From Wikipedia, the free encyclopedia
రాషిదూన్ ఖలీఫాలు (అరబ్బీ الخلفاء الراشدون) సున్నీ ఇస్లాం ప్రకారం మొదటి నాలుగు 'రాషిదూన్ ఖిలాఫత్' ను స్థాపించిన ఖలీఫాలు. ఇబ్న్ మాజా, అబూ దావూద్ హదీసుల ప్రకారం ముహమ్మద్ ప్రవక్త వారు సెలవిచ్చిన 'సవ్యమార్గంలో నడపబడిన ఖలీఫా'లు.[1]
ముహమ్మద్ ప్రవక్త తరువాత అయిన నలుగురు ఖలీఫాలనే రాషిదూన్ ఖలీఫాలు అంటారు.
రాషిదూన్ ఖలీఫాలు ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఖలీఫాలు. వారు :
ముస్లిం పండితుడు తఫ్తజానీ ప్రకారం, హసన్ ఇబ్న్ అలీ 661 లో ఇరాక్ అధిపతిగా నియమింపబడ్డారు, వీరూ,, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ఉమర్ II) కూడా గూడా రాషిదూన్ ఖలీఫాయే. ఇబాధీ ఆచారానుసారం ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన సులేమాన్ సుల్తాన్, అబ్దుల్ హమీద్ I రాషిదూన్ ఖలీఫాలే.
అలీ కాలంలో, ఫిత్నా (ఖలీఫాల పట్ల విద్రోహం) బయలుదేరింది.
రాషిదూన్ ఖలీఫాల కాలంలో మధ్య ప్రాచ్యం, ఓ శక్తివంతమైన రాజ్యంగా రూపొందింది.
అబూబక్ర్ తన ఖలీఫా పదవీకాలంలో, బైతుల్ మాల్ లేదా 'రాజ్య-ఖజానా' ను స్థాపించారు. ఉమర్ తన కాలంలో ఈ ఖజానాను, రాజ్య విత్త విధానాన్ని స్థిరీకరిస్తూ విస్తరించారు.[2]
వశమైన రాజ్యాలన్నింటిలోనూ, జాతీయ రాజకీయ విధానాలను అనుసరిస్తూ, అన్ని రాజ్యాలలో రోడ్లు, వంతెనలు నిర్మించే బాధ్యతలను ఖలీఫాలు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.[3]
ప్రజాశ్రేయస్సు కొరకు ఈ ఖలీఫాలు ప్రథమ కర్తవ్యంగా, అరేబియా ఎడారి ప్రాంతాలలో అత్యవసర వస్తువు 'నీరు' కొరకు, వాటి వనరులైన ఒయాసిస్సుల లోని బావుల నిర్మాణం,, వాటి కొనకం. ఆ కాలంలో బావులు కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులుగా వుండేవి. వాటిని ఆయా యజమానుల వద్దనుండి కొని, ప్రజలకొరకు ఉచిత సౌకర్యాలను కలుగ జేసేవారు. అంతేగాక ఈ బావులను మరమ్మత్తులు చేసి, ఉపయోగానికి వీలుగా మలచేవారు.[4]
ఈ బావులనే కాక, కాలువలనూ నిర్మించారు, కాలువలను యజమానులనుండి కొని ప్రజాపయోగంకొరకు ఉంచారు. ఇలాంటి కాలువలకు ఉదాహరణలు, సాద్ కాలువ (అంబర్ ప్రాంతానికి నీరందించేది), అబీ మూసా కాలువ, బస్రాకు నీరందించేది.[5]
కరువు కాటకాలలో ఉమర్ ఆదేశాన ఈజిప్టులో ఒక కాలువ నిర్మింపబడినది, ఈ కాలువ నైలు నది, సముద్రానికి మధ్య నిర్మింపబడింది. దీని ముఖ్యోద్దేశ్యం రవాణా, సముద్రపు మార్గం.[6]
ముహమ్మద్ ప్రవక్త మరణం తరువాత, వరదలు మక్కా నగరానికి తాకాయి, ఉమర్ ఆదేశాన కాబాను రక్షించుటకు, రెండు డ్యామ్లు నిర్మించారు. మదీనా వద్ద కూడా ఒక డ్యామ్ ను వరదలనుండి రక్షణ కొరకు నిర్మించారు.[3]
బస్రా ప్రాంతం, జనసమ్మర్థంతో కూడినది. ఉమర్ పరిపాలనా కాలములో, ఇక్కడ ఒక సైనిక శిబిరాన్ని నిర్మించారు. తరువాత ఈ ప్రదేశాన్ని ఓ మస్జిద్గా మార్చారు.
మదయాన్ విజయాల తరువాత, ముస్లింలు స్థిరనివాసాలేర్పరచుకున్నారు. ఉమర్ ఆదేశాన కూఫా (నేటి ఇరాక్) లో 40,000 మందిని నివాసం ఏర్పరచుకున్నారు. క్రొత్త పట్టణాలు నగరాలన్నీ మట్టి, ఇటుక కట్టడాలతో నిండాయి. ఈజిప్టు పై విజయాల తరువాత అనేక ప్రాంతాలలో,, అలెగ్జాండ్రియాలో నివాసాలు అధికమయ్యాయి. ముందు ముందు గుడిసెలు పాకలు నిర్మంచారు, తరువాత భవనాలు వెలసాయి.[7]
ఉమర్ ఆదేశాన మోసుల్ ప్రాంతంలో ఓ కోటను నిర్మించారు. కొన్ని చర్చిలు, మస్జిద్ లు,, యూద ప్రార్థనా మందిరాలైన సినగాగ్లు నిర్మించారు.[8]
ఖలీఫా పదవి చేపట్టిన తేదీ క్రొత్త సంవత్సరాది కానక్కర లేదని గమనించవలెను.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.