From Wikipedia, the free encyclopedia
ముస్తఫా కమాల్ అతాతుర్క్ (మే 19 1881 - నవంబర్ 10 1938) ఒక టర్కిష్ సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "టర్కీ జాతిపిత "గా అభివర్ణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మొదటి అధ్యక్షుడు.
ముస్తఫా కమాల్ అతాతుర్క్ | |||
![]() | |||
మొదటి టర్కీ అధ్యక్షుడు | |||
---|---|---|---|
పదవీ కాలం 29 అక్టోబరు 1923 – 10 నవంబర్ 1938 | |||
తరువాత | ఇస్మత్ ఇనోను | ||
మొదటి టర్కీ ప్రధానమంత్రి | |||
పదవీ కాలం 3 మే 1920 – 24 జనవరి 1921 | |||
తరువాత | ఫెయూజి చక్మక్ | ||
మొదటి పార్లమెంటు స్పీకర్లు | |||
పదవీ కాలం 24 ఏప్రిల్ 1920 – 29 అక్టోబరు 1923 | |||
తరువాత | అలీ ఫతెహి ఒక్యార్ | ||
మొదటి ఆర్.పీ.పీ. నాయకుడు | |||
పదవీ కాలం 1919 – 1938 | |||
తరువాత | ఇస్మత్ ఇనోను | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | సెలానిక్ (థెస్సలోనికీ) | 1881 మే 19||
మరణం | 10 నవంబరు 1938 57) దొలంబాచే సౌధం, ఇస్తాంబుల్ | (aged||
జాతీయత | టర్కిష్ | ||
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | లతీఫే ఉసక్లిగిల్ (1923–25) | ||
సంతకం | ![]() | ||
పురస్కారాలు | జాబితా (24 పతకాలు) | ||
ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. గల్లిపోలీ యుద్ధం లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరుగాంచాడు.[1] ఉస్మానియా సామ్రాజ్యం అల్లైస్ సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ టర్కిష్ జాతీయ ఉద్యమం నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. అంకారాను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన దీటైన రాజకీయ సైనిక చాతుర్యాలతో రిపబ్లిక్ ఆఫ్ టర్కీని స్థాపించగలిగాడు.
ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర సెక్యులర్ రాజ్యంగా తీర్చిదిద్దాడు.
Seamless Wikipedia browsing. On steroids.