Remove ads
ప్రత్యుత్పత్తి మూలమైన శృంగార సృష్టి కార్యం From Wikipedia, the free encyclopedia
సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ గర్భం ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా పిల్లలు కలిగి వారి కుటుంబం, వంశం వృద్ధి చెందుతుంది. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. భార్యా భర్తలు మొట్టమొదటిసారిగా సంభోగంలో పాల్గొన్న రాత్రిని శోభన రాత్రి అని అంటారు.
మితంగా, జరిపే శృంగారం వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.[1] మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం,[2][3] రోగనిరోధకశక్తిని పెంచడం,[4] ప్రొస్ట్రేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం[5][6][7] లాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధ్రువీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాకపోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత, భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.[8][9][10].
రతి క్రీడ ద్వారా సంక్రమించే వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. విచ్చలవిడిగా శృంగారకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల్లో, అపరిచితులతో కామకలాపం సాగించే వారికి, వేశ్యల దరిచేరే విటులకు, సెగవ్యాధి (గొనోరియా), సర్పి, సిఫిలిస్, మానవ పాపిల్లోమా వైరస్, ఎయిడ్స్ మొదలైన సుఖవ్యాధులు సంక్రమిస్తాయి.
సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను, అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.
సర్వ సాధారణ, అత్యంత తేలికగా సాధించగలిగే పద్ధతిలో, పురుషుడు స్త్రీని పూర్తిగా ఆక్రమించి, ఆమె పై పడుకుని తొడలను పూర్తిగా వేరు చేసి, ఆమె యోనిలోనికి లింగాన్ని పూర్తిగా చొప్పించి, పైకి కిందికి ఊగుతూ రతిక్రీడ జరుపుతాడు.
ఈ పద్ధతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన యోనిలోనికి పురుషాంగాన్ని చొప్పించుకొని, కిందికి పైకి ఊగుతూ జంటగా సంభోగిస్తారు. స్త్రీ, ఆమె యోనిలోకి పురుషాంగాన్ని చొప్పించి ఊగుతుండగా, పురుషుడు ఆమె నడుము లేదా పిర్రలను రెండు చేతులతో పట్టుకుని సహాయముగా ఆమె యోనిలోకి పురుషాంగాన్ని పెడుతూ తీస్తూ సంభోగిస్తాడు. అప్పుడప్పుడు పురుషుడు, స్త్రీ ఊగుతూ సంభోగిస్తుండగా ఆమె వక్షోజాలను చేతితో నొక్కడం, నోటితో చీకడం, పిర్రలను నొక్కడం వంటివి చేస్తూ స్త్రీని ఉత్తేజపరుస్తాడు
వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిర్రలు వెడల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది. ఇంకో విధానంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించుకుంటుంది. లేదా చేతులను ఏదో ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ (doggy position) అని వ్యవహరిస్తారు.
పురుషుని ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే సంభోగ భంగిమ. పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.
పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి గరిటె లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.
స్త్రీ పురుషులిరువురూ పరస్పర వ్యతిరేక దిశలో ఒకరి ఒకరు పరుండి సాగించే సంభోగం. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది. స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన నాలుకతో రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక యోనిలోనికి చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు.
మేజా భంగిమ: ఎత్తైన మేజా మీద పంగచాపి కూర్చున్న ఆమె లోనికి నించుని పురుషాంగాన్ని యోనిలోనికి చొప్పించి సంభోగించడం.
ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమోసెక్సువల్స్) అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక సంభోగం సలపడం. మనస్తత్వశాస్త్రం ప్రకారం స్వలింగ సంపర్కం అనేది ఒక మానసిక రోగము. వైద్యులు స్వలింగ సంపర్కాన్ని జన్యుపరమైన లోపముగా చెబుతారు. ఇది కొన్ని దేశాలలో చట్టబద్దంగా పరిగణిస్తారు. భారతదేశంలో ఇదొక సాంఘిక అనైతిక చర్యగా ఇది వరకు భావించినా ఇప్పుడు చట్టబద్దం కావించబడింది. అయితే స్వలింగ సంపర్కుల మధ్య వివాహ సంబంధానికి గుర్తింపు, ఆమోదం లభించదు.
ఒక వ్యక్తి రతి విషయంలో ఆకర్షింపబడే రీతినిబట్టి వారి రతిప్రవృతి నిర్దారణౌతుంది. వారు ఎన్నుకునే లైంగిక భాగస్వాములను బట్టి వివిధ రతి ప్రవృత్తులను మనం గమనించవచ్చు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.