ఫరీదాబాద్ జిల్లా
హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో ఫరీదాబాద్ జిల్లా (హిందీ: फरीदाबाद जिला) ; (పంజాబీ: ਫਰੀਦਾਬਾਦ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. ఫరీదాబాద్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. ఢిల్లీ- మథుర (షేర్షా - సూరీ మార్గ్) రహదారి జిల్లా మద్యగా పోతుంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 2151 చ.కి.మీ. జనసంఖ్య 21,93,276. ఈ జిల్లా గుర్‌గావ్ డివిజన్‌లో భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ఫరీదాబాద్ జిల్లా హర్యానా రాష్ట్రం లోని జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లా.[1]
పేరు వెనుక చరిత్ర
జిల్లా కేంద్రం పేరే జిల్లా పేరుగా నిర్ణయించారు. జహంగీర్ కోశాధికారి షైక్‌ఫరీద్ ఫరీదాబాద్ నగరాన్ని స్థాపించి దీనికి ఫరీదాబాద్ అని పేరు నిర్ణయించాడు. ఈ ప్రాంతం సందర్శించిన షైద్‌ఫరీద్ ఇక్కడ నగరాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఇక్కడ నిర్మించబడిన నగరానికి ఫరీద్ పేరు నిర్ణయించబడింది. గోపాల్ కాలనీ తలాబ్ రోడ్డు మీద ఫరీద్ సమాధి (మక్బరా) నిర్మించబడింది. దానిని ఇపాటికీ ప్రజలు సందర్శింస్తుంటారు.
చరిత్ర
1979 ఆగస్టు 15 గుర్‌గావ్ జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి ఫరీదాబాద్ జిల్లా రూపొందించబడింది.
ఆర్ధికం
హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తించబడుతుంది. ఢిల్లీ - మథుర మార్గంలో ఢిల్లీకి సమీపంలో ఉండడం కారణంగా ఫరీదాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. పరిశ్రమల స్థాపకులకు ఫరీదాబాద్ అభిమాన నగరంగా ఉంది. ఫరీదాబాద్ ట్రాక్టర్, మోటర్ సైకిల్, స్విచ్ గీర్, రిఫ్రిజిరేటర్స్, షూస్ , టైర్లు , ఇతర ఉత్పత్తులకు ప్రాముఖ్యత వహించింది.అయినప్పటికీ ప్రస్తుత కాలంలో నోయిడా, ఒఖ్లా , గుర్‌గావ్‌లు పారిశ్రామికంగా ఫరీదాబాద్‌ను అధిగమించాయి.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,798,954, [1] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 266వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 2269 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 31.75%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 871:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 83%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఫరీదాబాద్ , పాల్వాల్ జాట్ జాతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. మొత్తం ప్రజలలో వీరు 21%, 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థానీ వలస పంజాబీ ప్రజలు 16%, బ్రాహ్మణులు 11% ఉన్నారు.
బయటి లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.