క్షేమీశ్వర

తెలుగు కవులు From Wikipedia, the free encyclopedia

Remove ads

క్షేమీశ్వరుడు 10వ శతాబ్దానికి చెందిన కవి. అతను మహీపాలుడు పాల రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో ఉండేవాడు. విక్రమశకము 6వ శకమునకు పైవాడే అని కొందరి చరిత్రకారుల అభిప్రాయము. ఇతనినే ఆర్యక్షేమీశ్వరకవి అని మరికొందరు తెలిపెదరు.ఇతను వ్రాసిన చండకౌశికము అనే నాటక గ్రంధము బాగా ప్రాచుర్యములోనికి వచ్చినది. ఇది సంస్కృతములో రచించబడినది. ఇతనిదే మరియొక గ్రంధము నైషధాననందము. ఇది ఒక సప్తాంక రూపకము. ఇది నేడు అలభ్యము.

త్వరిత వాస్తవాలు క్షేమీశ్వర, జననం ...
Remove ads

చండకౌశికము

ఆర్యక్షేమీశ్వరకవి రస సమంచిత రూపకము ఈ చండకౌశికము. ఇందులో ఐదు అంకములు కలవు.సుప్రసిద్ధ హరిశ్చంద్ర చక్రవర్తి యొక్క సత్య పాలనా వృత్తాంతమే ఇందులో ఇతివృత్తము ఈ నాటకమున సంతరించబడినది.ఇందులో ఉపయోగించబడిన ప్రాకృతములు రెండు-శౌరసేనీ, మాగధి. ఇందులో రచన సరళము. దీర్ఘసమాసములు మృగ్యము. కధాకధనములోను సంభాషణలను మలచిన తీరులోను నాటకీయతను నిల్పి దృశ్యప్రబంధముగా తీర్చి దిద్దెను. మహాకవి భాస రూపకములవలె ఇందులో ప్రస్తావన సంక్షిప్తము. ప్రసిద్ధములగు అభిజ్ఞాన శకుంతల, మృఛ్చకటిక, ముద్రారాక్షస, ప్రతిమా దశరధం లో వలె ఇందులో అంకములకు పేర్లు ఉండవు. అంకములకు పేర్లు పెట్టుట ఆర్వాచీన సంప్రదాయము. ఇందులో అంతరార్ధక పాత్రలు (Allegory Characters) రంగమున సాక్షాత్కరించుట కలదు. ఈయన సంభాషణలు అయ్చిత్యవంతములై సహృదయుల హృదయములను స్పందింపజేయును.

Remove ads

మూలములు

  1. Candakausika by Dr.Sivani Dasgupta Calcutta-1962.
  2. Bibliography of Sanskrit Drama- Montgomery Sohuyler New Yok 1906 Reprint Delhi 1977.
  3. Historical Grammar of Inscriptional Prakrits Dr.Madhukara Mahendale Pune 1948.
  4. 1980 భారతి మాసపత్రిక- వ్యాసము:చండకౌశికమ్- వ్యాసకర్త: శ్రీ ఇప్పగుంట సాయిబాబా.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads