From Wikipedia, the free encyclopedia
అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3] [4]
అందువలన నిరక్షరాస్యత అనగా చదవడం, వ్రాయడం తెలియకపోవడం అనే అర్ధం.[5][6][7]
కొందరు పరిశోధకుల ప్రకారం, 1950 కు ముందు అక్షరాస్యత అనగా అక్షరాలు పదాల గుర్తింపుగా భావించగా, ఆ తరువాత విస్తృతభావన (చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నైపుణ్యాలు), పద్ధతిగా మార్పు చెందింది(వ్యవహార అక్షరాస్యత(functional literacy).[8] అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3] [4]
యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "అక్షరాస్యత" అనేదానికి, గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కించడం (compute), ముద్రించిన, వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".[10] అని నిర్వచించబడింది.
ఈ క్రింది పట్టిక, భారతదేశం, పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల, యౌవనుల అక్షరాస్యతను సూచిస్తుంది. గణాంకాలు 2001లో తీయబడినవి.[11]
ఈ గణాంకాలు 2001 భారత జనాభా లెక్కలులలో భాగంగా లెక్కించిన గణాంకాలు.క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తుంది.[12]
దేశం | మధ్యవయస్కుల అక్షరాస్యత | యౌవనుల అక్షరాస్యత |
---|---|---|
చైనా | 90.9 | 98.9 |
భారతదేశం | 61.3 | 73.3 |
నేపాల్ | 44.0 | 62.7 |
పాకిస్తాన్ | 41.5 | 53.9 |
శ్రీలంక | 92.1 | 97.0 |
బంగ్లాదేశ్ | 41.1 | 49.7 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.