కవి From Wikipedia, the free encyclopedia
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు (12569 BCE). వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయాశ్వాసము నండి గ్రహించబడింది.
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి "నీ వర్ణాశ్రమధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు" అని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణి సువర్ణమయమైన దివ్యవిమానాన్నీ, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్ధమైన వేణుయష్టినీ ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది.
వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా "శుక్తిమతి" అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న "కోలహలుడు" అనే పర్వతము "శుక్తిమతి" మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి, కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె "వసుపదుడు" అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు.
ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది.
పూర్వం బ్రహ్మ శాపం వలన "అద్రిక" అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. పదినెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజు నకు ఇస్తారు. అద్రిక అనే పేరుకల ఆ చేపరూపంలో ఉన్న అప్సర; మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది.
ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది.
ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.
అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.