ఝజ్జర్ జిల్లా
హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో ఝజ్జర్ జిల్లా ఒకటి. 1997 జూలై 15న రోహ్‌తక్ జిల్లాలోని కొంతభాగాన్ని విడదీసి ఝజ్జర్ జిల్లాను ఏర్పాటు చేసారు. ఝజ్జర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లాలో బహదూర్గఢ్, బెరి వంటి పట్టణాలు కూడా ఉన్నాయి. బహదూర్‌గఢ్‌ను రాతి జాట్‌లు స్థాపించారు. బహదూర్గఢ్ ఒకప్పుడు షరఫాబాద్ అని పిలువబడింది. ఇది ఢిల్లీ నుండి 29కి.మీ దూరంలో ఉంది. ఇది పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది.
ఝజ్జర్ జిల్లా
झज्जर जिला | |
---|---|
![]() హర్యానా పటంలో ఝజ్జర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | ఝజ్జర్ |
మండలాలు | 1. ఝజ్జర్, 2. మతన్ హైల్, 3. బేరి, 4. బహాదుర్‌గఢ్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,834 కి.మీ2 (708 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 8,80,072 |
• జనసాంద్రత | 480/కి.మీ2 (1,200/చ. మై.) |
• Urban | 2,217% |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
ఝజ్జర్ జిల్లా 1,890 చ.కి.మీ, 2001 గణాంకాలను అనుసరించి జంసంఖ్య 7,09,000.జిల్లాలో 2 పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో 2408 ప్లాట్లు ఉన్నాయి. సెరామిక్స్, గ్లాస్, కెమికల్స్, ఇంజనీరింగ్, ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 48 బృహత్తర, మద్యతరహా పరిశ్రమలు, 213 చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక సంస్థల కొరకు పెట్టిన పెట్టుబడి 3,400 మిలియమ్ల. అలాగే ప్రదేశ వైశాల్యం 8,248 చ.కి.మీ. మొత్తం వ్యవసాయభూమి వైశాల్యం 670చ.కి.మీ.
- చాజూ లేక చాజూనగర్ అని పిలువబడిన ప్రాంతం తరువాతి కాలంలో ఝజ్జర్‌గా పిలువబడింది. మరొక కారణం సహజసిద్దమైన ఫౌంటెన్ జార్నగర్ కూడా ఈ పేరు రావడానికి కారణం అయింది.
3 వ కారణం ఈ ప్రాంతంలో ఝజ్జర్ జలాశయం ఉన్న కారణంగా కూడా ఈ పేరు వచ్చింది.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 9,56,907[1] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | మొంటానా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 456వ స్థానంలో ఉంది.[1] |
1 చ.కి.మీ జనసాంద్రత. | 522 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 8.73%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 861:1000 [1] |
జాతీయ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 80.8%.[1] |
జాతీయ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో అత్యధికంగా జాట్ జాతికి చెందిన ప్రజలు ఉన్నారు. తరువాత గుర్తించతగినంత బ్రాహ్మణులు ఉన్నారు. అహ్రీలు అధికంగా ఒక గ్రామం అంతా ఉంది.2011 గణాంకాలను అనుసరించి ఝజ్జర్ జిల్లా స్త్రీ: పురుష నిష్పత్తి 774:1000 ఉంటుంది.[4] జజ్ఝర్‌లో 2 గ్రామాలలో స్త్రీ:పురుష నిష్పత్తి (378:1000, 444:1000 ) తక్కువగా ఉంటుంది.[5] ఝాజ్జర్ తల్లితండ్రులు చట్టవిరుద్ధంగా రిజిస్టర్డ్ క్లినిక్స్‌లో ఉదయకాలం అల్ట్రాసౌండ్ పరీక్షచేయించి గర్భశిశువు ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకుంటారు. ఇది తలుసుకోవడానికి వారు ఒక రహస్య సంకేత్ పదాన్ని (లడ్డూ అంటే మగబిడ్డ, జిలేబీ అంటే ఆడపిల్ల) వాడుతుంటారు అని అర్ధం. [4] భారతదేశంలో అత్యల్పంగా స్త్రీలు ఉన్న జిల్లాగా ఝజ్జర్ గుర్తించబడుతుంది.
విభాగాలు
- ఝజ్జర్ జిల్లా 3 ఉప విభాగాలు విభజించబడింది:- ఝజ్జర్, బహదుర్గా, బెరి.
- ఝజ్జర్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి: ఝజ్జర్, మాటంహైల్.
- బహదుర్గా ఉపవిభాగంలో ఒకే తాలూకాగా ఉంది:
- జిల్లాలో 4 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: బగదుర్గా, బాడి, ఝజ్జర్, బెరి. ఇవన్నీ రోతక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
పరిశ్రమలు
కుటీరపరిశ్రలు
2000 డిసెంబరు 31 నాటికి ఝజ్జర్ జిల్లాలో 1818 కుటీరపరిశ్రలు నమోదై ఉన్నాయి. ఈ పరిశ్రమలకు మొత్తంగా పెట్టుబడి 9550.01 లక్షలు. ఈ పరిశ్రమలు మొత్తంగా 12153 మందికి ఉపాధి కలిగిస్తుంది. ఇవి మొత్తంగా రైలు మార్గంతో అనుసంధానించబడతాయి.
బృహత్తర, మద్యతరహా పరిశ్రమలు
జిల్లాలో 35 బృహత్తర, మద్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. బెరి గ్రామంలో ఒకప్పుడు బర్గుజార్ వంశీయ రాజపుత్రులు ఉన్నారు. వారు ముస్లిం మతాన్ని స్వీకరించిన తరువాత (బహుశా బ్రిటిష్ కాలంలో) నూనె ఉత్పత్తిని వృత్తిగా స్వీకరించారు. వీరిని బెరీ తెలీ (నూనె)కుటుంబం అంటారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.