హిసార్ జిల్లా
హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో హిసార్ జిల్లా ఒకటి. హిసార్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. హిసార్ విభాగంలో ఈ జిల్లా భాగంగా ఉంది. జిల్లా పాలనా బాధ్యతలను కమీషనర్ వహిస్తున్నాడు. జిల్లా పునర్విభజన జరిగేవరకు హర్యానా రాష్ట్రంలో హిసార్ జిల్లా వైశాల్యంలో మొదటి స్థానంలో ఉంది. 1966లో హిసార్ జిల్లా నుండి కొంతభాగం విడదీసి జింద్ జిల్లాను ఏర్పాటు చేసారు. 1974లో జిల్లాలోని భివాని, లోహార్ భాగాలను విడదీసి భివాని జిల్లాను ఏర్పాటు చేసారు. హిసార్ జిల్లాను మళ్ళీ విభజించి సిర్సా జిల్లాను ఏర్పాటు చేసారు. తరువాత ఫతేహాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేసారు.[1]
హిసార్ జిల్లా
हिसार जिला | |
---|---|
![]() హర్యానా పటంలో హిసార్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | హిసార్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,983 కి.మీ2 (1,538 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 15,37,117 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 64.83% |
Website | అధికారిక జాలస్థలి |
హిసార్ డివిషనల్ ప్రధానకార్యాలయం, పోలీస్ రేంజ్ ప్రధానకార్యాలయం హిసార్ నగరంలో ఉంది. బి.ఎస్.ఎఫ్ బెటాలియన్ ప్రధానకార్యాలయం, కమాండో ఫోర్స్ కూడా హిసార్ నగరంలో ఉనాయి. ఈ కార్యలయ నిర్వహణకొరకు నగరంలో 1980లో 5 అనతస్థుల భవనం నిర్మించి ప్రధానకార్యాకయాలు బదిలీ చేయబడ్డాయి.తరువాత సరికొత్త జ్యుడీషనరీ కాన్లెక్స్ నిర్మించబడింది. ఈ జ్యుడీషనరీ కాన్లెక్స్ హర్యానాలో అతిపెద్దదిగా గురించబడుతుంది. హిసార్ జిల్లా ప్రధానకార్యాలయం దేశంలో అతిపెద్దదిగా గుర్తించబడుతుంది.
గత 3 శతాబ్దాలుగా హిసార్ పలు ప్రముఖులకు జన్మనిచ్చింది. సర్దార్ ఇషారీ సింగ్. సరదార్ హర్జీ రాం, రాయ్ బహదూర్, సరదార్ నౌ నిహాల్ సింగ్ (స్వాతంత్ర్యానికి ముందు హిసార్ గౌరవ మెజిస్ట్రేట్) వంటి ప్రముఖులు ఈ జిల్లాలో జన్మించినవారే. హిసార్‌జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గుజారీ మహల్ ఈ జిల్లాలోనే ఉంది. పంజాబు మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ గోపీచంద్ భార్గవ్, జిండల్ ఇండస్ట్రీ గతచైర్‌పర్సన్ ఒ.పి జిండల్, సుభాష్ చంద్ర (జీ నెట్‌వర్క్ చైర్మన్) ఈ జిల్లావాసులే. ఈ యన ఇండియన్ క్రికెట్ లీగ్ చైర్మన్‌గా పనిచేసాడు. హిసార్ నగరం గాల్వనైజ్డ్ ఇనుము ఉత్పత్తిలో దేశంలో ప్రథమస్థానంలో ఉంది. భారతదేశంలోని సింధునాగరికత సంస్కృతికి చెందిన 5 నగరాలలో హిసార్ నగరం ఒకటి.సింధునాగరికత గురించిన పోటీ ప్రశ్నలలో, గొర్రెల మందలు అధింకంగా కలిగి ఉన్న జనరల్ నాలెడ్జ్ పుస్తకంలో ఈ జిల్లాలోని బన్వాలి పట్టణం పేరు చోటు చేసుకుంది. ఈ జిల్లా హర్యానా రాష్ట్రంలో జసంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఫరీదాబాద్ జిల్లా ఉంది.[2]
విభాగాలు
Hisar | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
- ప్రస్తుతం హిసార్ జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: హిసార్, హంసి, నార్నౌడ్, బర్వాలా, ఆదంపూర్.
- ఉప తాలూకాలు : ఉక్లనామండి, బాస్.
- ప్రస్తుతం హిసార్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: ఆదంపూర్, ఉక్లానా, నార్నౌడ్, హంసి, బర్వాలా, నల్వా. ఇవన్నీ హిస్సర్ లోకసభలో భాగంగా ఉన్నాయి.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,742,815,[2] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 276వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 438 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.38%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 871:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 73.2%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో ప్రజలు అత్యధికంగా వాడుకలో ఉన్న భాష హర్యాన్వీ. జిల్లాలో ప్రధానంగా జాట్, బిష్నోయీలు, బ్రాహ్మణ, సైనీలు, బనియా, గుజ్జర్లు, అహిర్లు, రాజపుత్రులు, కుంహర్లు, అరోరాలు, చార్మర్, బాల్మీకీలు ఉన్నారు.[4] వీరిలో జాట్ ప్రజలు అత్యధికం.[4] వీరిలో దేశవాలూలు, బాగ్రీలు అని రెండు తెగలు ఉన్నాయి. బిష్నోయీలు రాజస్థాన్ నుండి వలస వచ్చిన ప్రజలు.[4] జిల్లాలో గౌర్, బియాలు అనే రెండు వర్గాలకు చెందిన బ్రాహ్మణులు ఉన్నారు. అరోరాలలో అధికులు 1947లో దేశ విభజన తరువాత పశ్చిమ పంజాబు నుండి వలస వచ్చిన ప్రజలు.[4] బనియాలు అగర్వాల్, ఓస్వాల్, మహేశ్వరీలుగా విడివడ్డారు. అగర్వాల్ ప్రజలు అగ్రొహ వశీయులు.[4] అగ్రొహ పట్టణం నుండి వచ్చిన వారికి భక్తి అధికం. ఓస్వాల్, మహేశ్వరీలు రాజస్థాన్ నుండి వలస వచ్చిన ప్రజలు.[4] హిసార్ జిల్లాలోని గుజార్ ప్రజలు రాజస్థా నుండి వచ్చి స్థిరపడిన ప్రజలు.[4]
విభాగాలు
హిసార్ జిల్లా పునర్విభజన జరిగే వరకు హిసార్ నగరం జిల్లకు దీర్ఘకాలం కేంద్రంగా ఉంది. 1966లో జింద్ జిల్లా ఏర్పాటు చేయబడిన సమయంలో జిల్లాలోని కొన్ని భాగాలు జింద్ జిల్లాలో చేరాయి. 1974లో భివాని, లోహారు తాలూకాలు భివాని జిల్లా లోకి చేరాయి. సిర్సా జిల్లా ఏర్పాటు చేసిన తరువాత జిల్లాలోని మరికొంత భూభాగాన్ని సిర్సా జిల్లాలో చేర్చారు.
- ప్రస్తుతం హిసార్ జిల్లాలో 4 తాలూకాలు 3 ఉపవిభాగాలు ఉన్నాయి: (హిసార్, హంసి, నార్నౌడ్ తాలూకాలు, అదాంపూర్), ఉపతాలూకాలుగా బర్వాలా, ఉక్లానా, బాస్ ఉన్నాయి.
విద్య
- శానినికేతన్ విద్యా పీఠం (తోషం రోడ్ లాడ్వా) లో 1975 నుండి మొదటి సారిగా 3 సంవత్సరాల టెక్నికల్ కోర్స్, 4 సంవత్సరాల టెక్నికల్ కోర్స్ (బి.టెక్) అందిస్తుంది.
- హిసార్ జిల్లాలో 3 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. చౌదరీ చరణ్ సింగ్ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం ఉంది. ఆరంభంలో ఇది పంజాబు అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం (లూఢియానా)లో స్థాపించబడింది. ఆసియాలో ఉన్న అత్యున్నత యూనివర్శిటీలలో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది.
- " లాలాలజపతిరాయ్ యూనివర్శిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ అనిమల్ సైంస్ " జంతుసంబంధిత విద్యకు ఫలవంతమైన వర్తమానం, విశ్వసనీయమైన భవిష్యత్తుకు దోహదం ఇస్తుంది. గొప్ప దేశభక్తుడైన లాలాలజపతి రాయ్ ఙాపకాలను గౌరవిస్తూ విశ్వవిద్యాలయం ఆవరణలో లాలాలజపతి రాయ్ విగ్రహం ప్రతిష్ఠినబడింది.
- 1995లో హిసార్‌లో స్థాపించబడిన " గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం ఆఫ్ సైంస్ అండ్ టెక్నాలజీ " దేశం అంతటి నుండి, విదేశాలబ్నుండి ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి విద్యార్థులను ఆకర్షిస్తుంది.
- హిసార్ లోనిండి.ఎల్.ఎ వద్ద యు.సి ఎం.ఎ.ఎస్ (యూనివర్శిటీ ఆఫ్ మెంటల్ ఆర్థమెటిక్ సిస్టం ) ఇంస్టిట్యూట్ 4-13 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధిచేయడానికి అవసరమైన సాంకేతిక విద్యను అందిస్తుంది. ఇక్కడ విద్యార్థులకు సాంకేతిక విద్యతో ఒకేషనల్ శిక్షణా తరగతులు కూడా నిర్వహించబడుతున్నాయి.
ఇవి కూడా చూడండి
వెలుపలి లింకులు

వికీమీడియా కామన్స్‌లో Hisar districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.