2]
"ఒక సారి ఇద్దరు ఖలీఫాల మధ్య జగడమొస్తే, తరువాత వాడిని అంతమొందించండి". [2]
అబూబక్ర్ ఈ విధంగా సెలవిచ్చారు: "ఒకేసారి (ఒకే ప్రాంతానికి) రెండు ఖలీఫాలు లేదా అమీర్లు ఉండడం శ్రేయస్కరం కాదు, ఇలా వుంటే పరిపాలనలో అవాంతరాలొస్తాయి, ప్రజల మధ్య అనైక్యత జన్మిస్తుంది, ప్రజలు రెండు సమూహాలుగా విడిపోతారు. సున్నహ్ నీరుగారిపోతుంది, బిద్ అత్ జనియిస్తుంది ఫిత్నా బయలుదేరుతుంది, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం గాదు". [3]
ఉమర్ ఈ విధంగా అన్నాడు: “ఒకే సారి, ఒకే సముదాయానికి రెండు నాయకులు ఉండడం క్షేమకరం కాదు" [3]
ఇబ్నె ఖుల్దూన్ 14వ శతాబ్దపు ముస్లిం పండితుడు, ఆర్థిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఇలా అన్నాడు: "ఖలీఫా పదవికి ఒకేసారి ఇద్దరిని నియమించడం సాధ్యం కాదు. హదీసుల ననుసరించి ధార్మిక పండితులు ఈ విధంగా ఉద్దేశ్యాలేర్పరచారు; సహీ ముస్లిం ప్రకారం ఒకే సముదాయానికి ఒకేసారి ఇద్దరు అమీర్లు వుండడం సమాజానికి అపాయం".[4]
అబూబక్ర్ మరణశయ్యపైనుండగా, తనవారసుడిగా ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ను ప్రకటించాడు, ముస్లిం సముదాయం అతడి కోరికను శిరసా వహించింది. ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ను ఒక ఎన్నికల సభ ఎన్నిక చేసింది, కానీ ఉస్మాన్ ను కొన్ని వ్యతిరేక శక్తులు హత్య చేశాయి. అలీ ఖలీఫాగా ఎన్నుకోబడిననూ, అందరూ అతన్ని ఖలీఫాగా అంగీకరించలేదు. ఇతను చాలా ఇబ్బందుల పాలయ్యారు. 5 సంవత్సరాలు ఖలీఫాగా అనేక కుట్రలను ఎదుర్కొన్నారు, చివరకు అరాచక శక్తులు ఇతడినీ హత్యచేశాయి. ఈ కాలాన్నే ఫిత్నా కాలమని లేదా అంతర్యుద్ధాలు అంటారు.
1258లో మంగోలులు హులగు ఖాన్ ఆధ్వర్యంలో బాగ్దాదును ఆక్రమించినపుడు, అబ్బాసీయులలో మిగిలిన వారు ఈజిప్టులో ఖలీఫాగా ప్రకటించుకొన్నారు. వీరినే నీడ ఖలీఫాలని వ్యవహరిస్తారు.
మార్చి 3, 1924, న "టర్కిష్ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ" యందు ముస్తఫా కమాల్ అతాతుర్క్ ఆధ్వర్యమున "ఖిలాఫత్" (ఖలీఫా) అధికారాలన్నీ 'అసెంబ్లీ' కి బదిలీచేస్తూ "ఖిలాఫత్" విధానము రూపుమాపడమైనది. ఖిలాఫత్ విధానము తిరిగి ప్రవేశపెట్టాలని అనేక ఉద్యమాలు జరిగాయి.[1] భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం ఈ కోవకు చెందిందే.
ముఖ్యమైన సామ్రాజ్యాలు:
ఎందరో ప్రాంతీయ పాలకులు తమకు తాము ఖలీఫాలుగా ప్రకటించుకొన్నారు. చాలా వాటిని ప్రజలంతగా పట్టించుకోలేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.