Remove ads
భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
హర్యానా, భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇది భాషా ప్రాతిపదికన 1966 నవంబరు 1న పూర్వపు తూర్పు పంజాబ్ రాష్ట్రం నుండి వేరు చేయబడింది. ఇది భారతదేశ భూభాగంలో 1.4% (44,212 కిమీ2 లేదా 17,070 చదరపు మైళ్ళు) కంటే తక్కువ విస్తీర్ణంతో 21వ స్థానంలో ఉంది.[1] [5]రాష్ట్ర రాజధాని చండీగఢ్, ఇది పొరుగు రాష్ట్రం పంజాబ్‌తో సరిహద్దు పంచుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన నగరం ఫరీదాబాద్, ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగమైంది. గురుగ్రామ్ నగరం భారతదేశ అతిపెద్ద ఆర్థిక, సాంకేతిక కేంద్రాలలో ఒకటి. [6] హర్యానాలో 6 పరిపాలనా విభాగాలు, 22 జిల్లాలు, 72 ఉప-విభాగాలు, 93 రెవెన్యూ తహసీల్లు, 50 ఉప-తహసీల్లు, 140 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లు, 154 నగరాలు, పట్టణాలు, 7,356 గ్రామాలు, 6,222 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[7][8] హర్యానాలో 32 ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌ల ) ఉన్నాయి, ఇవి ప్రధానంగా జాతీయ రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులలో ఉన్నాయి. [9][10] గుర్గావ్ భారతదేశంలోని ప్రధాన సమాచార సాంకేతికత, ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.[11][12] హర్యానా మానవ అభివృద్ధి సూచికలో భారతీయ రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది.
Haryana | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
From top, left to right: Cyber City in Gurgaon, Pinjore Gardens, bronze chariot of Krishna and Arjuna at Kurukshetra, Asigarh Fort, Ghaggar river, Lake in Surajkund. | ||||||||
Etymology: Abode of God or Green Forest | ||||||||
Nickname: "Denmark of India" | ||||||||
Motto(s): Satyameva Jayate (Truth alone triumphs) | ||||||||
Coordinates: 30°44′N 76°47′E | ||||||||
Country | India | |||||||
Region | North India | |||||||
Before was | Punjab | |||||||
Formation (as a state) | 1 November 1966 | |||||||
Capital | Chandigarh | |||||||
Largest City | Faridabad | |||||||
Districts | 22 (6 divisions) | |||||||
Government | ||||||||
• Body | Government of Haryana | |||||||
• Governor | Bandaru Dattatreya | |||||||
• Chief Minister | Manohar Lal Khattar (BJP) | |||||||
State Legislature | Unicameral | |||||||
• Assembly | Haryana Legislative Assembly (90 seats) | |||||||
National Parliament | Parliament of India | |||||||
• Rajya Sabha | 5 seats | |||||||
• Lok Sabha | 10 seats | |||||||
High Court | Punjab and Haryana High Court | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 44,212 కి.మీ2 (17,070 చ. మై) | |||||||
• Rank | 21st | |||||||
Elevation | 200 మీ (700 అ.) | |||||||
Highest elevation (Karoh Peak) | 1,499 మీ (4,918 అ.) | |||||||
Lowest elevation | 169 మీ (554 అ.) | |||||||
జనాభా (2011) | ||||||||
• Total | 2,53,51,462 | |||||||
• Rank | 18th | |||||||
• జనసాంద్రత | 573/కి.మీ2 (1,480/చ. మై.) | |||||||
• Urban | 34.88% | |||||||
• Rural | 65.12% | |||||||
Demonym | Haryanvi | |||||||
Language | ||||||||
• Official | Hindi | |||||||
• Additional Official | English and Punjabi | |||||||
• Official Script | Devanagari script, Gurmukhi script | |||||||
GDP | ||||||||
• Total (2020–21) | ₹7.65 trillion (US$96 billion) | |||||||
• Rank | 13th | |||||||
• Per capita | ₹2,39,535 (US$3,000) (6th) | |||||||
Time zone | UTC+05:30 (IST) | |||||||
ISO 3166 code | IN-HR | |||||||
Vehicle registration | HR | |||||||
HDI (2019) | 0.708 High[3] (12th) | |||||||
Literacy (2011) | 83.78% (21th) | |||||||
Sex ratio (2021) | 926♀/1000 ♂[4] (29th) | |||||||
Symbols of Haryana | ||||||||
Language | Hindi | |||||||
Foundation day | Haryana Day | |||||||
Bird | Black francolin | |||||||
Flower | Lotus | |||||||
Mammal | Blackbuck | |||||||
Tree | Bodhi tree | |||||||
State Highway Mark | ||||||||
State Highway of Haryana HR SH1 – HR SH33 | ||||||||
List of State Symbols | ||||||||
^† Joint Capital with Punjab †† Common for Punjab, Haryana and Chandigarh. |
రాష్ట్ర చరిత్ర, స్మారక చిహ్నాలు, వారసత్వం, వృక్షజాలం, జంతుజాలం, పర్యాటకం, బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో సమృద్ధిగా ఉంది. దీనికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి, అయితే యమునా నది ఉత్తర ప్రదేశ్‌తో దాని తూర్పు సరిహద్దును ఏర్పరుస్తుంది. హర్యానా దేశ రాజధాని ఢిల్లీ భూభాగాన్ని మూడు వైపులా (ఉత్తరం, పశ్చిమం, దక్షిణం) చుట్టుముట్టింది, తత్ఫలితంగా, ప్రణాళిక, అభివృద్ధి ప్రయోజనాల కోసం హర్యానా రాష్ట్ర పెద్ద ప్రాంతం ఆర్థికంగా ముఖ్యమైన భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో చేర్చబడింది.
మహాభారతానంతర కాలంలో, [13] వ్యవసాయ కళలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకున్న అభిరాలు ఇక్కడ నివసించినందున హర్యానాను ఈ పేరుతో పిలుస్తారని శాస్త్రవేత్తలు అభిప్రాయం. [14] ప్రాణ్ నాథ్ చోప్రా అభిప్రాయం ప్రకారం, హర్యానాకు అభిరాయణ-అహిరాయణ-హిరాయణ-హర్యానా అనే పేరు వచ్చిందని తెలుస్తుంది .[15]
హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశాల మధ్య, 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశాల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రం నాలుగు విభాగాలుగా విభజించారు. అవి అంబాలా, రోతక్, గుర్గావ్, హిస్సార్. రాష్ట్రంలో 1,553 చ.కి. విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. హర్యాణా నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.
ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది.[16]
ఇది ఈ ప్రాంతం మధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని (కాంస్య, విలువైన లోహాలు రెండింటిలోనూ) ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది. హర్యానాను సుల్తానేట్లు, మొఘలులు వంటి అనేక రాజవంశాలు పాలించాయి. ఇది ఆఫ్ఘన్లు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగం హర్యానా అయింది. పంజాబీ మాట్లాడే భాగం పంజాబ్ రాష్ట్రం అయింది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్కేంద్ర పాలిత ప్రాంతముగా ఏర్పడి రెండు రాష్ట్రాలకు రాజధానిగా వ్యవహరింపబడుతుంది.
4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా వైదిక, హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితం ఇక్కడే శ్రీ కృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయాన గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధం జరిగింది. మహాభారతములో (సా.శ..పూ.900) హర్యాణా బహుధాన్యక (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. హరియానా అన్న పదం మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తుంది. ఈ శాసనములో ఈ ప్రాంతం భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగిన ప్రాంతం అని చాటుతుంది.
నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ, సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి, హరప్పా పూర్వ సంస్కృతుల ఆధారాలు లభించాయి. కురుక్షేత్ర, పెహోవా, తిల్పట్, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారాలు సమకూర్చాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్పట్), పానప్రస్థ (పానిపట్), సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.
వ.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా (2011) | విస్తీర్ణం (కి.మీ.²) | జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | AM | అంబాలా | అంబాలా | 11,36,784 | 1,569 | 722 |
2 | BH | భివాని | భివాని | 16,29,109 | 5,140 | 341 |
3 | CD | చర్ఖీ దాద్రి | ఛర్ఖి దాద్రి | 5,02,276 | 1370 | 367 |
4 | FR | ఫరీదాబాద్ | ఫరీదాబాద్ | 17,98,954 | 783 | 2,298 |
5 | FT | ఫతేహాబాద్ | ఫతేహాబాద్ | 9,41,522 | 2,538 | 371 |
6 | GU | గుర్గావ్ | గుర్గావ్ | 15,14,085 | 1,258 | 1,241 |
7 | HI | హిసార్ | హిస్సార్ | 17,42,815 | 3,788 | 438 |
8 | JH | ఝజ్జర్ | ఝజ్జర్ | 9,56,907 | 1,868 | 522 |
9 | JI | జింద్ | జింద్ | 13,32,042 | 2,702 | 493 |
10 | KT | కైతల్ | కైతల్ | 10,72,861 | 2,799 | 467 |
11 | KR | కర్నాల్ | కర్నాల్ | 15,06,323 | 2,471 | 598 |
12 | KU | కురుక్షేత్ర | కురుక్షేత్ర | 9,64,231 | 1,530 | 630 |
13 | MA | మహేంద్రగఢ్ | నార్నౌల్ | 9,21,680 | 1,900 | 485 |
14 | MW | నూహ్ | నూహ్ | 10,89,406 | 1,765 | 729 |
15 | PW | పల్వల్ | పల్వల్ | 10,40,493 | 1,367 | 761 |
16 | PK | పంచ్‌కులా | పంచ్‌కులా | 5,58,890 | 816 | 622 |
17 | PP | పానిపట్ | పానిపట్ | 12,02,811 | 1,250 | 949 |
18 | RE | రేవారీ | రేవారీ | 8,96,129 | 1,559 | 562 |
19 | RO | రోహ్తక్ | రోహ్తక్ | 10,58,683 | 1,668 | 607 |
20 | SI | సిర్సా | సిర్సా | 12,95,114 | 4,276 | 303 |
21 | SO | సోనీపత్ | సోనీపత్ | 14,80,080 | 2,260 | 697 |
22 | YN | యమునా నగర్ | యమునా నగర్ | 12,14,162 | 1,756 | 687 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.