కవిత్వము రాసేవాడు కవి. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.
కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...
జంట కవులు
ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.
- తిరుపతి వేంకట కవులు - దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
- శేషాద్రి రమణ కవులు సోదరులైన జంట కవులు, చరిత్ర పరిశోధకులు. [[దూపాటి శేషాచార్యులు]], [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
- పింగళి కాటూరి కవులు: పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు లను పింగళి కాటూరి కవులని అంటారు.
- కొప్పరపు సోదర కవులు: కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వేంకటరమణ కవి
- కుమార సోదర కవులు: వీరు కొప్పరపు సోదర కవుల సంతానము. సీతారామప్రసాదరావు ( కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి కుమారుడు), మల్లికార్జునరావు ( కొప్పరపు వేంకటరమణ కవి కుమారుడు)
- గురువిశ్వనాథకవులు: మిన్నికంటి గురునాథశర్మ, పోతరాజు విశ్వనాథ కవి
- దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
- వేంకట రామకృష్ణ కవులు: ఓలేటి వేంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణశాస్త్రి
- వేంకట పార్వతీశకవులు : బాలాంత్రపు వేంకటరావు, ఓలేటి పార్వతీశం
- రాజశేఖర వేంకటశేషకవులు : దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారం వేంకట శేషశాస్త్రి
- రామ నారాయణ కవులు:
- సత్యదుర్గేశ్వర కవులు: ద్వివేది సత్యకవి
- సుబ్రహ్మణ్య రమణ కవులు:
- వేంకటేశ్వర వేంకటరమణ కవులు: పెరుమాళ్ళ వేంకటేశ్వరగుప్త, వనమా వేంకటరమణగుప్త
- దుగ్గిరాల కవులు:
- గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు: గౌరావఝల రామకృష్ణశాస్త్రి, గౌరావఝల సీతారామశాస్త్రి
- కడిమెళ్ళ - కోట కవులు: కడిమెళ్ళ వరప్రసాద్, కోట వెంకట లక్ష్మీనరసింహం
- వేంకట కాళిదాస కవులు: వజ్ఝల వేంకటేశ్వర్లు, వజ్ఝల కాళిదాసు
- సత్యాంజనేయ కవులు: విశ్వనాథ సత్యనారాయణ, కొడాలి ఆంజనేయులు
కవిత్రయం
సంస్కృతంలో వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు మహా కవులు . వీరిని కవిత్రయం అని అంటారు.
రామాయణ కవులు
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు.
10వ శతాబ్ధ కవులు
శివ కవులు
శివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్దిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది.
ప్రబంధ కవులు
16 వ శతాబ్దిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు అల్లసాని పెద్దన.
- అల్లసాని పెద్దన
- నంది తిమ్మన
- ధూర్జటి
- తెనాలి రామకృష్ణుడు
- రామరాజ భూషణుడు
- పింగళి సూరన
- శ్రీకృష్ణదేవరాయలు
- చేమకూరి వెంకట కవి
పద కవులు
శతక కవులు
వంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక మకుటం రాసే రచన శతకం. శతకాలు రాసిన కవులు .
జాతీయోద్యమ కవులు
భావ కవులు
అభ్యుదయ కవులు
దిగంబర కవులు
అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసింది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ
తిరుగబడు కవులు
విప్లవ కవులు
నయాగరా కవులు
చేతనావర్త కవులు
- కోవెల సుప్రసన్నాచార్య
- కోవెల సంపత్కుమారాచార్య
- పేర్వారం జగన్నాథం
- నరసింహారెడ్డి
అనుభూతి కవులు
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
- ఇస్మాయిల్
- మాదిరాజు రంగారావు
- వేగుంట మోహన ప్రసాద్
- కృష్ణం రాజు దేశగాని
- కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ
- వాడ్రేవు చినవీరభద్రుడు
- వజీర్ రెహమాన్
- రేవతీదేవి
- వై. శ్రీరాములు
- అశోకచక్రవర్తి తోలానా
స్త్రీవాద కవయిత్రులు
- ఓల్గా
- సావిత్రి
- మొక్కపాటి సుమతి
- మందరపు హైమవతి
- తుర్లపాటి రాజేశ్వరి
- ఎస్. రజియా బేగం
- శ్రీమతి
- విమల
- కొండేపూడి నిర్మల
- పాటిబండ్ల రజని
- బి. పద్మావతి
- జయప్రభ
- మానసీ ప్రధాన్
దళితవాద కవులు
- గుర్రం జాషువా
- బోయి భీమన్న
- కుసుమ ధర్మన్న
- కొలకలూరి ఇనాక్
- మాస్టార్జీ
- గరిమెళ్ల సత్యనారాయణ
- సాంబశివరావు
- వెలమల సిమ్మన్న
- కొండపల్లి సుదర్శనరాజు
- జయధీర్ తిరుమలరావు
- త్రిపురనేని శ్రీనివాస్
- బి.ఎస్.రాములు
- పైడి తెరేష్ బాబు
- మద్దూరి నగేష్‌బాబు
- సతీష్‌చందర్
- జూలూరి గౌరీశంకర్
- నాగప్పగారి సుందరరాజు
- కత్తి పద్మారావు
- ఎండ్లూరి సుధాకర్
- చెరుకు సుధాకర్
- పగడాల నాగేందర్
- శిఖామణి
- సలంద్ర
- గుంటూరు ఏసుపాదం
- ఆకారపు పాండురంగ ప్రజాసింగం
ముస్లిం మైనార్టీవాద కవులు
- ఖాదర్ మొహియుద్దీన్
- ఖాజా
- షాజహానా
- ఇక్బాల్ చంద్
- జావెద్
- దిలావర్
- సయ్యద్ గఫార్
- అఫ్సర్
- ఎస్.ఏ.అజీద్
- ఆజం
- షేక్ మహ్మద్‌రఫి
- సికిందర్
- షోయబుల్లా ఖాన్
ఇవి కూడ చూడండి
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.