From Wikipedia, the free encyclopedia
షియా ఇస్లాం (ఆంగ్లం : Shia Islam) (అరబ్బీ شيعة షి‘యాహ్), కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. ఇస్లాం మతములో సున్నీ ఇస్లాం తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. ఇరాన్ దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు.[1], అజర్బైజాన్ [2], బహ్రయిన్[1], ఇరాక్, లెబనాన్[1] కువైట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్[3], భారతదేశంలలో వీరిని మైనారిటీలుగా పరిగణిస్తారు.
|
---|
విశ్వాసాలు & సాంప్రదాయాలు |
అలీ వారసులు |
అభిప్రాయాలు * దృష్టికోణాలు |
పవిత్ర దినాలు |
ఆషూరా · అర్బయీన్ · మౌలీద్ |
చరిత్ర |
అస్నాయె అషరీ · ఇస్మాయిలీ · జైదీ |
అహ్ల్ అల్-కిసా |
నలుగురు సహాబాలు |
సల్మాన్ ఫార్సీ |
షియాహ్ బహువచనం, షియ్ ఏకవచనం,[2] అర్థం అనుయాయుడు, అనుంగుడు, సహచరుడు లేదా విభాగం. ఖురాన్ లోనూ ఈ పదము ఉపయోగించబడినది (షియా ఇస్లాం గురించి కాదు) ఈ పద ఉపయోగ సమయంలో స్ఫురించే భావన "అనుయాయుడు", ఋణాత్మక, ధనాత్మక దృష్టికోణంతోనూ ఈ పదాన్ని వినియోగించబడింది. "షియా" అను పదము, షియా‘తు ‘అలీ (అరబ్బీ : شيعة علي ) నకు సంక్షిప్తరూపం, అర్థం, "అలీ అనుయాయుడు" లేదా "అలీ విభాగానికి చెందినవాడు".[2]
షియా ముస్లింలు, ఏవిధంగా ఐతే అల్లాహ్ తన పవక్తను ఎంచుకుంటాడో అదేవిధంగా, ప్రవక్త తన వారసుడిని తానే స్వయంగా ప్రకటిస్తాడు. వీరి విశ్వాసం ప్రకారం అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ని, అల్లాహ్ స్వయంగా, ముహమ్మద్ వారసుడిగా ఎన్నుకున్నాడు.
ప్రారంభపు షియా సమూహం, జైదీయులు, సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, ఖలీఫా పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన ఖురైషీయుల వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు (అహ్లె బైత్) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది.[4]
ఇస్లాంలో `అక్ల్ అనే పదము ఎక్కువగా, ప్రారంభకాలపు షియా పండితులు ఉపయోగించారు. అరబ్బీ పదజాలమైన హిల్మ్ (అరబ్బీ حلم ) లేదా 'జ్ఞానం' అర్థం "సంపూర్ణ న్యాయం, స్వీయ సహనం , హుందాతనం" లకు ఉపయోగింపబడేది. దీని వ్యతిరేకార్థ పదము జహ్ల్ లేదా 'అజ్ఞానం', మూర్ఖత్వానికి సఫాహ్ అనే పదజాలం ఉపయోగించేవారు.[5]
అక్ల్ కలిగినవాడిని అల్-ఆఖిల్ అనీ (బహువచనం : అల్-ఉక్ఖాల్ ) ఈతడు భగవంతునితో సాన్నిహిత్యం కలిగివుంటాడనీ సిద్ధాంతం. ఇమామ్ జాఫరె సాదిఖ్ ఈవిధంగా సెలవిస్తారు "ఈ అక్ల్, ఓ అవగాహన, అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారి కొరకు కలిగే అవగాహన, అల్లాహ్ సత్యము, ఈ సత్యము గురిచించి తెలిపే 'ఇల్మ్' లేదా దివ్యజ్ఞానము ద్వారా మానవాళికి సేవలందించవచ్చును".
ఈతని కుమారుడు, ఇమామ్ మూసా అల్ కాజిమ్ (d. 799), ఈ సిద్ధాంతాన్ని ఇంకనూ విశాలపరుస్తూ విశ్లేషిస్తూ, ఈ విధంగా సెలవిచ్చారు; "అక్ల్ అనునది, ఓ దివ్యమైన అవగాహన, మనసులోని తేజస్సు, ఈ తేజస్సే అల్లాహ్ యొక్క సంజ్ఞలను పొందగలదు".[5] ఇంకనూ; "ఇమామ్ లందరూ హుజ్జతుల్ జాహిరా బహిరంగంగా కనిపించే అల్లాహ్ సాక్షులు, 'అక్ల్' అనునది హుజ్జతుల్ బాతినా అంతర్గత సాక్షి.[5]
అదేవిధంగా అక్ల్ కు వ్యతిరేకం జహ్ల్ ఓ తమస్సు, ఓ గాఢాందకారం, ఈ గాఢాందకారంలో 'సఫా' లేదా మూర్ఖత్వం ఉద్భవిస్తుంది, ఈ మూర్ఖత్వం జ్ఞానాన్ని హరిస్తుంది, జునూన్ లేదా స్పర్శాలేమి మానవుడిని అల్లాహ్ ను పొందేమార్గం నుండి వేరుచేస్తుంది. 'అక్ల్' అల్లాహ్ ను అవగాహన చేసుకునే ఓ మూల హేతువు.[5]
ఇస్లాంలో ఇస్మాహ్' అనునది, చెడునుండి స్వేచ్ఛ పొందే దివ్యమార్గం.[6] ముస్లింల విశ్వాసాల ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త , ఇతర ఇస్లామీయ ప్రవక్తలు ఈ 'ఇస్మాహ్' దివ్యత్వాన్ని కలిగి వుండేవారు. షియాముస్లిం సమూహములైన "ఇస్నాయె అషరి" ('బారా ఇమామ్'), ఇస్మాయిలీ లు, ఈ ఇస్మాహ్ ఇమామ్లకు, ఫాతిమా జహ్రాలకూ వుండేదని విశ్వసిస్తారు, కానీ జైదీలు మాత్రం ఈ ఇస్మాహ్ ఇమామ్లకు వుండేదికాదని విశ్వసిస్తారు.
షియా ఇస్లాం విశ్వాసాల ప్రకారం, పండ్రెండవ ఇమామ్ అయిన మహది, ఒకానొకప్పుడు అదృశ్యుడయ్యాడు, తరువాత ఏదో ఒక రోజు మరలా సాక్షాత్కరిస్తాడు, ప్రపంచంలో న్యాయాన్ని తిరిగీ స్థాపిస్తాడు. కొన్ని షియా వర్గాలు, ఉదాహరణకు జైదీ, నిజారీ, ఇస్మాయిలీలు దీనిని విశ్వసించరు.
షియా ఇస్లాం సమూహం ఆవిర్భావానికి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు కానవస్తాయి. 1. ముహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత అతని అల్లుడైన అలీని ఖలీఫా చేయాలని మొదటి ఉద్యమం, ఇది మొదటి ఫిత్నా కాలంలో జరిగింది.[7] ఈ సిద్ధాంతం ప్రకారం, రాజకీయ విభాగం (అలీ పార్టీ) బయలు దేరి, అలీని ఖలీఫాగా ఎన్నిక చేయాలని వీరి వారసులనే ఖలీఫాలుగా ఎన్నుకోవాలని ఉద్యమించింది. 2. క్రమేపీ ఇదే ఉద్యమం ధార్మిక విభాగంగాను ధార్మిక ఉద్యమంగానూ మారినది.[4]
దేశం | మొత్తం జనాభా | షియా జనాభా | షియా జనాభా శాతము |
---|---|---|---|
ఇరాన్ | 68,700,000 | 61,800,000 | 90 |
పాకిస్తాన్ | 165,800,800 | 33,200,000 | 20 |
ఇరాక్ | 26,000,000 | 17,400,000 | 65 |
భారతదేశం | 1,009,000,000 | 11,000,000 | 1 |
అజర్బైజాన్ | 9,000,000 | 7,650,000 | 85 |
ఆప్ఘనిస్తాన్ | 31,000,000 | 5,900,000 | 19 |
సౌదీ అరేబియా | 27,000,000 | 4,000,000 | 15 |
లెబనాన్ | 3,900,000 | 1,700,000 | 45 |
కువైట్ | 2,400,000 | 730,000 | 30 |
బహ్రయిన్ | 700,000 | 520,000 | 75 |
సిరియా | 18,900,000 | 190,000 | 1 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 2,600,000 | 160,000 | 6 |
కతర్ | 890,000 | 140,000 | 16 |
ఒమన్ | 3,100,000 | 31,000 | 1 |
Source: మధ్యప్రాచ్యం, పశ్చిమదేశాలు, , ప్రభుత్వ-ప్రభుత్వేర సంస్థల మూలాలద్వారా తీయబడిన జనగణన. Archived 2009-06-27 at the Wayback Machine |
షియా ముస్లింల పవిత్ర నగరాలు:
షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్ల గురించి విభేదాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయింది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ అస్నాయె అషరి, పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు, జైదీయులు.
బారా ఇమామ్ లు (పండ్రెండు ఇమామ్ లు) (అరబ్బీ اثنا عشرية ఇస్నా అషరియా) షియా ఇస్లాంలోని ఒక పెద్ద సమూహం (డినామినేషన్). ఒక సంపూర్ణ షియా ముస్లిం తనకు తాను ఈ సమూహపు అవలంబీకుడిగా ప్రకటించుకుంటాడు. ఈ బారా ఇమామ్ లు, ధార్మిక పరంగా, పరిశుద్ధిలైన, సరైన మార్గదర్శకత్వాన్నిచ్చే ఇమామ్ (ప్రతినిధు)లు.
ముహమ్మద్ ప్రవక్త వంశస్థులే (అహ్లె బైత్) ఈ బారా ఇమామ్ లు, వీరినే షియా ముస్లింలు, ముహమ్మద్ ప్రవక్త తరువాత, తమ ఆత్మపరమైన ప్రతినిథులుగా పరిగణిస్తారు.[4]
బారా ఇమాం షియా సమూహాల ప్రకారం షియా ఇస్లాంలోని ఐదు ప్రధాన విశ్వాసాలు:
అస్నా అషరి (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు (ఇస్లాం ఐదు మూల స్తంభాలు) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది జిహాద్, సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది న్యాయ పోరాటం (అరబ్బీ : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది చెడును వ్యతిరేకించడం (అరబ్బీ النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది, ప్రోత్సహిస్తుంది.[12][13] బారా ఇమామ్ లను అవలంబించేవారి ఐదు సూత్రాలు అఖీదాహ్ అని పిలువబడుతుంది.[14]
జాఫరీ చట్టాలు లేదా జాఫరీ ఫిఖహ్, బారాఇమామ్ షియాముస్లింల చట్టాలు, వీటిని 6వ షియాఇమామ్ అయిన ఇమామ్ జాఫర్ అల్ సాదిఖ్ రూపొందించారు.
ముహమ్మద్ ప్రవక్త షరియాను సున్నహ్ను షియాలు కేవలం నోటివాక్కులుగా పరిగణిస్తారు. ముహమ్మద్ అల్లుడు అలీ, కుమార్తె ఫాతిమా (అలీ భార్య) వీరూ పండితులే, వీరిద్వారా ప్రజలవద్దకు చేరిన జీవన విధానాలనే తమ జీవనమార్గాలుగా షియాలు ఎన్నుకున్నారు. జాఫరీ చట్టాలలో మూడు పాఠశాలలు గలవు, అవి : ఉసూలి (సిద్ధాంతాలు), అఖ్బారీ,, షేఖి. ఉసూలీ పాఠశాల అన్నిటికన్నా పెద్దది. ఈ పాఠశాలను పాటించని బారాఇమామ్ షియాముస్లిం సమూహాలు అలావీ, అలేవీ, బెక్తాషీ,, అహలె హక్.
ఇస్మాయీలీ : (అరబ్బీ : الإسماعيليون అల్ ఇస్మాయిలియ్యూన్; ఉర్దూ: إسماعیلی ఇస్మాయీలి, పర్షియన్ :إسماعیلیان ఇస్మాయీలియాన్) ఇస్లాం లోని ఒక శాఖ, షియా ఇస్లాంలోని అస్నా అషరీ తరువాత అతి పెద్ద శాఖ. ఇస్మాయీలీలకు ఆ పేరు ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్ ఆధ్యాత్మిక గురువుగా, (ఇమామ్) జాఫర్ సాదిఖ్ ద్వారా వారసత్వ పరంపరను పొందిన వారిగా, ఇతని పేరున వచ్చింది.
జైదీలకు ఆ పేరు షియా ఇమామ్ ఐన జైద్ ఇబ్న్ అలీ పేరున వచ్చింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.