హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
పల్వల్ జిల్లా (హిందీ : पलवल जिला ) హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో 21 వది. పల్వల్ పట్టణం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.ఈ జిల్లా ఢిల్లీ - మధుర హైవే మీద ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల ( NH -2) దూరంలో ఉంది. పట్టణం 28° 40' ఉత్తర అక్షాంశం, 76 ° 59' రేఖాంశాల మధ్య ఉంది.[1] ఇతిహాస కాలం నుండి దీని ప్రస్తావన ఉంది.[2] ఆనాటి పాండవ రాజ్యంమయిన ఇంద్రప్రస్థలో భాగంగా వుండేది. విక్రమాదిత్యుడు దీన్ని పునరుద్ధరించాడు.
పల్వల్ జిల్లా
पलवल जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | పల్వల్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,359 కి.మీ2 (525 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,40,493 |
• జనసాంద్రత | 770/కి.మీ2 (2,000/చ. మై.) |
• Urban | 2,35,663 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.32% |
• లింగ నిష్పత్తి | 879 |
ప్రధాన రహదార్లు | 2(NH-2), KMP Expressway. |
సగటు వార్షిక వర్షపాతం | 60-100 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
పల్వల్ జిల్లాలో హౌసింగ్ బోర్డ్ కాలనీ, న్యూ కాలనీ, మైన్ మార్కెట్టు, షివపురి, కృష్ణా కాలనీ, కేంప్ కాలనీ, హుడా సెక్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇది ఢిల్లీ, గుర్‌గావ్,నోయిడా,ఫరీదాబాద్,మథుర వంటి నగరాలకు సమానదూరంలో ఉంది కనుక భారతప్రభుత్వం పల్వల్ నగరాభివృద్ధి కొరకు ప్రత్యేకశ్రద్ధ వహిస్తుంది. పల్వల్ నగరం వ్యవసాయ, వాణిజ్య పరంగా ప్రాధాన్యత కలిగి ఉంది.
బలరాముడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి పాలకుడైన పాల్వాసురుడిని సంహరించిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికీ పేరు వచ్చింది. అందుకు గుర్తుగా పల్వల్‌లో " బలదేవ్ చాట్ కా మేళా " నిర్వహిస్తారు. మునిసిపల్ ఆఫీస్ చౌక్ వద్ద " బలరాముని ఆలయం " ఉంది. పల్వల్ రైల్వే స్టేషను వద్ద మహాత్మా గాంధీని మొదటి సారిగా అరెస్టు చేసారు. దీనికి గుర్తుగా నగరంలో "గాంధి ఆశ్రమం" అనే భవనాన్ని నిర్మించారు.
ముహమ్మద్ అజం షా పల్వల్‌ను పాలిస్తున్న సమయంలో సయ్యద్ యూసఫ్ అలి పాల్వాలి నగరప్రముఖులాలో ఒకడుగా ఉంటూ ఉండేవాడు. 1707 జూన్ 19లో జజువాన్ యుద్ధంలో సయ్యద్ యూసఫ్ అలి పాల్వాలి మరణించాడు.[3][4] 17వ శతాబ్దంలో పల్వల్ వాసి ఖాన్ మొహమ్మద్ కుమార్తెతో క్వాజి సయ్యద్ ముహమ్మద్ రఫితో వివాహం జరిగింది. క్వాజి సయ్యద్ ముహమ్మద్ రఫి కుమారుడు ముహమ్మద్ బాక్వర్ పల్వల్ వాసి అయిన సుల్తాన్ బీబిని వివాహం చేసుకున్నాడు. మొహమ్మద్ బాకర్ కుమార్తె " ఖైరన్ నిస్సాన్ " పల్వల్ వాసి అయిన ముహమ్మద్ ఇక్రం ఇబ్న్ సుల్తాన్ ముహమ్మద్ ( పాల్వాన్ ప్రధాన క్వాజీ) ని వివాహం చేసుకున్నది. కైరన్ నిస్సాన్, మొహమ్మద్ ఇక్రం కుమార్తె నూరన్ నిస్సాన్ క్వాజీ సయ్యద్ హయతుల్లా కుమారుడు మొహమ్మద్ మురీడ్‌ను వివాహం చేసుకుంది. క్వాజీ సయ్యద్ ముహమ్మద్ రఫి పల్వల్ వాసి అయిన ఫాజల్ నిసాన్‌ను వివాహం చేసుకుంది. మొహమ్మద్ సయ్యద్ ఇబ్న్ కుమార్తె ముహమ్మద్ హుస్సేన్ ఇబ్న్ మౌలానా అబ్దుల్ ఖైర్‌ను వివాహం చేసుకుంది. పల్వల్, సక్రాల మద్య వివాహ సంబంధాలు ఈ రెండు ప్రదేశాలమద్య ఉన్న సంబంధాలను తెలుపుతుంది.
బ్రిటిష్ పాలనా కాలంలో పల్వల్ పంజాబు ప్రోవింస్‌లో, గుర్‌గావ్ జిల్లాలో భాగంగా ఉంది. 1857లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు పల్వల్ ప్రజలలో చాలా మంది మద్దతు తెలిపారు. ఈ తిరుగుబాటులో పల్వల్‌లో మాత్రం హయత్ అలి, కైరత్ అలి మరొక 17 మందితో బలయ్యారు. ఉరితీయబడడానికి ముందు హయత్ అలి గృహంర్భంధంలో ఉంచబడి తరువాత ఢిల్లీకి తీసుసుకు పోబడి తరువాత ఉరితీయబడ్డాడు. అంతేకాక ఆయన కుటుంబంలోని పురుషులందరూ ఉరితీతకు గురైయ్యారు. అత్యధిక సంఖ్యలో ఖైదుకు గురైయ్యారు. పల్వల్ తాసిల్దార్ గాజుల వ్యాపారిగా హయత్ అలి ఇంటికి వెళ్ళి ఆయన 2 సంవత్సరాల మనుమడు నాజీర్ అలిని గాజుల బుట్టలో పెట్టుకుని రక్షించాడు. తరువాత తాసిల్దార్ పిల్లవాడిని నాగీనా అరణ్యాలలో వదిలాడు. ఆయనను అనుసరించి వెళ్ళిన హయ్యత్ అలి కుటుంబంలోని స్త్రీలు అరణ్యం నుండి పిలావాడిని తీసుకుని సురక్షితంగా తిజరాకు చేరారు. ఉరితీసిన 17 మంది సభ్యులలో హయత్ అలి అల్లుడు ఇరాదత్ అలి బిన్ రుస్తం అలి ఉన్నాడు. బ్రిటిష్ సైన్యం పింగ్వాన్ కుటుంబాన్ని వేటాడినప్పుడు ఇరాదత్ అలి సోదరుడు కరామత్ అలి మాత్రం ప్రాణాలతో తప్పించుకుని తిజరా చేరుకున్నాడు. తరువాత కరామత్ తన పేరును జమిన్ అలిగా మార్చుకున్నాడు.[5]
1979 ఆగస్టు 15 గుర్‌గావ్ జిల్లా అదనంగా విభజించబడి ఫరీదాబాద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. పల్వల్ ఫరీదాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. [6] 2008 ఆగస్టు 15న పల్వాల్ హర్యానా రాష్ట్రంలో 21వ జిల్లాగా చేయబడింది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,040,493,[7] |
ఇది దాదాపు. | సప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[9] |
640 భారతదేశ జిల్లాలలో. | 436వ స్థానంలో ఉంది.[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 716 [7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.49%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 879:1000 [7] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 70.3%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. |
2011 గణాంకాలను అనుసరించి [10] పల్వల్ జనసంఖ్య 235663, పురుషుల 53%, స్త్రీలశాతం 47%, సరాసరి అక్షరాస్యత 71%, పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 67%., 6 వయసు లోబడిన పిల్లల శాతం 20%. హర్యానాలో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామంగా పల్వల్‌కు గుర్తింపు ఉంది.
పల్వల్ పాఠశాలలకు ప్రఖ్యాతి చెందినది. జిల్లాలో పలు పాఠశాలలు ఉన్నాయి:
జిల్లాలో పలు కళాశాలలు ఉన్నాయి. పల్వల్ రాష్ట్రంలో విద్యాకేంద్రగా అభివృద్ధిచెందుతుంది. జిల్లాలో 12 ఇంజనీరింగ్ కాళాశాలలు, మేనేజ్మెంటు కాళాశాలలు, డీగ్రీ కాళాశాలలు ఉన్నాయి.
పల్వల్ నుండి పలు రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. పల్వల్ రైల్వే స్టేషను నుండి ఢిల్లీ వరకు పలు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ- పల్వల్ మద్య మహిళా ప్రత్యేక రైలు ఆరంభించబడింది. దూరప్రాంతాలకు చేరడానికి పలు సూపర్ ఫాస్ట్ రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
పలు మతాలకు చెందిన ఆలయాలు ఉన్నాయి.
పల్వల్‌లో అధునాతన సాంకేతిక వసతులు కలిగిన ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో అత్యధికభాగం నగరసరిహద్దులలో ఉన్నాయి.
పల్వల్ నగరంలో ప్రజలు గుమికూడాడామికి అనువైన ప్రదేశాలు, పచ్చదనం అధికంగా ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ ప్రజలలో ఆరోగ్యపరమైన జాగరూకత పెంపొందేలా చక్కగా నిర్వహించబడుతూ ఉండడం విశేషం.
ఫారెస్ట్ శాఖ రెండు పథకాలను అమలు చేస్తుంది: అడవులు, మట్టి పరిరక్షణ భూమి పునరుద్ధరణ. ఎంఒఇఎఫ్, ప్రభుత్వ జాతీయ అడవులను విధానం ప్రకారం. 1/3 భారతదేశం భూభాగంలో చెట్లు ఉండాలి. ఈ లక్ష్యం సాధించడానికి భారీ స్థాయి పంచాయితీ, ప్రభుత్వం, ప్రైవేట్ భూమిలో మొక్కల నాటే ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గత 20 సంవత్సరాలనుండి రైతులు తమ పొలాలలో నాటడానికి వేప, యూకలిఫ్టస్, షిషాం, ఇతర పండ్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి.
జిల్లాలో 282 గ్రామాలు, 237 గ్రామ పంచాయతీలు, 1 మునిసిపల్ కౌన్సిల్, 2 మున్సిపల్ కమ్యూనిటీ కమిటీ, 3 సబ్ డివిజన్లు, 4 డెవెలెప్మెంటు బ్లాక్స్, 3 తాలూకాలు. ఇవి ఉంది డివిషనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్ బ్లాక్ డెవెలెప్మెంటు, పనచాయితీ అధికారి అధ్వర్యంలో పనిచేస్తుంది. బ్లాకులు అన్నీ స్వర్ణ జయంతి గ్రాం స్వరోజ్‌ఘర్ యోజనా, ఇతర అభివృద్ధి కార్యక్రాల పరిధిలో ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను డెఫ్యూటీ కమీషనర్ - చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిర్వహించబడుతుంటాయి.
జిల్లా గణాంకాల ప్రత్యేక వీక్షణ.
ఎ. భూమి ఉపయోగం
టెలిఫోన్ 2010-11 * (డి) సాంద్రత సంఖ్యలు. / 1000
అల్లోపతిక్ లో * (బి) పడకలు
ఆయుర్వేదలో * (డి) పడకలు
హైడ్రాలిక్ టర్బైన్ల ఘర్షణ మెటీరియల్, రియర్ ఆక్సిల్ ఉండడం, ఎలివేటర్లు, భాగంలో లోడ్ చేయాల్సిన యంత్రాలు, క్రేన్లు, పైకెత్తు, రెడీ మేడ్ గార్మెంట్స్, నీడిల్ రోలర్స్. Azoinitiators, డైరీ పరికరాలు, సోఫాలోని పరికరాలు, సారం, చెక్క ఫర్నీచర్, డాగ్ ఫుడ్, GIPipes, పల్ప్, గింజ బోల్టులు CICastings, మిల్క్ పౌడర్, నెయ్యి మొదలైనవి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.